Site icon Sanchika

పుష్పాంజలి

తమ గోడు వినమనీ, తమని బ్రతకనిమ్మనీ పుష్పాలు మానవులను వేడుకుంటున్నాయి తాళ్ళపూడి గౌరి వ్రాసిన “పుష్పాంజలి” కవితలో.

కొమ్మల నడుమ రెమ్మల చాటున
అందాల మకరందాల సుమాన్ని నేను
అని మదిలోనే పులకరించితిని
ఆహా నేను ఎవరి కండ్లకు కానరాను.

కొమ్మల మాటున నా జీవితము హాయిగా
ముగిసిపోవును అని ఆనందించే సమయాన
ఒక యువకుని కన్నులు నాపై పడెను.
నన్ను తుంచి తన ప్రేయసికి బహుకరించెను

ఆమె నన్ను ధరణిపై విసిరి తన పాదాలతో
తొక్కివేసెను నా జీవితము ముగిసెను
కొన్ని ఘడియల నా జీవితమును రెండు
క్షణాలలో ముగింపజేసెను.

ఓ మానవులారా పువ్వు వలె పుట్టిన మేము
ప్రాణము వున్న మూగ జీవులం మమ్ములను
చూస్తూ మురిసిపోతూ మమ్మలని అవసరాలకు
వాడి మా జీవితాన్ని మట్టిపాలు చేసెదరు.

ఓ మానవులారా  మా గోడు వినండి
కొమ్మలపై మమ్ములను నిలవనివ్వండి బ్రతకనివ్వండి

Exit mobile version