Site icon Sanchika

పుట్టబడి

[dropcap]”సృ[/dropcap]ష్టికర్త  ఎవరునా?”

“నేనేరా”

“నువ్వా… అదెట్ల?”

“అదో ఆ టెస్టుబ్ బేబినీ, ఆ జంతువుని, ఈ చెట్లని పుట్టబడి చేసింది నేనేరా”

“ఓహో… అట్లనా… మడి (మరి) ఇన్ని పుట్టబడి చేసిన నిన్ని ఎవరు పుట్టబడి చేసిరినా?”

“ప్రకృతమ్మరా”

“ఆ ప్రకృతమ్మని ఎవరు పుట్టబడి చేసిరినా?”

“ఆయమ్మని ఎవరూ పుట్టబడి చేయలే. ఆయమ్మ అట్లే పుట్టే”

“అట్లె పుట్టేకి అదెట్ల అవుతుందినా? నీ మాట నేను నమ్మేల్దునా?”

“నేను నమ్ముతానురా. ఎవరు ఎట్ల పుట్టబడి చేసిరో నువ్వు చెప్పరా”

నేను రవంత సేపు అందాజు చేసి “దేవుడునా” అంట్ని.

“అట్లే కాని ఆ దేవున్ని ఎవరు పుట్టబడి  చేసిరిరా”

“ఎవ్వరో పుట్టబడి చేయలే. ఆయప్ప అట్లే పుట్టే”

“అయినా పర్వాలే… ఆయప్ప ఏడ వుంటాడో చూపీయి”

“అదే అయ్యే పని కాదునా?”

“కదా! అట్లయితే నీ దేవుడు కూడా అట్లే పుట్టేది కాని పని. ఈ అనంత ప్రకృతిలా ఏది పుట్టినా, పెరిగినా, విరిగినా కనబడుతుంది, వినబడుతుంది లేదా అనుభవానికి వస్తుంది. అది తెలుసుకోరా” అని పొయే అన్న.

***

పుట్టబడి  = తయారు చేయడం

Exit mobile version