చరవాణి నానీలు
1.
[dropcap]చ[/dropcap]రవాణి
అందరి గుప్పెట్లో
కాదు కాదు
దాని గుప్పెట్లో జనం
2.
చరవాణి
సెల్ఫీలు తీసుకోమంటుంది
ప్రమాదాలు
లెక్క చేయని జనం
3.
చరవాణితో
ఎవరికి వారే యమునా తీరే
అలా ఆడిస్తుంది
మరి!
4.
చరవాణి
అద్భుతం
సప్త సముద్రాలవలవారి
మాటల్ని వినిపిస్తుంది
5.
చరవాణి
గుప్పెట్లో సమాజం
నాట్యమాడిస్తుంది
ఆ సమాజాన్ని
6.
చరవాణిలో
చాటింగ్, వీడియో కాల్స్
అంతులేని
అనర్థాలకు దారి
7.
చరవాణీ చరవాణీ
నీ లక్ష్యం ఏమిటి?
సమాజాన్ని
నాశనం చేయటమే
8.
సమాజానికేం తెలుసు
చరవాణి లక్షణం
జనాన్ని
పీల్చి పిప్పి చేస్తుంది
9.
చరవాణి
అన్నివిధాలా అనర్థమనుకుంటే తప్పు
వాడే విధానం
లోపం