Site icon Sanchika

రాజ‘కీ’యం..!!

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘రాజ‘కీ’యం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

1.
రాజకీయంలో –
పదేపదే..
కండువా మార్చడం
అదికార దాహమే!

2.
ప్రజాసేవ కోసం
పదవులతో
పని ఏమి..!?
దృఢ సంకల్పం చాలు!!

3.
తన్ను తాను
రక్షించుకోలేడు
ప్రజలను–
ఎలా రక్షిస్తాడు!?

4.
‘సెక్యూరిటీ’ షోకులో
ప్రజాప్రతినిధి..!
వీళ్ల రక్షణే
నేడు ప్రజల విధి..!!

5.
నాయకులందరూ
ప్రజానాయకులా?
స్వార్థం, నిస్వార్థం..
నిగ్గు తేల్చె లిట్మస్..!!

6.
రాజకీయం..
ఉపాధి కోసం కాదు!
ప్రజోద్ధరణ కోసం,
పరిమళించే త్యాగం!!

Exit mobile version