[box type=’note’ fontsize=’16’] 63వ రైల్వే వారోత్సవాలలో భాగంగా సికింద్రాబాదులోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో 11 ఏప్రిల్ 2018వ తేదీన “రైలు కథలు” కథాసంకలానాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఆ సభ వివరాలను అందిస్తున్నారు కోడీహళ్లి మురళీమోహన్. [/box]
63వ రైల్వే వారోత్సవాలలో భాగంగా సికింద్రాబాదులోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో 11 ఏప్రిల్ 2018వ తేదీన ప్రాంతీయ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో “రైలు కథలు” కథాసంకలానాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జనరల్ మేనేజర్ శ్రీ జాన్ థామస్, సీనియర్.డెప్యుటీ జనరల్ మేనేజర్ శ్రీ అశేష్ అగ్రవాల్ పాల్గొన్నారు. ఆవిష్కరణ సమయంలో “రైలు కథలు” గౌరవ సంపాదకులు, దక్షిణమధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి అయిన శ్రీ ఉమాశంకర్‌కుమార్, సంపాదకులు శ్రీయుతులు కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్, సాదనాల వేంకటస్వామినాయుడు, కథా రచయితలు సర్వశ్రీ ఎన్.అనంతలక్ష్మి, జియో లక్ష్మణ్, గంటి భానుమతి, నల్ల భూమయ్య, బలభద్రపాత్రుని రమణి, పొత్తురి విజయలక్ష్మి, భీమరాజు వెంకటరమణ, ఎం.వెంకటేశ్వరరావు, ఆకెళ్ళ శివప్రసాద్, శ్రీధర మూర్తి, వేదాంతం శ్రీపతిశర్మ, అయాచితం స్పందన మొదలైనవారు వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమం తరువాత డా.రేవూరి అనంతపద్మనాభరావు రచించిన “దక్షిణ మధ్యరైల్వేలోని పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు” అనే పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది.
సభ అనంతరం రచయితలు, సంపాదకులు ఆడిటోరియం ఆవరణలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రచయితలందరూ ఈ పుస్తకం కార్యరూపం దాల్చడానికి కారకులైన శ్రీ ఉమాశంకర్ కుమార్ గారిని, శ్రీ కస్తూరి మురళీకృష్ణగారిని అభినందించారు. మరియు వారికి ధన్యవాదాలను తెలిపారు.
శ్రీ ఉమాశంకర్ కుమార్ మాట్లాడుతూ రైల్వే నేపథ్యం కలిగిన కథల సంపుటి ఇదివరకు ఏ భాషలోను వెలువడలేదని, ఈ ఘనత మన తెలుగు రచయితలకే చెందుతుందని, ఈ పుస్తకంలో కథలను వ్రాసిన ప్రతి రచయితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాన్ని హిందీ, ఇంగ్లీషు భాషలలో అనువదించి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తామని వారు తెలియజేశారు. ఈ ఆవిష్కరణ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది.
కోడీహళ్లి మురళీమోహన్