Site icon Sanchika

రైలుబండి కథలు – పుస్తక పరిచయం

[dropcap]రై[/dropcap]ల్వే అధికారి డా. దుట్టా శమంతకమణి రచించిన 31 కథల సంపుటి ‘రైలుబండి కథలు’. రైలుబండి కథ, ఆలంబన, దోషి, గుండెచప్పుడు, నిరీక్షణ, కళాకౌముది, వ్యత్యాసం, అహం మిధ్య, జెండా-ఎజెండా ఈ పుస్తకంలోని కొన్ని కథలు.

***

“పగలు రేయీ జీవకళతో విరాజిల్లే విజయవాడ రైల్వే జంక్షన్ ఈ రైలుబండి కథలకు మూలాధారం. నిత్యం ప్రయాణీకులతో, అనౌన్స్‌మెంట్‌లతో వెలువడే సందడి, నా నివాసగృహంలో, నా జీవితంలో అంతర్భాగం… బహుశా అందుకేనేమో ఇనుము, సిమెంట్‌లతో కట్టిన కట్టడంలాగా కాక ఓ ప్రాణ స్నేహితుడిలా అనిపిస్తుంది.

~

2016 జనవరి మాసంలో ఆరంభమై 2018 జూలై మాసం వరకు కొనసాగిన ఈ కథలు ఓ క్రమంలో మాసాల ప్రత్యేకత ఆధారంగా రాసినవి. యాదృచ్ఛికం అనడం ఆత్మవంచన. భిన్న సంఘటనల, విభిన్నవ్యక్తుల సమాహారమే జీవితం. వీటిని కలిపే అంతఃస్సూత్రం ప్రేమ. ఈ 31 కథలను బోగీలుగా భావిస్తే సామాజిక సమస్యలను వెస్టిబ్యూల్‌లా అమర్చాను. ఈ కథలు కాలానికి నిలుస్తాయా? కరిగిపోతాయా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది” అని ‘పయనం వెనుక ప్రయాణం’ అన్న ముందుమాటలో రచయిత్రి వ్యాఖ్యానించారు.

***

రైలు బండి కథలు
డాక్టర్‌ దుట్టా శమంతకమణి
వెల: రూ 300
పేజీలు: 185
ప్రచురణ:
సమన్విత
ప్రతులకు:
సమన్విత, డోర్ నెం. 3-274/207,
శ్రీ రామ్స్ స్నేహ ఎవెన్యూ,
కుంచనపల్లి (వి), తాడేపల్లి(మం)
అమరావతి, ఆంధ్రప్రదేశ్ 522501
9491962638

Exit mobile version