రైతన్నా..!!

0
1

[box type=’note’ fontsize=’16’] ప్రశ్నించే ధైర్యం లేక, బతుకుపై ధీమా రాక, పురుగుల మందులతో సావాసం చేస్తున్న రైతన్నకు తన వంతు సాయం చేసి, రైతే రాజు అనే నానుడిని నిజం చేయడానికి ప్రయత్నిస్తానంటున్నారు యువకవి ఆదిత్య విష్ణువర్ధన్రైతన్నా” కవితలో. [/box]

[dropcap]ప[/dropcap]ట్టుదలకు నిలువుటద్దానివి..
శ్రమకు మారుపేరువి…
ధరణీ బాంధవుడివి..
అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డవి..
ఆకలి తీర్చే శరణాగతుడివి..
నీవు లేని సమాజం,
గుండె లేని శరీరం..
ప్రపంచానికి మార్గదర్శకుడివి..
వ్యవ”సాయానికి” కట్టుబానిసవి…

 

కానీ,,
రైతే రాజు..!!
ఇది ఒకప్పటి మాట..
రైతేం చేయగలడు??!!
ఇది నేటి తరపు తూటా..!!
అయ్యో రైతన్నా..!!
ఈ లోకపు పాపాలలో,
ఈ లోకపు తాపాలలో చిక్కుకొని…
కష్టానికి కేరాఫ్ అడ్రస్ వైనావు..
కన్నీటి వడగండ్లతో కొట్టుమిట్టాడుతున్నావు..
అప్పుల ఊబిలో చిక్కుకున్నావు..
బకాసురుల భూదాహానికి బలైపోయావు…
రాజకీయ అక్రమార్జన లో చిక్కుకున్నావు..
ఆకలి తీర్చే నీవు,
అర్ధాకలితో అడుగంటుతున్నావు…
నీటితో తడవాల్సిన పొలాలు,
నీ రక్తంతో తడుస్తున్నాయి…
పిల్లలు ఊగాల్సిన కొమ్మలకు,
నీ దేహం ఊగుతోంది..
ప్రశ్నించే ధైర్యం లేక,
బతుకుపై ధీమా రాక,
పురుగుల మందులతో సావాసం చేస్తున్నావ్…
మౌనంగా మట్టిలో కలిసిపోతున్నావ్…

తట్టుకోలేకున్నాం అన్నా!!
నీ భవితకు మా భరోసా కల్పించలేకున్నాం అన్నా..!!!
నీకు ఏమాత్రం సాయం చేయలేని మానవ మాత్రులం అయిపోయాం అన్నా..!!
కానీ ఎన్నాళ్ళిలా??
ఇకనైనా మేల్కొంటాం..!!
భావి భారతావని సౌఖ్యం కోసం,
రైతే రాజు అనే మాటను నిజం చేయడం కోసం,
నీకష్టానికి సాయం అందిస్తాం..
నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తాం..
మన బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే పూనుకొంటాం…

 

నేలతల్లి సాక్షిగా…!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here