Site icon Sanchika

రైతు కష్టం

[dropcap]హె[/dropcap]లికాప్టర్ నుండి
విసిరేసే ఆహార పొట్లాలకోసం
ఎదురు చూసే
వరద బాధితులు లాగా
ఆకాశం నుండి
రాలిపడే వాన చుక్కల కోసం
ఎదురు చూస్తున్నావా రైతన్నా..?
నీకు ఎంత కష్టం…ఎంత కష్టం

ఐదేళ్ళకోసారి నాయకులు
ఓటుకు పంచే నోటుకోసం
ఎదురు చూసే
సాధారణ ఓటరు లాగా
ఈ సారైనా
పంట చేతికొస్తుందేమోనని
ఎదురు చూస్తున్నావా రైతన్నా ..?
నీకు ఎంత కష్టం…ఎంత కష్టం

విదేశాలలో ఉన్న తమ పిల్లలకోసం
ఈ సారైనా వస్తారేమోనని
అనాధ ఆశ్రమంలో ఎదురు చూసే
వృధ్ధ తల్లి ,దండ్రులు లాగా
ఈ సారైనా పంట పండి ఐదు వేళ్ళు
నోటిలోకి వెళతాయేమోనని
ఎదురు చూస్తున్నావా రైతన్నా..?
నీకు ఎంత కష్టం…ఎంత కష్టం

 

Exit mobile version