[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న కె. సాయి చరణ్ వ్రాసిన కథ “రైతుల కష్టం తెలియని మనుషులు“. అన్నం వృథా చేస్తున్న యువకులను వారించి, రైతులను గౌరవించమని చెప్పే కథ ఇది. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]
[dropcap]అ[/dropcap]నగనగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో రాములు అనే రైతు నివసిస్తున్నాడు. తనకు పెళ్ళయ్యి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు శివయ్య. ఒక రోజు పొలం పని మీద తండ్రి, కొడుకు కలిసి పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఉన్న తహశీల్దారు కార్యాలయం చేరుకున్నారు. అక్కడకి వాళ్ళు వెళ్ళేడప్పటికి భోజన సమయం కావడమూ, అందరూ భోజనం చేస్తుండటంతో… ‘ఏదైనా హోటల్‌కి వెళ్ళి భోజనం చేయటం మంచిది, తిన్న తరవాత పని ముగించుకొని వెళ్ళొచ్చు’ అని ఆ తండ్రీ కొడుకులిద్దరూ అనుకున్నారు.
ఇద్దరు ఒకరి భుజాల మీద ఒకరు చెయ్యి వేసుకొని ఆ పక్కనే ఉన్న హోటల్‌కి వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. ఇద్దరు ‘ఈ రోజు పని అయిపోతే బాగుండు’ అని తండ్రి అన్నాడు.
‘ఈ రోజు ఎలాగయినా అయిపోయిదిల్లే నాన్నా. నువ్వేమీ కంగారు పడకు’ అని చెప్పాడు శివయ్య. ఇంతలో శివయ్యకు ఫోన్ వచ్చింది.
‘నాన్నా ఫోన్ వచ్చింది, పక్కకి వెళ్ళి పోన్ మాట్లాడి వస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో’ అని చెప్పాడు.
రాములు ‘సరే బాబూ’ అని అన్నాడు. వాళ్లతో పాటు వచ్చిన మరో ఇద్దరు కుర్రాళ్ళు పక్కనే ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. భోజనం తెప్పించుకొని తింటున్నారు.
రాములు ఏదో అలోచిస్తున్నాడు. వాళ్ళిద్దరూ తినటం పూర్తయింది. ప్లేట్లో చేయి కడుక్కున్నారు. రాములు హఠాత్తుగా వాళ్ళ వైపు తల తిప్పాడు.
రాములు వాళ్ళతో “బాబూ ఎందుకు అలా అన్నాన్ని నేలపాలు చేస్తారు” అన్నాడు.
“మీరెవరు మమ్మల్ని అడగటానికి” అని అన్నారు వాళ్ళిద్దరు.
“నువ్వు ఎవరు ఈ ప్రశ్న అడగటానికి” అని ఆ ఇద్దరు కుర్రాళ్ళూ మళ్ళీ అన్నారు.
“నేను ఒక రైతును బాబూ” అన్నాడు రాములు.
“అయితే ఏంటి” వాళ్ళు అన్నారు.
“మీరు తినకపోతే పేదవాళ్ళకు ఇవ్వండి బాబూ. బయట ఎంతో మంది ఆకలితో అలమటిస్తునారు. మీరు సహాయం చేసిన వాళ్ళవుతారు” అని అన్నాడు రాములు.
“నీ పని నువ్వు చూసుకో. హోటల్‌కి వచ్చేమా తిన్నామా పోయామా. అంతే కానీ ఎవరు ఎంత తిన్నారు వదిలేసారా అన్నది నీకెందుకు” అన్నారు కుర్రాళ్ళు.
“నాగరికత తెలిసినవాడిని కదా బాబూ, ఏదో నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది” అన్నాడు రాములు.
“అరే ఊరికే విసిగించకు. మా ఇష్టం వచ్చిన్నట్టు చేస్తాము. నువ్వు ఏమన్నా మా బిల్లు కడుతున్నావా? మా డబ్బులు మా ఇష్టం” అని వాళ్ళిద్దరు అన్నారు.
“అలా కాదు బాబూ. ఎలా బట్టకట్టాలో, ఎలా తినాలో కాదు, అన్నం మెతుకులు ముందు తరానికి ఎలా అందించాలో నేర్చుకోండి. తరువాత తిండి దొరకక, కరెంట్ తీగలపై ఒంటరి పక్షులా మిగులుతారు” అన్నాడు రాములు.
‘అరే ఏంటి ఈ నస’ అని వాళ్ళిద్దరు అనుకున్నారు.
“సమయం వృధా చేయకు. నీ పని నువ్వు చూసుకో” అన్నారు రాములుతో.
“అరే మామా, ఊరోళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా… ఇదిగో చూడు అంతగా అన్నం వృథా అవుతోందని అనిపిస్తే నువ్వే తిను, మేము ఏమి అనుకోం. బిల్లు కూడా మేమే కడతాం” అన్నారు ఇద్దరూ.
“చారన్నమైనా, బిర్యానీ అయినా రైతు పండిస్తేనే మీరు తినేది. రైతు బాధ మీలాంటివాళ్ళకి తెలిసేది ఎప్పుడు” వాళ్ళతో అన్నాడు రాములు.
“హే ఏం మాట్లాడుతున్నావ్? నీకెందుకు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. నువ్వు ఎవరు మాకు చెప్పడానికి? You uneducated useless fellow” అని వాళ్ళిద్దరిలో ఒకడన్నాడు రాములుతో.
“Yes I am useless fellow. Yes I am useless fellow. రైతునై మీలాంటి వాళ్ళకి అన్నం పెడుతున్నాను కదా, నిజంగానే పనికిరాని వాడినే బాబూ. మీకు తెలియని విషయం ఏంటంటే నేను చదువుకున్నది అగ్రికల్చర్ బి.ఎస్‌సి. నేను రాష్ట్రంలో మొదటి ర్యాంక్ సాధించినవాడిని, కాని వ్యవసాయం మీద ప్రేమతో ఇలా మీకు అన్నం పెడుతున్నా. నాకు ఎంతో మంచి ఉద్యోగ అవకాశాలొచ్చినా నాకు వ్యవసాయం మీద గౌరవం ఉండటంతో వ్యవసాయం చేసి మీలాంటి వారికి అన్నం పెడుతున్నా. రైతులని అలా హీనంగా చూడద్దు. రైతులు లేకపోతే మీలాంటివారు లేరు” అన్నాడు రాములు.
ఫోన్ మాట్లాడి వచ్చాకా, కొడుకుతో కలసి అన్నం తిని వెళ్ళిపోయాడు రాములు.
***
నేను చివరగా ఒక మాట చెప్పాలి అనుకుంటున్నా. రైతులని గౌరవిద్దాం. ఎందుకంటే మా తాత కూడా ఒక రైతు కాబట్టి. రైతు బిడ్డ రైతులా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి గొప్ప స్థాయికి వెళతారు. కొంతమంది డబ్బున్న వాళ్లకి దేని మీద గౌరవం ఉండదు, ఇది నా మాట.
నేను రాములు రైతు లాంటి వారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. మీరు కూడా రైతులని గౌరవించండి.
రైతులందరికి జేజేలు. జై రైతన్నా జై జై రైతన్నా.
కె. సాయి చరణ్