రాజకీయ విన్యాసాలు

0
2

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘రాజకీయ విన్యాసాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మె[/dropcap]చ్చుకున్న నోటితో తిట్టడం
తిట్టిన నోటితో మెచ్చుకోవడం
రాజకీయ విన్యాసాలు
చెల్లుతాయ్ రాజకీయాలలో

అధికార పక్షంలో వున్నప్పుడు
ప్రతిపక్షాన్ని తిట్టడం
ప్రతిపక్షంలో వున్నప్పుడు
అధికార పార్టీనీ తిట్టడం
రాజకీయ విన్యాసాలు
చెల్లుతాయ్ రాజకీయాలలో

కండువాలు మార్చడం
తిన్న ఇంటి వాసాలు
లెక్క పెట్టడం
రాజకీయ విన్యాసాలు
చెల్లుతాయ్ రాజకీయాలలో

ఓడిన పార్టీ పిలిచి ఇస్తే టికెట్
వద్దు పో అంటారు
అధికార పార్టీ టికెట్ కోరి
పడిగాపులు కాస్తుంటారు
రాజకీయ విన్యాసాలు
చెల్లుతాయ్ రాజకీయాలలో

రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ
మారేదు లేదు ఈ జన్మలో అంటారు
మరుసటి రోజు కండువా
మారుస్తారు
రాజకీయ విన్యాసాలు
చెల్లుతాయి రాజకీయాలలో

మారిన కండువాతో
ప్రజలను కలుస్తారు
మాజీ పార్టీని తిడతారు
ప్రస్తుత పార్టీని పొగుడుతారు
వందిమాగధులు కొడుతారు
చప్పట్లు గట్టిగా

ప్రజలు అటు తిరిగి
నవ్వుతారు గుడ్డ అడ్డం పెట్టుకొని
నిన్న ఈ పార్టీనీ తిట్టిన తిట్లు
తలుచుకొని
రాజకీయ విన్యాసాలు
చెల్లుతాయి రాజకీయాలలో

రాజకీయాలు ఒక ‘కళ’
విశ్వ విద్యాలయాలు
నేర్పవు ఈ విన్యాసాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here