Site icon Sanchika

రాం రాం రాజ్యాంగానికి రాం రాం

[శ్రీ మాడభూషి శ్రీధర్ రచించిన ‘రాం రాం రాజ్యాంగానికి రాం రాం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
(ముందుమాట: షరా మాములే: ఓసారి రామా రామా అంటే బాధపడడం, ఇంకో చోట శ్రీరామా నీదే గతి అనడం, మరోసారి రాం రాం అంటే ఇక మళ్లీ రావద్దనడానికి, మధ్య మధ్య రాం రాం అంటే బూత్ కు రాబోము అంటాడేమే అని, మొత్తానికి రాజ్యాంగానికే పూర్తి రాం రాం)


~
[dropcap]రాం[/dropcap] రాం ఓటు వెయ్యాల్రా అసలెందుకు రాం రాం
రాం రాం ఆశాజీవులు పోటీలట నలభైఅయిదట రాం రాం
రాం రాం ఆ పైన ఓ నోటా అందుకనే రాం రాం
రాం రాం ఇండియన్ పీఎల్ కే వస్తాం బూతుకు రాం రాం

రాం రాం ఎన్ని బూతులు చెప్పేందుకు ఓటుకు మేం రాం రాం
రాం రాం 30 శాతం పోలింగ్ రాకుంటే ఇంకెందురా రాం రాం
రాం రాం డెమోక్రాసీ ద్రోహం ద్రోహానికి చెప్పు రాం రాం
రాం రాం ఆంధ్రకు రాలేం కన్క హైద్రాబాద్ కు రాం రాం

రాం రాం ఆంధ్రనుంచి రాలేనని రాం రాం
రాం రాం నేను ఓటేస్తే ఇప్పుడూ ఓడుతాడు కన్క రా రాం
రాం రాం వాడెట్లయిన గెలుస్తడు కన్క రాం రాం
రాం రాం మా అపార్టెమెంట్ పక్కాయన వద్దన్నడని రాం రాం

రాం రాం పోలింగ్ కు వాడొచ్చిండు కన్క రాం రాం
రాం రాం అంటూ ఇటువంటి వెధవకు రాం రాం
రాం రాం బ్రదర్ అందరూ దరిద్రులే కన్క రాం రాం
రాం రాం కన్క రేపిస్టే ఓట్టిస్తాం రాం రాం
రాం రాం వాడికి వేయిఓట్లే ఇచ్చిండని రాం రాం
రాం రాం అమ్మో ఎట్లయినా ఓడాలనే వాడు కన్క రాం రాం
రాం రాం పేరు మీద 5 ఏళ్లేడుంటడు కన్క రాం రాం
రాం రాం అని అయోధ్యలో అన్నా పోలింగ్ కు రాంరాం అనకు రా

రాం రాం ఇవిఎం నమ్మను గాక నమ్మనని కన్క రాం రాం
రాం రాం అని క్రిమినర్లకు వదిలేస్తే ఇక ఎందుకు రాం రాం
రాం రాం అనకు రాం, జనతా వల్ల దేశం శెభాష్ రాముడా రాం రాం
రాం రాం అనకు రా, లేకుండే డిక్టేటర్లే రాం రాం

రాం రాం దేవుడున్నా లేకున్నా, బతికించే జనస్వామ్యమే రాం రాం

Exit mobile version