[box type=’note’ fontsize=’16’] సంచిక డైనమిక్ వెబ్ పత్రిక. అంటే నెల కొకసారో వారాని కొకసారో, పదిహేను రోజుల కొకసారో మాత్రమే అప్‌లోడ్ అయ్యే పత్రిక కాదు, సందర్భాన్ని బట్టి అవసరమయితే, రోజూ అప్‌లోడ్ అయ్యే డైనమిక్ పత్రిక అని భువనచంద్ర గారికి వివరిస్తూ, రామనవమి సందర్భంగా కూడా కొన్ని కథలు, కవితలు అప్‌లోడ్ అవుతున్నాయని చెప్పాను. ఆయన వెంటనే “నేను చిన్నప్పుడొక హిందీ సినిమా పాట విన్నాను. అది నాకు ఎంత నచ్చిందంటే ఆ పాట బాణీ ఆధారంగా నేనూ ఓ పాట రాసుకున్నాను. హిందీ పాటలో రామకృష్ణ హరే అని వస్తుంది” అని చెప్పి, పాట హం చేసి తాను రాసిన గేయాన్ని పాడివినిపించారు. నేను వెంటనే ‘చందా ఔర్ బిజ్లీ’ అనే సినిమాలో భువనచంద్ర గేయానికి బాణీ స్ఫూర్తినిచ్చిన ‘కాల్ క పయ్యా ఘూమే భయ్యా’ అనే పాటను వినిపించాను. ఆ పాట బాణీని అనుసరిస్తూ భువనచంద్రగారు సృజించిన గేయం రామకృష్ణ నామామృతం. – కస్తూరి మురళీకృష్ణ[/box]
ప II చూచితివయ్యా ఓ కన్నయ్యా
ఎంత వింతదీ జీవితమూ
పాప పుణ్యముల బాటలు మరచీ
చేయవలయు హృది ఆలయమూ
రామకృష్ణ వందే…. రామకృష్ణ వందే II
చ II పుట్టుకచావులు సుఖ దుఃఖములే
మానవజీవిత సంగ్రహమూ… ప్రతి
మానవ జీవిత సంగ్రహమూ
మరణ, రోగ, భయ పీడితులకు
శ్రీరామ నామమే ఔషధమూ
రామకృష్ణ వందే…. రామకృష్ణ వందే II
చ II భక్తియు ముక్తియు
ప్రభు సేవనమే
ప్రభుని నామమే అమృతమూ
చంచల బుద్ధికి శాంతి నొసగునది
రామకృష్ణ నామామృతమూ
రామకృష్ణ వందే…. రామకృష్ణ వందే II
- ఎప్పుడో 43 సంవత్సరాల క్రితం ఓ హిందీ పల్లవి విని చరణాలు స్వయంగా కట్టుకుని రాసుకున్న పాట ఇది. పాత హిందీ పాట పల్లవిని మళ్ళీ నాకు వినిపించిన శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారి ధన్యవాదాలు.