Site icon Sanchika

‘రామచిలుక’ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం

[dropcap]మ[/dropcap]లయాళీ అనువాద కథల సంపుటి ‘రామచిలుక’ ఆవిష్కరణ సభ ఆదివారం (30 జూన్‌ 2024) ఉదయం 11.00 గంటలకు సోమాజిగూడలోని రాజ్‌భవన్‌లో ఉన్న దర్బార్‌ హాల్‌లో జరుగుతుంది.

గోవా గవర్నర్‌ పి.ఎస్‌. శ్రీధరన్‌ పిళ్ళై మలయాళంలో రాసిన కథలను ఎల్‌.ఆర్‌. స్వామి తెలుగులోకి అనువాదం చేశారు.

వీటిని  పుస్తకంగా ‘రామచిలుక’ శీర్షికన పాలపిట్ట బుక్స్‌ ప్రచురింది.

రాజ్‌భవన్‌లో జరిగే ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాఫ్ట్ర గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌ హాజరవుతారు.

పద్మశ్రీ ఆచార్య కొలుకలూరి ఇనాక్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సభలో రచయిత పి.ఎస్‌. శ్రీధర్‌న్‌ పిళ్ళైతో పాటు గౌరవ అతిథులుగా సుప్రసిద్ధ కవి, సరస్వతీ సమ్మాన్‌ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, అనువాదకుడు ఎల్‌.ఆర్‌.స్వామి, డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ ప్రభృతులు పాల్గొని ప్రసంగిస్తారు.

గుడిపాటి

Exit mobile version