Site icon Sanchika

రామం భజే శ్యామలం-22

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]ఈ[/dropcap] దేశంలో మతపరమైన రాజకీయాలకు బీజం రాజరిక వ్యవస్థలోనే పడింది. ఒకనాడు రాజ్యాధికారం కోసం దాయాదులు, అన్నదమ్ముల మధ్య గొడవలు.. చంపుకోవడాలు.. ఉండేవి. ఎవడు గెలిస్తే వాడు రాజయ్యేవాడు. రాజ్యం వీరభోజ్యం అన్న మాట అలాగే వచ్చింది. కానీ.. అధికారం కోసం మతాన్ని వాడుకోవడమన్నది సమ్రాట్ అశోకుడి దగ్గరే ప్రారంభమైందని అనుకుంటా. ఎందుకంటే.. అంతకుముందు ఈ రకమైన సన్నివేశాలు ఇతర రాజవంశాల్లో కనిపించవు. అశోకుడి తాత చంద్రగుప్తుడు జైనులను, తండ్రి బిందుసారుడు ఆజవికులతో అనుబంధం నెరపినప్పటికీ.. సామరస్యం చెడిపోయేలా చేయలేదు. కానీ.. అశోకుడు తాను అధికారంలోకి రావడానికి బౌద్ధాన్ని వాడుకొన్నాడు.

ఇక్కడ విస్పష్టంగా చెప్పదలచుకొన్నదేమిటంటే.. అశోకుడి గురించి మాట్లాడటం అంటే బౌద్ధాన్ని గురించి మాట్లాడటం కాదు. అశోకుడి రాజరికం.. పరిపాలన తీరుతెన్నులపై చర్చించడానికి బౌద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. ఉండాల్సిన అవసరమూ లేదు. ఈ ప్రపంచంలోకి అసాధారణ శాంతి ప్రవర్తకుడిగా అవతరించిన మూర్తిమంతుడు గౌతమబుద్ధుడు. సమస్త మానవజాతిలో సమూల పరివర్తనకోసం ధర్మమార్గాన్ని చూపించినవాడు. అశోకుడు వ్యక్తిగా స్వీకరించిన ధర్మానికి.. అనుసరించిన రాజధర్మానికి ఎటువంటి సంబంధంలేదు. తాను అధికారంలోకి రావడానికి అడ్డంకిగా జైనులు, అజవికులు మారారు కాబట్టి.. ప్రత్యామ్నాయంగా బౌద్ధం స్వీకరించాడే తప్ప ఆ ధర్మాన్ని మనసావాచా కర్మణా అనుసరించడానికి కాదు. వేలకొలది అజవికులను హతమార్చడం, జైనుల తలలకు వెలకట్టడం.. వందలాది అధికారుల సామూహిక హననానికి పాల్పడటం వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలే.

స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వానికి.. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలకు ఈ అశోకుడే ఆదర్శమయ్యాడు. . ఇతని కూటనీతే.. రాజనీతిగా.. సోషలిజంగా.. అంతిమంగా అధికారాన్ని తెచ్చిపెట్టే ఓటుబ్యాంకు రాజకీయాలకు పునాదిగా పరిణామం చెందింది. ప్రభుత్వరంగంలో అశోక హోటల్.. రాష్ట్రపతి భవన్‌లో అశోక హాల్.. అశోక చక్ర.. ఇలా ఆధునిక పరిపాలనపై.. పాలకులపై అశోకుడు ఇంపోజ్ అయ్యాడు. ఈ దేశంలో సెక్యులరిజం అన్న పేరుతో దారుణమైన మతరాజకీయాలకు అశోకుడు కేంద్రబిందువయ్యాడు. రాజకీయాల కోసం బౌద్ధాన్ని ఇవాళ్టికీ వాడుకొంటున్నారన్నది కనిపిస్తున్న వాస్తవమే. అశోకుడంటే బౌద్ధం ఎంతమాత్రం కాదు. బౌద్ధం అంటే బుద్ధుడు. బౌద్ధం అంటే ధర్మం. బౌద్ధం అంటే సంఘం.. బౌద్ధం అంటే శరణాగతి.

దేశాన్ని ఏలిన అత్యంత క్రూరమైన రాజుల్లో అశోకుడు మొట్టమొదటి స్థానంలో ఉంటాడనడంలో సందేహం అక్కర్లేదు. బౌద్ధమత గ్రంథం అశోకావదనంలో అశోకుడి నరకాన్ని గురించిన వర్ణన చూస్తేనే గగుర్పొడుస్తుంది. ‘అశోకుడు బుద్ధిజం స్వీకరించడానికి ముందునుంచీ అత్యంత భయానక నియంత. తాను ఎవరినైనా శిక్షించడానికి ఒక ప్రత్యేకమైన చాంబర్‌ను నిర్మించాడు. అశోకుడి ప్రధాన తలారి గిరికకు ఈ చాంబర్ నిర్మాణ పనులను అప్పగించాడు. ఈ టార్చర్ చాంబర్‌లో దోషిని చిత్రహింసలు పెట్టడానికి కావాల్సిన సమస్తమైన భయంకర ఉపకరణాలు ఉండాలని ఆదేశించాడు. ఎవరినైనా.. సజీవదహనం చేయడానికి వీలుగా ఫర్నేస్‌ను కూడా నిర్మించాలని హుకుం జారీచేశాడు. రాజు ఆదేశాల మేరకు తలారి అత్యంత భయంకరమైన టార్చర్ చాంబర్‌ను నిర్మించాడు. అశోకుడు ఆ చాంబర్‌ను చూసి నిజంగా నరకాన్ని చూసినట్టున్నదని సంతృప్తి వ్యక్తంచేశాడు. ఇందులోకి ప్రవేశించిన వాడెవ్వడూ సజీవంగా బయటకు వెళ్లడని అశోకుడు గిరికకు హామీ ఇచ్చాడు. ఈ నరకంలో దాదాపు ఐదురకాల భయంకరమైన శిక్షలను అమలుచేసేవారట. అశోకుడు ఎంతోమందికి ఇందులో శిక్షలు అమలుచేశాడు. భూమ్మీదే నరకం చూపించాడు. చివరకు ఈ నరకాన్ని నిర్మించిన గిరికను కూడా ఇందులోని ఫర్నేస్‌లో వేసి సజీవదహనం చేశాడు.

జువాన్‌జాంగ్ బౌద్ధ సన్యాసి క్రీస్తుశకం ఏడో శతాబ్దంలో భారత్‌కు వచ్చినప్పుడు పాటలీపుత్రంలో అశోకుడి జైలును సందర్శించినట్లు ఆయన రచనల్లో పేర్కొన్నాడు. పాటలీపుత్రం వచ్చే యాత్రికులకు ఇదొక సందర్శనా స్థలమైందని కూడా పేర్కొన్నాడు. ఫాక్సియాన్ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. అశోకుడి హింసాత్మక ప్రవృత్తికి ఇది ఒక నిదర్శనం.

అశోకుడికి పాపులారిటీని తీసుకొని వచ్చేందుకు మార్క్సిస్టు చరిత్రకారులు ఇతర రాజులను తక్కువచేసి చూపించేందుకు వెనుకాడలేదు. అశోకుడి తదనంతరం మౌర్యసామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకొన్న పుష్యమిత్ర శుంగుడు అత్యంత క్రూరుడని, బౌద్ధులను తీవ్రంగా హింసించాడని రాసుకొచ్చారు. హిందూయిజంలో సహనం ఉన్నదన్నది కేవలం మిథ్య మాత్రమేనని.. వాస్తవం వేరేలా ఉన్నదని, హిందూరాజులు బౌద్ధులను తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని రాశారు. ఇందుకు ఉదాహరణ మార్క్సిస్టు చరిత్రకారుడు గార్గి చక్రవర్తి రాసిన ఈ మాటలు..

Another myth has been meticulously promoted with regard to the tolerance of the Hindu rulers. Let us go back to the end of second century BC. Divyavadana, in a text of about the second-third century AD, depicts Pushyamitra Shunga as a great persecutor of Buddhists. In a crusading march with a huge army he destroyed stupas, burnt monasteries and killed monks. This stretched up to Shakala, i.e. modern Sialkot, where he announced a reward of 100 gold coins to the person who would bring the head of a Buddhist monk. Even if this is an exaggeration, the acute hostility and tensions between Pushyamitra and the monks cannot be denied… (Gargi Chakravartty: “BJP-RSS and Distortion of History”, in Pratul Lahiri, ed.: Selected Writings on Communalism, People’s Publishing House, Delhi 1994, p.166-167)

దివ్యావదాన మన్న మత గ్రంథాన్ని ఒక వ్యక్తి పేరుగా భావించడం చక్రవర్తికున్న విజ్ఞత. సరే.. కాసేపు ఈ చక్రవర్తి చెప్పిందే నిజమనుకొందాం.. పుష్యమిత్రుడు బౌద్ధానికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. అయినంతమాత్రాన బౌద్ధ సన్యాసులను కనిపించిన వారిని కనిపించినట్టుగా ఎందుకు చంపమన్నాడు? ఏదైనా కారణం ఉండాలి కదా.. పైగా ఒక్కో తల మీద వంద నాణాలిస్తానని ప్రకటన చేశాడని చెప్తున్నాడు. అంత అంతతీవ్రంగా రాజుగారికి ఆగ్రహకారణం ఏమై ఉండాలి? చరిత్రకారుడు చక్రవర్తి చెప్పినదాని ప్రకారం పుష్యమిత్రుడు బౌద్ధస్థూపాలను, విహారాలను విచక్షణ లేకుండా ధ్వంసంచేశాడు. ఎందుకంటే..నిజానికి పుష్యమిత్రుడు రాజ్యాధికారం చేపట్టటం వెనుక ఒక కారణంవుంది. గ్రీకు మినాండర్ బౌద్ధం స్వీకరించటంతో బౌద్ధులు గ్రీకు సేనలతో యుద్ధానికి మొగ్గుచూపకపోవటంతో ధర్మ రక్షణకోసం బ్రాహ్మణుడయిన పుష్యమిత్రుడు రాజును చంపి రాజ్యాధికారం చేపట్టాడు. భారతీయ ధర్మంలో రాజుకన్నా, రాజ్యం కన్నా, ధర్మ్ రక్షణ ప్రాధాన్యం. ధర్మాన్ని రక్షించినంతవరకే రాజు విష్ణువు అవతారం. ధర్మరక్షణ చేయని రాజు రాక్షసుడే. సంహార యోగ్యుడు. అందుకే అధికారం చేపట్తిన తరువాత గ్రీకులవైపు మొగ్గుచూపిన దేశద్రోహానికి పాల్పడ్డ వారందరినీ ఏరివేశాడు. పుష్యమిత్ర శుంగుడు తన రాజ్యంలో బౌద్ధారామాల నిర్మాణం చేశాడు. ఇది చారిత్రక సత్యం. కాబట్టి.. పుష్యమిత్రుడు బౌద్ధుల ఊచకోత కోశాడని.. అసహనం ఉన్నవాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అశోకవదన గ్రంథాన్ని ఎడిట్‌చేసిన సుజిత్ కుమార్ ముఖోపాధ్యాయ ఆ గ్రంథంలో అశోకుడు జైనులు, అజవికులమీద చేసిన అరాచకాల గురించి ప్రస్తావించాడు. మహావీరుడి ముందు బుద్ధుడు మోకరిల్లినట్టు ఉన్న చిత్రాన్ని చూసి.. జైన కుటుంబాన్ని సజీవదహనం చేయడం.. జైనుల తల తెచ్చినవారికి ఒక దీనార్ బహుమతిగా ప్రకటించిన కథనం అశోకుడిదే. ఇదే కథను ఆ తరువాత పుష్యమిత్రుడికి కాస్త మసాలా జోడించి ఆపాదించారు. పుష్యమిత్రుడికి బౌద్ధులకు ఘర్షణలు జరిగాయని చెప్పడానికి ఎలాంటి నిర్మాణాత్మకమైన ఆధారాలు లేవుకాబట్టి.. అతణ్ణి వదిలిపెట్టారని ఎటిన్ లామోట్ అనే బౌద్ధ చరిత్రకారుడు స్వయంగా వ్యాఖ్యానించాడు. కానీ.. అశోకుడి వ్యక్తిత్వానికి సంబంధించి.. అతను చేసిన పనుల గురించి అశోకుడి శాసనాలుగా చెప్పబడుతున్న అన్నింటిలోనూ కచ్చితంగా శిలాక్షరాల్లో లిఖించబడ్డాయి. ఎక్కడా కూడా అతను చేసిన మారణహోమాన్ని దాచుకోలేదు.

In the meantime, in the city of Pundavardhana, a lay follower of Nirgantha Jnatiputra drew a picture showing the Buddha bowing down at the feet of his master. A buddhist devotee reported this to King Asoka who then ordered the man arrested and brought to him immediately. The order was heard by the nagas as far as a yojana underground, and by the yaksas a yojana up in the air, and the latter instantly brought the heretic before the king. Upon seeing him Asoka flew into a fury and proclaimed:’ All the Ajivikas in the whole undavardhana are to be put to death at once! and on the day eighteen thousand of them were executed.

Someime later, in Pataliputra, a different devotee of Nirgrantha drew yet another picture of Buddha bowing down infornt of the master. when Asoka heard about this he was without mercy. he forced the man and his whole family to enter their home and burnt it to the ground. He then issued a proclamation that whoever brought him the head of a Nigrantha heretic would be given a dinar. ( The Legend of King Asoka: A study and translation of Asokavadana by John s Strong . Page no.232)

మధ్య యుగంలో యూరప్ లో తమ మతాన్ని అవలంబించలేదని హింసించి చంపిన మూర్ఖ మతపెద్దలకు, తమ దైవం బొమ్మ గీసాడని తలలు నరికే ఆధునిక మతోన్మాదులకు, మనం గొప్ప రాజుగా భావించి ఆరాధించే అశోకుడికి పెద్దగా తేడాలేదన్నమాట! కానీ.. మన చరిత్రకారులు అశోకుడిని హీరో చేయడం కోసం.. అతను చేసిన అరాచకాల్లోని కొన్ని కథలను పుష్యమిత్రుడిపై సూపర్‌ఇంపోజ్ చేసిఉండవచ్చు. ఒక రచయిత తన హీరోనే తప్పుచేశాడని బల్లగుద్ది చెప్తున్నప్పుడు.. దానికంటే మించిన కచ్చితత్వం ఇంకేముంటుంది? అశోకావదనం ఇందుకు తార్కాణం. అశోకావదనాన్ని ఎడిట్‌చేసిన సుజిత్ కుమార్ ముఖోపాధ్యాయ.. అశోకుడిని ది గ్రేట్ చేయడానికి చాలా అవస్థలు పడ్డాడు. అశోకావదనంలో చెప్పిన విషయాలనుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు. అశోకుడు సెక్యులరిస్టుగా నిరూపించడానికి అశోకావదనం రాసిన రచయితలనే తప్పుపట్టాడు. ఆ రచయితలే తప్పు రాశారని చెప్పడానికి కూడా వెనుకాడలేదు.

This is one of the best chapters of the text. The subject, the style, the composition, everything here is remarkable. In every shloka there is a poetic touch. (…) But the great defect is also to be noticed. Here too Ashoka is described as dreadfully cruel. If the central figure of this story were not a historic personage as great and well-known as Ashoka, we would have nothing to say. To say that Ashoka, whose devotion to all religious sects is unique in the history of humanity (as is well-known through his edicts) persecuted the Jains or the Ajivikas is simply absurd. And why speak of Ashoka alone? There was no Buddhist king anywhere in India who persecuted the Jains or the Ajivikas or any other sect. (The Ashokavadana, p.xxxviii)

పైగా బౌద్ధ మతాన్ని గొప్పగా చూపించాల్సిన అశోకావదన రచయితలు.. ఒక గొప్ప బౌద్ధ మతావలంబుని (అశోకుడు) మతోన్మాదిగా చిత్రీకరించడం ద్వారా బౌద్ధమతాన్ని తక్కువచేశారని ముఖోపాధ్యాయ తాను ఎడిట్‌చేసిన అశోకావదనంలో వ్యాఖ్యానించాడు.

In order to show the greatness of Buddhism, the orthodox author degraded it by painting the greatest Buddhist of the world as a dreadful religious fanatic. (The Ashokavadana, p.xxxviii).

అశోకావదనంలో ప్రస్తావించినది అశోకుడికి సంబంధించిన అంశాలే తప్ప.. బుద్ధుడి చరిత్ర కాదని గ్రహించాలి. బుద్ధుడు వేరు.. అశోకుడు వేరు. ఇవి రెండూ రెండు పార్శ్వాలు. వీటిని ఒకటి చేసి చూడటం వల్ల చరిత్ర మొత్తం వక్రీకరణ జరిగింది. ప్రపంచానికి ఉన్నతమైన ధర్మ ప్రబోధాన్ని చేసిన బౌద్ధాన్ని తన ప్రయోజనాల కోసం వాడుకొన్నది అశోకుడు. ఆ అశోకుడికి అభినవ బుద్ధుడిగా ముసుగువేసి వాడుకొన్నవాడు జవహర్‌లాల్ నెహ్రూ.

ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి. అశోకుడి ఉనికిని గురించి భారతీయులైన చరిత్రకారులు కాలనిర్ణయం చేశారు. మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 1534లో మౌర్య చంద్రగుప్తుడు మౌర్యవంశాన్ని స్థాపించాడు. ఆ తరువాత 1472లో అశోకుడు రాజ్యానికి వచ్చాడు. ఇది భారతీయ చరిత్రకారుల లెక్క. ప్రస్తుతం మనం చదువుకొంటున్న అశోకుడి చరిత్రకాలం క్రీస్తుపూర్వం 304 – 232. అశోకుడికి సంబంధించిన అనేక శిలాశాసనాలు మనకు దేశంలోని చాలాచోట్ల కనిపిస్తున్నాయి. కానీ.. వీటిలో రెండు శాసనాల్లో తప్ప మరెక్కడా అశోక శబ్దం కనిపించదు. కర్ణాటకలోని రాయచోటి జిల్లాలో ఉన్న మాస్కి గుహలో కనిపించిన శిలాశాసనంలో దేవానాంపియ అశోక అన్న శబ్దం బ్రాహ్మి లిపిలో ఉన్నది. మరొకటి కాందహార్‌లో ఉన్న శాసనంలో అశోక శబ్దం కనిపిస్తున్నది. ఈ అశోకుడు కాశ్మీర రాజతరింగిణిలో కల్హణుడు పేర్కొన్న అశోకుడు కావచ్చు. మగధాశోకుడు, కాశ్మీరాశోకుడు ఒకరు కాదన్న వాదన కూడా ఉన్నది. ఇక అశోకుడికి సంబంధించి మనకు కనిపించే మిగతా శాసనాలన్నీ కూడా దేవానాంపియ పియదస్సి అని ఉన్నాయి. అంటే దేవానాంప్రియుడు అయిన ప్రియదర్శి అని అర్థం. ఈ ప్రియదర్శి అన్న రాజే అశోకుడు అనడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు కనిపించవు. వాస్తవానికి అశోకుడిని భారతవర్షం పూర్తిగా మర్చిపోయిన సమయంలో జేవ్‌‌సు ప్రిన్సెప్ 19వ శతాబ్దంలో మళ్లీ వెలుగులోకి తెచ్చాడు. జేవ్‌‌సు ప్రిన్సెప్‌కు సిలోన్ (శ్రీలంక)లోని ఓ శాసనంపై దేవానాంపియ పియదస్సి తిస్స అన్న పేరు కనిపించింది. దీంతో పియదస్సి అన్న పేరు బయటకు వచ్చింది. క్రీస్తుశకం 1837లో జార్జ్ టర్నార్ అనే చరిత్రకారుడు శ్రీలంకకు చెందిన ప్రాచీన బౌద్ధ రచన దీపవంశంలో పియదస్సి అన్న పేరును అశోకుడితో సమన్వయం చేశాడు. ఇంతకుమించి అశోకుడికి, పియదస్సికి ఉన్న లింకేమిటో తెలియదు. భారతదేశంలో లభించిన శాసనాలన్నీ కూడా దేవానాంపియ పియదస్సి అని ఉన్నాయే తప్ప అశోక శబ్దం లేదు.

అశోక శబ్దం ఉన్న రెండు శాసనాల్లోనూ పియదస్సి అన్న పేరు లేనేలేదు. అలాంటప్పుడు ఈ అశోక శాసనాలు.. ఆ పియదస్సి శాసనాలు ఒకటేనా? పియదస్సి, అశోకుడు ఒకరేనా? లేక వేర్వేరు రాజులా? మాస్కిలో అశోక శబ్దంతో ఉన్న శాసనం కల్హణుడి రాజతరంగిణిలో ప్రస్తావించిన అశోకుడు ఒకడై.. ఈ పియదస్సి వేరేనా? లేక అశోకుడే పియదస్సీయా? వీటిలో వేటికైనా ప్రామాణికమైన ఆధారాలు ఉన్నాయేమో ఆధునిక చరిత్రకారులు, పరిశోధకులు చెప్పాలి. ఇది సందేహమే. దీన్ని తీర్చాల్సిన బాధ్యత చరిత్రకారులపై ఉన్నది. ఎందుకంటే.. పియదస్సి అనే రాజు వేరేగా ఉండి ఉన్నట్లయితే.. మరి అశోకుడు ఎప్పటివాడని నిర్ధారించాలి. భారతీయులైన చరిత్రకారులు చెప్పినట్టు.. అశోకుడి కాలం క్రీస్తుపూర్వం 1472 నిజమేనా? అన్నది తేల్చాలి.

Exit mobile version