Site icon Sanchika

రామం భజే శ్యామలం-3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

సెక్యులరిజం

[dropcap]నా[/dropcap]లాంటి సామాన్య భారతీయుడికి ఎంతమాత్రం అర్థం కాని బ్రహ్మపదార్థం ఏదైనా ఉన్నదంటే అది సెక్యులరిజం. ఈ దేశం లౌకికదేశం అని ఏడు దశాబ్దాలుగా డబ్బా కొడుతూనే ఉన్నారు.

ఈ లౌకికం అంటే ఏమిటి? దీనికి సరైన నిర్వచనం చెప్పగలిగినవారు ఈ దేశంలో దుర్భిణీ వేసి వెతికినా లభించరు. ఇంతకూ ఏమిటీ సెక్యులరిజం? ఇప్పటికైనా దీనికి కరెక్టైన జవాబు ఎవరైనా ఇవ్వగలిగితే వారు నిజంగా భారతరత్నకు అర్హులవుతారనడంలో సందేహంలేదు.

ఎందుకంటే భారత రాజకీయాలతో 1947 కంటే ముందు నుంచి కూడా విడదీయనంత చిక్కుముళ్లు పడిన పద బంధనమది. దీనికి ఎవరికి వారు తమదైన రీతిలో మాట్లాడతారు. నిర్వచనాలు, వ్యాఖ్యానాలు కుప్పలుతెప్పలుగాచేస్తారు. ఈ నిర్వచనాలు రకరకాలుగా మనకు కనిపిస్తాయి. ‘రాజ్యమనేది (కమ్యూనిస్టు పరిభాషలో ప్రభుత్వాన్ని రాజ్యం అని అంటారు.) దేశంలోని ఏ మతానికి అసోసియేట్ కాకుండా ఉండాలి. ఏ మతంతోనూ సంబంధం ఉండకూడదు. ఏ మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.’ అన్నది సాధారణంగా కొందరు చెప్పే నిర్వచనం. మన శాసనవ్యవస్థను శాసించే సోకాల్డ్ మేధావులు పదే పదే చెప్పే నిర్వచనం మరొకటి ఉన్నది. ‘రాజ్యం అలియాస్ ప్రభుత్వం అనేది అన్ని మతాలను సమానంగా చూడాలన్నది. ఏ మతాన్నీ ఎక్కువ తక్కువలు చేసి చూడరాదన్నది. మరి మన దేశంలో ఈ రెండింటిలో ఒక్కటైనా సదరు రాజ్యం పాటిస్తున్నదా? గమ్మత్తేమిటంటే.. భారతదేశం.. (నోరు తిరక్క తెల్లోడు పిలిచే ఇండియా) లోని రాజకీయ నాయకులకు.. పాలకులకు ఈ రెండు నిర్వచనాలూ తెలియవు. వీరికి తెలిసిన నిర్వచనం మూడోది ఉన్నది.

అదేమిటంటే.. అన్ని మతాలు సమానమే కానీ.. ఒకటి మాత్రం చాలా ఎక్కువ సమానం. ఆ మధ్య దర్శకుడు బాపు రాధాగోపాళం అనే సినిమా తీశాడు. అందులో హీరో మ్యానరిజం ఒకటి ఉంటుంది. భార్యాభర్తలు సమానమే.. కానీ భర్త కాస్త ఎక్కువ సమానం అని అంటాడు.

ఈ దేశంలో సెక్యులరిజం కూడా అలాంటిదే. ఈ దేశాన్ని ఏడున్నర దశాబ్దాలుగా ఏలుతున్న పాలకులందరికీ తెలిసిన నిర్వచనం అది. ఒక మతాన్ని విస్తరింపజేయడంకోసం, ఈ దేశాన్ని సాంసృ్కతికంగా వేల ఏండ్లుగా ఏకంగా ఉంచిన ధర్మంపై పరోక్షంగా దాడి తీవ్రంచేశారు. అందుకు వీరికి ఉపయోగపడిన ఆయుధం ‘సెక్యులరిజం’. ఈ దేశాన్ని ఏలిన ముస్లింలు, బ్రిటిష్ వాళ్లు కూడా తమ అవసరార్థం, ఆధిపత్యం కోసం సాంస్కృతిక విధ్వంసం చేశారేమో తప్ప, మూలాలతో సహా పెకిలించే అతి పెద్ద ప్రయత్నం స్వతంత్ర భారతదేశంలోనే జరిగింది.

జవహర్‌లాల్ నెహ్రూ అండ్ కో మొదట్లోనే ఈ ‘లౌకిక’మనే లౌక్యానికి బీజం వేశారు. రాజ్యాంగం ప్రియాంబుల్‌లో సెక్యులరిజం అన్న పదాన్ని చేర్చాలని సంకల్పించారు. 1948 నవంబర్ 15 న రాజ్యాంగ సభ సమావేశమైంది. ఇందులో లౌకికవాదంపై చర్చ జరిగింది.

ప్రొఫెసర్ కేటీ షా రాజ్యాంగంలో సెక్యులరిజం అన్న పదాన్ని చేర్చాలని ప్రతిపాదించారు.

“Sir, I beg to move, that in clause (1) of article 1, after the words ‘shall be a’ the words ‘Secular, Federalist, Socialist’ be included. The amended article or clause shall read as follows: ‘India shall be a Secular, Federalist, Socialist, Union of States’.”

ఆ తరువాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నెహ్రూ, అంబేద్కర్ ఈ పదాన్ని చేర్చాలని పట్టుబట్టారు. సెక్యులరిజం అన్న పదం రాజ్యాంగంలో జోడిస్తే భారత జాతీయవాదానికి, సాంస్కృతిక ఐక్యతకు దోహదం చేసిన సమస్తమైన మూలాలకు.. హిందూమతమనే ముద్రవేసి గుర్తింపు లేకుండా చేయడం ప్రధాన లక్ష్యంగా వారి కృషి కొనసాగింది. అదే సమయంలో ముస్లిం పర్సనల్ లా మాత్రం కొనసాగడానికి వారు పూర్తిగా అంగీకరించారు.

దీనికి ఆధునికత అన్న పేరు పెట్టారు. సంస్కరణ అని చెప్పుకున్నారు. అంతర్జాతీయంగా తమ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడం కోసం భారతీయతను ఈ దేశంనుంచి పెకిలించివేయ సంకల్పించారు. అందుకు వారికి మధ్య యుగాలనాటి యూరప్ పదమైన సెక్యులరిజం బాగా పనికివచ్చింది.

రాజ్యాంగంలో సెక్యులరిజం పదాన్ని చేర్చడంపై జరిగిన చర్చలో చాలా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కమ్యూనిస్టులు మాత్రం ఈ పదాన్ని చేర్చడంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించారు. సంబరపడిపోయారు. కొందరు మేధావులు నెహ్రూ అండ్ కో ప్రయత్నాన్ని వ్యతిరేకించారు. పాశ్చాత్య ప్రపంచ భావజాలాన్ని భారతదేశానికి ఏ విధంగా అన్వయిస్తారని ప్రశ్నించారు. విభిన్న సంసృ్కతులు, మత సంప్రదాయాలున్న భారతీయ సమాజంలో సెక్యులరిజం అన్నదాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయని అడిగారు. భారత్ లాంటి దేశంలో ఇది పూర్తిగా ఆచరించడం సాధ్యమేనా? అని కూడా ప్రశ్నించారు. కానీ జవహర్‌లాల్ నెహ్రూ ఒకటే సమాధానం చెప్పారు. ఒకటి రెండు వెనుకబడిన దేశాలు తప్ప.. చాలా దేశాల్లో చేసిందే మనం చేస్తున్నాం.. అని. రాజ్యాంగ సభ సమావేశమైన రోజుల్లోనే 1948 డిసెంబర్ 6వ తేదీన లోక్‌నాథ్ మిశ్రా చర్చలో పాల్గొంటూ మతంతో సంబంధంలేకుండా ప్రభుత్వం ఉండటం సాధ్యమేనా అని ప్రశ్నించారు.

“Do we really believe that religion can be divorced from life, or is it our belief that in the midst of many religions we cannot decide which one to accept? If religion is beyond the ken of our State, let us clearly say so and delete all reference to rights relating to religion.” అని అన్నారు. దీనికి కొనసాగింపుగా రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు హెచ్‌సీ ముఖర్జీ కూడా మరో అనుమానం వ్యక్తంచేశారు. మనం నిజంగానే భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చాలని భావిస్తున్నామా? వాస్తవంగా అదే చేసేటట్టయితే మత ప్రాతిపదికన మైనార్టీలను గుర్తించడం సాధ్యం కాదు. అని స్పష్టంచేశారు.

are we really honest when we say that we are seeking to establish a secular state? If your idea is to have a secular state it follows inevitably that we cannot afford to recognize  minorities based upon religion.”అని సూటిగానే అన్నారు. ఈ నేపథ్యంలోనే సెక్యులరిజం అన్న పదాన్ని నేరుగా రాజ్యాంగంలో అప్పటికి రాయలేదు. కానీ, రాజ్యాంగ సభ 25,26,27 అధికరణాలను ఆమోదించింది. సెక్యులరిజం అన్న పదాన్ని ప్రత్యక్షంగా చేర్చకపోయినప్పటికీ, దాని స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేవే ఈ అధికరణాలు.

నెహ్రూ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ కార్యాన్ని ఆయన కూతురు ఇందిరాగాంధీ సంపూర్ణం చేశారు. 1975 జూన్ 26 న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు. సామాన్య ప్రజలకోసం సంక్షేమ చర్యలు తీసుకోవడానికి తీసుకొంటున్న చర్యగా తనను తాను సమర్థించుకొన్న ఇందిరాగాంధీ అసాధారణ అధికారాలను సంక్రమింపజేసుకొన్నారు. పౌరహక్కులు రద్దైపోయాయి. ప్రతిపక్ష ఎంపీలు జైలుపాలయ్యారు. పత్రికలపై ఆంక్షలు విధించారు. రాజ్యాంగంలో కావలసిన చోట కావలసిన విధంగా సవరణలు చేసుకొన్నారు.

ఎమర్జెన్సీ విధింపుపై ఎలాంటి న్యాయవిచారణ జరుగరాదని 38 వ రాజ్యాంగ సవరణ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏ న్యాయస్థానం ప్రశ్నించరాదని, కేవలం పార్లమెంట్ కమిటీ ద్వారానే అది జరుగాలని 39వ రాజ్యాంగ సవరణ చేశారు. చివరకు 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం ప్రియాంబుల్‌లో సోషలిజం, సెక్యులరిజం అన్న పదాలను చేర్చారు. దాదాపు ఇరవై పేజీలున్న ఈ సవరణ డ్రాఫ్ట్ ద్వారా రాజ్యాంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి ‘సావరిన్, డెమొక్రాటిక్, రిపబ్లిక్’ అన్న ప్రియాంబుల్ కాస్తా, ‘సావరిన్, డెమొక్రాటిక్, సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్’గా మారిపోయింది.

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. 1904లో వారణాసిలోని సెంట్రల్ హిందూ కాలేజీ విద్యార్థులను అనీబిసెంట్ సంబోధించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మీరు ఎంతమాత్రం పొరపాటు చేయవద్దు. హిందూయిజం లేకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు. ఇండియా మొదళ్లు హిందూమతం అనే నేలలో పాతుకొని ఉన్నాయి. ఆ నేలనుంచి ఊడబెరికితే నేలనుంచి పీకివేసిన చెట్టు వాడిపోయినట్టు ఇండియా వాడిపోతుంది’ అని ఉద్బోధించారు. అనీబిసెంట్ అన్నట్లుగానే ఆ చెట్టును ఊడబెరకడానికి నెహ్రూ అండ్ కో, కమ్యూనిస్టు మేధావులు స్వాతంత్య్రం వచ్చిన క్షణం నుంచి తెలివిగా పావులు కదుపుతూ వచ్చారు. ఓ పక్క బౌద్ధాన్ని ప్రమోట్ చేశారు. మరోపక్క ముస్లిం పర్సనల్ లా జోలికి పోలేదు. ఇంకోపక్క హిందూకోడ్ బిల్లును మాత్రం తీసుకొచ్చారు. హిందూ మతాన్ని మాత్రం ఉద్ధరిస్తున్నట్టుగా మాస్కు వేసుకొన్నారు. ఇతర మతాల గురించి ప్రశ్నిస్తే.. పాపం వారు మైనార్టీలన్నారు. సంస్కరణలకు వారు మానసికంగా సిద్ధంగా లేరని నెహ్రూ యే స్వయంగా వ్యాఖ్యానించారు. హిందూ మతంలో ఉన్నవన్నీ మూఢ నమ్మకాలుగా కనపడ్డ ప్రతి మైకుముందూ మైకు  మాడు  పగిలేలా మాట్లాడేరు.

17 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో భారతీయ ధర్మానికి, హిందుత్వానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో చర్యలు తీసుకోవాలో ఆ స్థాయిలో చర్యలు తీసుకొన్నారు.. ఆ నాటి ప్రధానమంత్రి తన సోషలిస్టు ఇమేజిని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ ప్రతిష్ఠ సమకూర్చుకోవడానికి చేయాల్సినవన్నీ చేశారు. భారత ప్రభుత్వం ఏ మతానికి అసోసియేట్ కావద్దని, మత ప్రమేయం లేని రాజ్యంగా ఉండటం కోసం సెక్యులర్ అన్న పదాన్ని చేర్చాలని భీష్మించిన మహానుభావుడు.. ప్రత్యక్షంగా బౌద్ధాన్ని ప్రమోట్‌చేశాడు. దాదాపు పదేండ్ల పాటు బౌద్ధ ధర్మానికి అంబాసిడర్‌లా వ్యవహరించాడు. ప్రభుత్వ నిధులతో బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేశాడు. ప్రచార కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాడు. ఇక్కడితో ఆయన ఆగలేదు. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలను దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడానికి ఇతోధికంగా తన వంతు పాత్ర పోషించాడు. క్రైస్తవ మతమార్పిడులకు అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఇందుకోసం 1952 అక్టోబర్ 17 న ప్రధానమంత్రి హోదాలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జవహర్‌లాల్ నెహ్రూ లేఖ రాశారు. అందులో క్రైస్తవ మిషనరీలు చేసే ఎలాంటి కార్యక్రమాలనైనా ఏ విధంగానూ అడ్డుకోరాదని విస్పష్టంగా పేర్కొన్నారు. ఆ లేఖ పూర్తిపాఠం ఇది.

“I have sometimes received complaints from Christian missions and missionaries both foreign and Indian, about the differential treatment accorded to them in certain States. It is said that there is some kind of harassment also occasionally.

Some instances of this kind have come to my notice. I hope that your Government will take particular care that there is no such discrimination, much less harassment. I know that there is a hangover still of the old prejudice against Christian missions and missionaries. In the old days many of them except in the far south, where they were indigenous, represented the foreign power and sometimes even acted more or less as its agents. I know also that some of them in the north-east encouraged separatist and disruptive movements. That phase is over. If any person, foreigner or Indian, behaves in that way still certainly we should take suitable action. But remember that Christianity is a religion of large numbers of people in India and that it came to the south of India nearly 2000 years ago. It is as much a part of the Indian scene, as any other religion. Our policy of religious neutrality and protection of minorities must not be affected or sullied by discriminatory treatment or harassment. While Christian missionaries have sometimes behaved objectionably from the political point of view, they have undoubtedly done great service to India in the social field and they continue to give that service. In the tribal areas many of them have devoted their lives to the tribes there. I wish that there were Indians who were willing to serve the tribal folk in this way. I know that there are some Indians now who are doing this, but I would like more of them to do so. It must be remembered that the Christian community, by and large, is poor and is sometimes on the level of the backward or depressed classes.

We permit, by our Constitution, not only freedom of conscience and belief but also proselytism. Personally I do not like proselytism and it is rather opposed to the old Indian outlook which is, in this matter, one of live and let live. But I do not want to come in other people’s ways provided they are not objectionable in some other sense.

In particular, I would welcome any form of real social service by anyone, missionary or not. A question arises, however, how far we should encourage foreigners to come here for purely evangelical work. Often these foreign countries raise funds on the plea of converting the savage heathens. I do not want anyone to come here who looks upon me as a savage heathen, not that I mind being called a heathen or a pagan by anybody. But I do not want any foreigner to come who looks down upon us or who speaks about us in their own countries in terms of contempt. But if any foreigner wants to come here for social service, I would welcome him.”

– Jawaharlal Nehru

 

ఈ లేఖ పై మరింత వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదేమో. నెహ్రూ సెక్యులరిజం ఏమిటన్నది దీంతో తేటతెల్లమవుతుంది. 1955లో మిషనరీ కార్యకలాపాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఒక బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ.. క్రైస్తవం ఈ దేశంలో రెండు వేల ఏండ్ల నుంచి ఉన్నదని, అలాంటి క్రైస్తవ సోదరులకు తాము అణచివేతకు గురవుతున్నామనో.. ఇతర భయాందోళనలకు గురవుతున్నామన్న భావనలు కల్పించే చర్యలకు పూనుకోరాదు అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రిటిష్ పెంపకానికి నిజమైన రూపంగా నెహ్రూ నిలిచాడు.

ఖిలాఫత్ నుంచే మొదలైన జాడ్యం ,  ఈ సెక్యులరిజం అనే వైరస్ ఈ దేశానికి అంటించింది సహాయ నిరాకరణ అనే ఉద్యమం సందర్భంలో .. అంతకు ముందు నుంచి నాయకుల మనసుల్లో ఉన్నా అది ప్రత్యక్షంగా కనిపించలేదు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో ఇది ప్రత్యక్షంగా భారత రాజకీయ యవనికపై ఆవిష్కారమైంది. సహాయ నిరాకరణ ఉద్యమం అనేది భారత స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మాగాంధీ నిర్వహించిన తొలి ఉద్యమంగా చాలామంది భావిస్తారు. చరిత్ర పుస్తకాల్లో కూడా అదే రాశారు. దాన్నే నమ్మించారు. మనం నమ్ముతూ వచ్చాం. నిజానికి సహాయ నిరాకరణ అన్నది టర్కీ సుల్తాన్‌ను ఖలీఫాగా తిరిగి నిలబెట్టడానికి చేసిన ఉద్యమం. దీని పేరు ఖిలాఫత్. ఈ ఉద్యమాన్ని లేవదీసింది భారతీయ ముస్లింలే. దీనికి నాయకత్వం వహించింది మహమ్మదాలీ, షౌకతాలీ. మహాత్మాగాంధీ దీన్ని పూర్తిగా సమర్థించాడు. ఇందుకోసమే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చేపట్టిన స్వరాజ్ తీర్మానాన్ని పదేండ్లపాటు గాంధీయే వాయిదా వేశారు. తిలక్ మహాశయుడు 1920లో కన్నుమూశారు. 1921లో గాంధీజీ ప్రారంభించిన ఖిలాఫత్ ఉద్యమానికి తిరుగులేకుండాపోయింది. స్వరాజ్ తీర్మానంకోసం తిలక్ సేకరించిన నిధి ఖిలాఫత్ ఉద్యమం కోసం తరలిపోయింది. ఒక్క ఏడాది కాలంలో బ్రిటిష్‌వారు వెళ్లిపోతారని గాంధీ.. అలీ సోదరులకు చెప్పుకొచ్చారు. బ్రిటిష్‌రాజ్ వెళ్లిపోయి.. ఖిలాఫత్ వస్తుందని వారి నమ్మకం.

కానీ అది విఫలమైపోయింది. చివరకు మోప్లా తిరుగుబాటుగా మారిపోయింది. కేరళలోని మలబారు ప్రాంతంలో ఉండే ముస్లింలను మోప్లాలు అంటారు. ఈ తిరుగుబాటులో వేలమంది ఊచకోతకు గురయ్యారు. దీని చరిత్రను మన చరిత్రకారులు పుస్తకాల్లో చెప్పరు. ఈ హింసాకాండ ఎంతటిదంటే దేశవిభజన సమయంలో జరిగిన ఊచకోతకు సరిసమానమైంది.

మోప్లా తిరుగుబాటు తరువాత మహమ్మదాలీ జిన్నాకు తత్త్వం బోధపడింది. కాంగ్రెస్ నాయకుల క్యారెక్టర్‌ను సరిగ్గా అంచనావేశాడు. వాళ్లెప్పుడూ భయపడి లొంగిపోతారని గుర్తించాడు. సిద్ధాంతాలపై పోరాడటం వారికి చేతకాదని అర్థమైంది. అంతే.. తనకు అనుకూలంగా పావులు కదిపాడు. జిన్నా అనుకున్నట్టే జరిగింది. దేశ విభజన జరిగింది.

1948 యుద్ధం తరువాత ఐక్యరాజ్యసమితి ద్వారా సగం కశ్మీర్ పాకిస్థాన్ పరమైంది. మరో సగం కశ్మీర్ దశాబ్దాల తరబడి మండుతూ వచ్చింది. సోషలిస్టు ఇమేజికోసం టిబెట్ చైనా పరమైంది. దేశ రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్టు పదం వచ్చి చేరింది. షాబానో కేసులో రాజీవ్ గాంధీ చట్ట సవరణను ఈ సెక్యులరిజమే చేయించింది. భారతదేశ వనరులపై ముస్లింలే ప్రథమ హక్కుదారులని ఈ సెక్యులరిజమే మన్మోహన్‌సింగ్ చేత అనిపించింది.

పరాకాష్టకు సంతుష్టీకరణ

వాస్తవానికి సెక్యులర్ మహమ్మారి ఈ దేశాన్ని ఒక వైరస్‌లా విజృంభించడానికి ముందు ముస్లింలు, హిందువుల మధ్య సామరస్యం ఎన్నడూ చెడలేదు. పెద్దగా మతకల్లోలాలు జరిగిన దాఖలాలు కూడా లేవు. నాకు తెలిసి వరంగల్‌లో బతుకమ్మ సంబురాల్లో ముస్లింలు, పీరీల పండుగలో హిందువులు పాల్గొనడం ప్రత్యక్ష అనుభవమే. దేశవ్యాప్తంగా ఇదే వాతావరణం ఉండింది. సెక్యులర్ మేధావులు ఈ వాతావరణాన్ని ధ్వంసం చేయడంలో కొండొకచో సఫలీకృతులయ్యారనే చెప్పాలి. వీరు. ఉద్దేశపూర్వకంగా భారతీయతపైన, హిందుత్వంపైన ద్వేషంతో అదేపనిగా ప్రసంగాలు చేయడం వల్ల హిందువులు ప్రతిహింసకు దిగుతారేమోనన్న భయం ముస్లిం మేధావులను పట్టుకున్నది. ఇది స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఉన్నది. ముస్లిం లీగ్ పార్టీ ఏర్పడింది కూడా ఈ భయం పునాదుల మీదనే. ఈ భయమే ముస్లిం లీగ్.. బ్రిటిష్ పాలన కొనసాగాలని కోరుకొనేలా చేసింది. ఈ భయమే దేశ విభజనకు దారితీసింది. ముస్లింలలో ఈ భయాన్ని, అభద్రతాభావాన్ని ఎన్నటికీ సమసిపోకుండా నిరంతరం ఉండేలా సెక్యులరిస్టులు జాగ్రత్తపడ్డారు. ముస్లింలో ఈ భయమే నెహ్రూ నుంచి సోనియాగాంధీ వరకు.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేలా చేసింది. సమాజ్‌వాదీలు, జనతాదళ్‌లు ఓటుబ్యాంకుగా వాడుకొనేలా చేసింది. ఈ సెక్యులరిజం ఏ స్థాయికి చేరిందంటే హిందువులు మాత్రం లౌకికవాదాన్ని పాటించాలి. ముస్లింలు ఇతర మతాల వాళ్లు ఏ విధంగానైనా ఉండవచ్చు అన్నంతవరకు వెళ్లింది. పౌరహక్కులు హిందువులకు ఉండవు. భారతీయతను కించపరుస్తూ  వచ్చే అనేక సినిమాలకు విపరీతమైన ప్రచారం కల్పిస్తారు. ముస్లిం రాజులు గొప్పవారని చెప్పే సినిమాలు అద్భుతమైనవని ప్రశంసలు అందుకొంటాయి. మొఘల్ ఏ అజం నుంచి జోధా అక్బర్ దాకా ముస్లింలు హిందువుల పట్ల ఎంతో ఔదార్యంతో ఉన్నట్లు చూపిస్తారు. భారతీయతకు వ్యతిరేకంగా ఉన్న రచనలకు కుప్పలు తెప్పలుగా అవార్డులు వచ్చిపడతాయి. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అనే ఆయన ద్రౌపదిని కించపరుస్తూ రాస్తే కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. ఇతర మతాలకు వ్యతిరేకంగా పుస్తకాలు వచ్చినా, బొమ్మలు వచ్చినా నిషేధానికి గురవుతాయి.

ఒక ముస్లిం మీద దాడి జరిగితే వామపక్ష, మేధా  హక్కుల బృందాలు నెత్తీనోరూ బాదుకుంటాయి. అసహనం అంటూ రెచ్చిపోతాయి. హిందువులమీద దారుణాలు జరిగినా పట్టించుకొనే నాథుడుండడు. బీహార్‌లో 2016లో ఎన్నికలు జరిగినప్పుడు మోదీకి వ్యతిరేకం చేయడానికి సెక్యులరిజమే పనికొచ్చింది. 2016 జూలై 20 వ తేదీన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన ఐదుగురు రచయితలు పాట్నాలోని జేడీయూ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి ఇంట్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో సమావేశమయ్యారు. అక్కడే ఇంటాలరెన్స్ అన్న నినాదానికి రూపకల్పన జరిగింది.

అంతకుముందు యూపీలో అఖ్లాక్ హత్యను అడ్డం పెట్టుకొని ఈ అసహన నినాదానికి పదునుపెట్టారు. వీరికి అశోక్‌వాజ్‌పేయి అన్న రచయిత నాయకత్వం వహించాడు. ముందుగా విజయలక్ష్మీ పండిట్ కూతురు నయనతారా సహగల్ తన అవార్డును వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరుగా దాదాపు నలభై మంది రచయితలు అవార్డు వాపసీని ప్రకటించారు. బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఈ అవార్డు వాపసీ వ్యవహారం కొనసాగింది. ఫలితాలు వెల్లడై నితీష్ గెలవడంతోనే ఎపిసోడ్ ముగిసిపోయింది. మరి వీరి దృష్టిలో దేశంలో ‘అసహనం’ అంతమైందా? ఏమో తెలియదు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అవార్డు వాపసీ ప్రకటించిన వారిలో మొదటి ఐదారుగురు మినహా ఏ ఒక్కరూ తమ అవార్డును వాపస్ ఇవ్వలేదు. పత్రికావిలేకరులను పిలవడం.. ఒక ప్రకటనచేయడం.. దీంతోనే సరిపోయింది. మన నాయకుల రాజీనామా ప్రహసనాల మాదిరిగా.. చివరకు ఈ సెక్యులరిజం అనే మహమ్మారి ఎంతవరకు వెళ్లిందంటే.. బొంబాయిలో బాంబు పేలుళ్లకు పాల్పడిన మెమొన్‌ను ఉరిశిక్ష నుంచి కాపాడటానికి అర్ధరాత్రి సుప్రీం కోర్టును తెరిపించేంతవరకు. పార్లమెంట్‌పై దాడి చేసిన వాడి తరపున వకాల్తా పుచ్చుకొని బాజాప్తాగా ఈ దేశ రాజధాని నడిబొడ్డులో నిలుచుని ‘భారత్  తెరే టుక్‌డే టుక్‌డే కరేంగే.. అఫ్జల్ తేరా కాతిల్ జిందాహై.. ఘర్ ఘర్‌మే అఫ్జల్.. ఛీన్ కే లేంగే ఆజాదీ’ అని బోర విరుచుకొని నినాదాలు చేసేంతవరకు. ఇంతటి మాటలు అంటున్నా ఏ పాలకుడూ వాళ్లను ఏమీ చేయలేని బలహీనులను చేసేంతవరకు సెక్యులరిజం ఎదిగింది.

References:

  1. Sita Ram Goel. “Vindicated By Time: Niyogi Committee Report.”
  2. Sita Ram Goel. “Defence of Hindu Society.”
  3. Jawaharlal Nehru. “Selected Works of Jawaharlal Nehru: Second Series, Vol18-19.”
  4. Felix Alfred Plattner. “The Catholic Church in India: Yesterday and Today.”

(మిగతా వచ్చే వారం).

Exit mobile version