[box type=’note’ fontsize=’16’] “రమణుడూ నేనూ ఏకమూ అఖిలమూ, నేనూ రమణుడూ సర్వమూ శాంతమూ” అంటున్నారు జొన్నలగడ్డ సౌదామిని రమణ మహర్షి తానూ అభిన్నమని చెబుతూ “రమణుడూ నేనూ” కవితలో. [/box]
***
[dropcap style=”circle”]ర[/dropcap]మణుడూ నేనూ ఆకాశం మేఘం
నేనూ రమణుడూ గంగా సాగరం
రమణుడూ నేనూ తండ్రీ కొడుకులం
నేనూ రమణుడూ చంద్రుడూ సూర్యులం
రమణుడూ నేనూ గురువూ శిష్యులం
నేనూ రమణుడూ మంచూ నీరులం
రమణుడూ నేనూ రాగమూ పాటా
నేనూ రమణుడూ పద్యమూ మాటా
రమణుడూ నేనూ కృష్ణుడూ. పార్ధుడూ
నేనూ రమణుడూ బుద్దూ బుద్ధుడూ
రమణుడూ నేనూ జంట కవి మిత్రులం
నేనూ రమణుడూ భార్యా భర్తలం
రమణుడూ నేనూ హృదయమూ మనసులం
నేనూ రమణుడూ జీవుడూ బ్రహ్మలం
రమణుడూ నేనూ సత్యమానందమూ
నేనూ రమణుడూ నిత్యమద్వైతమూ
రమణుడూ నేనూ ఏకమూ అఖిలమూ
నేనూ రమణుడూ సర్వమూ శాంతమూ
రమణుడూ నేనూ నేనే రమణుడూ
నేనూ రమణుడూ రమణుడే నేనులే