[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో 27-06-2021 సాయంత్రం 5:45 గం.ల నుండి విశాఖ సాహితి స్వర్ణోత్సవ సభలలో భాగంగా, “బ్రాహ్మీభూషణ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి స్మారక ఉపన్యాస కార్యక్రమం” అంతర్జాల మాధ్యమం ద్వారా జరిగింది.
ఈ అంతర్జాల సభకు ఆంధ్ర విశ్వకళాపరిషత్ గణిత విభాగాధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన విశాఖ సాహితి గౌరవాధ్యక్షులు ఆచార్య పొన్నపల్లి వెంకట కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా వ్యవహరిస్తూ, విశాఖ సాహితి స్వర్ణోత్సవ సభలు ఈ విధంగా అంతర్జాల మాధ్యమంలో నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు.
ప్రధాన వక్త అయిన ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు, వ్యక్తి సంస్కరణ ద్వారా సమాజ సంస్కరణ సాధ్యపడుతుందని నమ్మిన ప్రాచీన సాహిత్యకారులు, సమాజ హితమే లక్ష్యంగా తమ రచనలు చేసారని సోదాహరణంగా తమ ప్రసంగంలో వివరించారు.
దేశ విదేశాల నుంచి ఎనభైమందికి పైగా పాల్గొన్న ఈ సభకు విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం గారు సమన్వయకర్తగా వ్యవహరించారు.