[dropcap]ఇ[/dropcap]టీవల పిన్న వయస్సులోనే దివంగతులైన కోపూరి శ్రీనివాస్ పుట్టిన రోజు ఆగస్ట్ 9న సందర్భంగా, ఆయన పేరుతో వారి తల్లిదండ్రులు కోపూరి పుష్పాదేవి, రామచంద్రరావుగార్లు రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో సింగిల్ పేజీ కథల పోటీలు నిర్వహిస్తున్నారు.
ఉత్తమంగా ఎన్నికైన కథలకు-
- మొదటి బహుమతి: రూ.1500/-
- ద్వితీయ బహుమతి: రూ.1000/-
- తృతీయ బహుమతి: రూ.500/-
ప్రోత్సహక బహుమతులు: 3 కథలకి ఒకొక్కటి 300/- చొప్పున ఇవ్వబడతాయి.
సామాజిక స్పృహ కలిగిన అంశంతో కథ రాతలో ఎ-4లో పేజీకి మించకుండా రాసి (డిటిపి చేసినవి అయితే అరపేజీ మించకూడదు) పంపాలి. కథపై రచయిత పేరు, వివరాలు ఉండకూడదు. కేవలం ఆ వివరాలు హామీపత్రంలోనే రాసి జులై 15వ తేదిలోగా ‘రమ్యభారతి’ పోస్ట్ బాక్స్ నెంబర్.5, విజయవాడ-520001 చిరునామాకు పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. పోటీలో విజేతలైనవారికి ఆగస్ట్ నెలలో విజయవాడలో జరిగే ప్రత్యేక సభలో బహుమతీ ప్రదానం ఉంటుంది.
– చలపాక ప్రకాష్, ఎడిటర్, రమ్యభారతి