[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘రణభేరి..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]చితాల సందడిలో
నీ ఓటు అమ్మేస్తే
ఆపైన..
బానిస బ్రతుకే తోడు!
~
నిన్ను ఏలబోయేవాళ్లు
నీ శ్రమను –
నిలువునా,
దోచేవాళ్లే! జరభద్రం!!
~
నాయకుడు –
అనేవాడికి,
ప్రజలు గుర్తుకొచ్చేది,
ఎన్నికలప్పుడే..!
~
నిరుద్యోగుల
ఊసెత్తరు వాళ్ళు..!
సలహాదారుల
ఎంపికలో బిజీ మరి!
~
కండువాల మార్పిడికి
కలిసొచ్చేకాలం..
ఎన్నికలే కదా!
చూడండి మరి!!
~
ఆర్థిక స్థిరత్వం లేని
ప్రభుత..!
బ్యాంకుల్లో అప్పులు
నడ్డివిరిచే పన్నులు..!!