[dropcap]చు[/dropcap]ట్టూ ఎన్నో వర్ణాలు
దేనికదే అద్భుతం
కొన్ని రంగులు కలిస్తే హరివిల్లు
మరికొన్ని రంగులు విడివడితే చీకటి.
ఒకసారి గాలితో కలిసి
నింగి కెగసే నిప్పు
మరోసారి నీటితో కలిసి
ఆవిరయే నివురు.
విరహంలో
ప్రాణం నిలిపే ప్రణయమే
విరాగంలో ఊపిరి తీసే
పాశమవుతుంది.
మంత్రజాలమంతా సంయోజనలలోనే.
జీవితమంటే కూడా
కొన్ని తెలుపు నలుపుల
చదరంగపుగడులే కదా!