[dropcap]క[/dropcap]న్నులు కలబడతున్నాయి
నీ వన్నెలు చూసి
పెదవులు తడిఒడుతున్నాయి
నీ సొగసును చూసి
చేతులు తడవడుతున్నాయి
నీ కురులును చూసి
మనసు మెలిబడుతుంది
నీ వలపు పవనాలు తాకి
మనసు కలవరపడుతుంది
నీ వంపుల సుగంధాలు చేరి
మనసు ప్రబంధమై చెలరేగుతుంది
నీ పైపరువపు అలలఉప్పెనకి
నీవు రస మాధురై
విరుపుల వయ్యారాల
బాణాలు వదులుతుంటే
నేను మదన తుమ్మెదై చేరనా…
నీ కొంటెపూల కోనలో
రస చందన తీగనై చేరనా