[dropcap]వా[/dropcap]న జల్లుకు మురిసిన
ప్రకృతి కన్యలా
చిరు జల్లుకు తడసి విరిసిన
పూవులబాలలా
వాన చినుకుకు చెమరిన
మట్టి సుగంధంలా మురిసిపోతున్నావు
విరిగంధంపూసి
పిల్లగాలిలా మాయమవుతున్నావు
బుగ్గల నిమిరే ముగ్ధ చూపులతో
గుండెను బుగ్గి చేస్తున్నావు
పెదవుల తాకే
మధు రెమ్మలతో గుచ్చేస్తున్నావు
ఏపుగ పెరిగిన
ఎద పొదలతో పొగబెడుతున్నావు
వయ్యారాల వసంతానికి ఎగిరొచ్చిన
ఈ రస ప్రకృతిని చూస్తూ
వందనం చేస్తున్నా
బ్రహ్మాండపు బ్రహ్మానందంలో