[box type=’note’ fontsize=’16’] “సోదరి నివేదిత గురించి. ఆ లక్ష్యమేమిటో, దానిని ఆమె ఎలా సాధించగలిగారో వివరించిన పుస్తకం కవి శేషాచలం రచించిన “రాష్ట్ర సేవిక సోదరి నివేదిత” . [/box]
[dropcap]మి[/dropcap]స్ మార్గరెట్ నోబుల్ – సోదరి నివేదితగా మారిన వైనాన్ని వివరించే చిన్న పుస్తకం ఇది. వేళ మైళ్ళ దూరం వచ్చి, భారతీయులను సొంతవారిలా మార్చుకుని దేశానికే తన జీవితాన్ని అంకితం చేసి ఈ మట్టిలోనే కలిసిపోయిన గొప్ప స్త్రీమూర్తి సంక్షిప్త జీవన గాథ ఈ పుస్తకం.
“పాశ్చాత్య ప్రపంచంలో అందునా, ఆనాడు భారతదేశంపై ఆధిపత్యం వహిస్తున్న ఇంగ్లాండులో జన్మించి భారత ప్రజానీకానికి సేవజేయడానికై తన సర్వస్వాన్ని అర్పించి, అంకితమైన ఒక అపూర్వ వ్యక్తిత్వాన్ని సోదరి నివేదితలో మనం చూడగలం. నూట ఇరవై సంవత్సరాల క్రిందట ఆమె మన భారతదేశంలో అడుగుపెట్టింది. పదమూడు సంవత్సరాల తర్వాత ఇక్కడే సమాధి అయ్యింది. ఆమె జీవితం ఎందుకు ఎలా వినియోగమైందో, ఆనాడు, ఆ తర్వాత వందసంవత్సరాలలోనూ మన ప్రజలకు అర్థమైన దానికంటే, ఇప్పుడు బాగా అర్థమవుతున్నది. ఆమె వ్యక్తిత్వాన్ని గురించి, ఆమెసేవలగురించి, బోధలగురించి తెలుసుకోవాలనే అసక్తి సర్వత్రా వ్యక్తమవుతున్నది.” అంటూ, “ఆ దృష్ట్యా, 25 సం||ల క్రితం ప్రచురితమైన పుస్తకాన్ని మరల ప్రచురించటం సందర్భోచితమవుతున్నది” అన్నారు ప్రచరణకర్తలు “ప్రకాశకుల మనవి”లో.
“మిస్ మార్గరెట్ నోబుల్ నుండి నివేదిత-ఎంతటి మార్పు! ఎంతటి సమగ్రపూర పరివర్తన! అది ప్రశ్న నుండి జవాబు దాకా ఆసక్తికరంగా సాగిన ఒక కష్టభూయిష్టమైన యాత్ర, పునరుత్థాన భారత్ కు భౌతిక పాశ్చాత్యం వేసిన ప్రశ్న ‘మిస్ నోబుల్’ అయితే, దానికి ఆధ్యాత్మిక ప్రాచ్యం ఇచ్చిన జవాబు “సోదరి నివేదిత”. నివేదిత పేరును ఒక మనిషి సాహసిక యాత్రకు ప్రతీక అనేకంటే ఒక చారిత్రిక ప్రక్రియకు, సామాజిక నడవడికి, భారతీయ పునర్వికాసానికి చిహ్నం అనడం సమంజసం. సత్యజీవనం గడిపేవారికి వీరోచితకృషి సలిపేవారికి అది అనుకరించదగిన అనుసరణీయ నమూనా. ఆ దృష్టితో, ఆ స్ఫూర్తితో ఈ మహోన్నత జీవిత చరిత్రను చదివి తెలుసుకొందాము” అన్నారు శ్రీ రంగా హరి – తాము వ్రాసిన ‘ప్రస్తావన’లో.
నవయుగ భారతి ప్రచురణల వారు ప్రచురించిన ఈ 64 పేజీల పుస్తకం వెల రూ.30/-. ప్రతులు సాహిత్యనికేటన్, 3-4-852, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాద్ 500027 వద్ద, సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట, ఏలూరు రోడ్, విజయవాడ 520002 వారి వద్ద లభిస్తాయి.