[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘రాత్రి – చీకటి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఇం[/dropcap]టా బయటా వూర్లో అడవిలో
పర్వతాలపైనా లోయల్లో
విస్తారంగా పరుచుకున్న చీకటి
‘నీ వయసెంత బలమెంత’
అని రాత్రిని అడిగింది
రాత్రేమో క్షణాల్ని లెక్కబెట్టుకుంటూ
భూమికీ ఆకాశానికీ నడుమ
పరుగులు పెడుతోంది
రాత్రికి
చీకటి చిక్కదనమే బలం
పొరల పొరల చీకటే ఉచ్ఛ్వాస నిశ్వాస
పొంగిపొరలే చీకటి ప్రవాహమే చలనం
ఆకాశంలో మెరిసే చంద్రుడూ
మురిసే చుక్కలూ చీకట్లో
చెమ్మా చెక్కా అడుతూవుంటే
రాత్రి కాలుగాలిన పిల్లిలా
పరుగులు పెడుతోంది
ఇంతకూ చీకటి అడిగినట్టు
రాత్రి వయసెంత బలమెంత
అవి రెండూ కవలలా
ఒకే నాణానికున్న రెండు ముఖాలా!!!