Site icon Sanchika

రాత్రి వేళ

[dropcap]నీ[/dropcap]లాకాశం లో నిండు వెన్నెల తో
మిణుకు మిణుకు మెరిసే
తారల కాంతుల లో
ప్రతి నిమిషం ఒక క్షణం లా గడిచిపోతుంటే
ఆ సముద్రం అలల పై నుంచి వీచే పిల్ల తెమ్మరలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి
అణువణువునా గుబాళించే పూల పరిమళాలు పరవశాన్ని కలిగిస్తున్నాయి
ఆ సువాసనలు నిద్ర మైకాన్ని కలిగిస్తుంటే
ఆ చిరు గాలులు కురుల ను కదిలిస్తుంటే
ఆ కురుల గిలిగింతలకు నిద్ర లో నవ్వుకుంటుంటే
ఈ రాత్రి ఇలానే గడిచిపోవాలని
ఈ సమయం ఇలానే నిలిచిపోవాలని
కోరుకుంటుంది నా మనస్సు

Exit mobile version