Site icon Sanchika

రావిడి

[dropcap]”ఈ[/dropcap] బూలోకము ఏమిటికి వుందో… నేను ఈడ అదేమిటికి వుండానో పోనా…” అంటా బేజారు పడితిని.

“అట్లేలరా బేజారు పడతావు. వుండేదాన్నింకా సంతోషము పడరా” అనే అన్న.

“ఈ రావిడిల్ల ఎట్ల సంతోషముగా వుండేది” అంటా అదో మాద్రిగా రేగితిని.

“ఉండేదాన్నింకారా” రాగము తీసె అన్న.

“అయ్యే కర్మ కర్మ. అంతా నా కర్మ” అంటా అంగలాస్తిని.

“అదేలరా అట్లంటావు?”

“నువ్వు ఎట్ల అంటా వుండావో నీకి తెలుస్తా వుందానా?”

“తెలికేంరా, నేను ఉండేదాన్నింకా నాకి అన్నీ తెలస్తా వుండాయి. అందరి మాద్రి నేను వుండాను.  లేకున్నింటే ఏముంది ఏమీ లేదు”

“అట్లంటావానా?”

“ఊరా, నా మాట వినరా. వుండేదాన్నింకా బూమి వుండేదాన్నింకా బూమిపైన నువ్వు వుండేదాన్నింకా సంతోషము పడరా” అని పోయ అన్న.

***

ఇంగ నేనేమి చేస్తాను

అందరిలాగే నేను…

గుంపులో గోవింద…

~

రావిడి = తొందర్లు/ఇక్కట్లు

Exit mobile version