Site icon Sanchika

సరికొత్త ధారావాహిక ‘ రెండు ఆకాశాల మధ్య’ – ప్రకటన

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య‘ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

***

ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం లేకున్నా ఎన్నిసార్లు పాకిస్తానీ సైనికులు శాంతి ఒప్పందాల్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరిపారో… ఎన్నిసార్లు గొడ్డూ గోదా యిళ్ళూ వదిలేసి శిబిరాల్లో తల దాచుకోవాల్సి వచ్చిందో గుర్తొచ్చి అతను భయంతో వణికిపోయాడు.

ఈ సారి స్పష్టంగా తుపాకులు పేలుతున్న శబ్దం వినబడింది. అతనికి ఎటువైపుకు పారిపోవాలో అర్థం కాలేదు. తమ వూరు అటు పాకిస్తానీ సైనిక శిబిరాలకు, యిటు భారతదేశ సైనికి శిబిరాలకు సరిగ్గా మధ్యలో ఉంది. భారతదేశ సైనికులు కాల్పులు జరిపినా తూటాలు బార్డర్ దాటి పాకిస్తాన్ భూభాగంలో పడాలని లేదు. అవి కొన్నిసార్లు గ్రామంలోని ఏ యింటి గోడలకో ఛిద్రాలు చేయవచ్చు లేదా పొలాల్లో పని చేసుకునే ఏ రైతు గుండెల్లోకో చొచ్చుకుని పోవచ్చు.

***

తెలుగు సాహిత్యంలో తొలిసారిగా భారత-పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లోని గ్రామాల కశ్మీరీయు ప్రజల జీవితాలను కళ్ళకుకట్టినట్టు చూపే నవల…కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన రచయిత సలీం సంచికకోసం ప్రత్యేకంగా అందిస్తున్న సమకాలీన సమస్యకు దర్పణం , “రెండు ఆకాశాల మధ్య” నవల, ధారావాహికగా చదవండి వచ్చే వారం నుంచి.

 

Exit mobile version