Site icon Sanchika

రెపరెపలాడే జెండా

ఎదలో చేరి నా ప్రాణమై
ఎగిరేస్తే మా గుండెల్లో ఆత్మవై
రెపరెపలాడుతు గగనతలంలో
మూడు రంగుల జెండా…
మా పాలిట నువ్వే అండా

మాలో మాకు ఐక్యత పెంచి
మానవతావాదంతో మంచిని పంచి
కులమతాల గోడలు తెంచి

మేమంతా ఒక్కటేనని కలిసి
జీవించే సైతం నీ స్ఫూర్తితో

భారత మాత బిడ్డలుగా
అమ్మ ఒడి నుండి బడికి
సాగిన
మా ప్రయాణంలో
మనసంతా నీ పైనే
నీ ప్రభావం మాపైనే

ఓ.. మువ్వన్నెల జెండా
మా గుండెల్లో నీ ఊపిరి
పదిలంగా

భిన్నత్వంలో ఏకత్వం
సర్వమత సమ్మేళనం
నువ్వంటే మా ప్రాణం
అందుకే ప్రతి ఇంటిపై
మువ్వన్నెల జెండా
ఎగురేద్దాం పదిలంగా

Exit mobile version