రుచి – The Temptation

    1
    9

    [box type=’note’ fontsize=’16’] సినిమాలు కేవలం వినోదాన్నిస్తాయి. సమాజంపై వాటి ప్రభావం వుండదు అంటారు చాలామంది. కానీ ఎలాగయితే నీటిలోకి విసిరిన వస్తువు ఎంత తేలికదయినా, దాని శక్తికి తగ్గ స్థాయి అలలను సృష్టించేట్టు, మనిషి చూసే ప్రతిదీ అతని మనసుపై ప్రభావం చూపిస్తుంది. ఈ నిజాన్ని అత్యంత భయానకంగా చూపిస్తుంది గీతాచార్య వేదాల రచించిన హారర్ కథ రుచి- the temptation. హార్ట్ పేషంట్లు, రక్తమంటే భయపడేవారూ ఈ కథను అన్ని జాగ్రత్తలు తీసుకుని చదవాలి.[/box]

    రోజూలానే స్కూలుకెళ్ళి వచ్చాను. బాగా దాహంగా ఉంది. సాయంత్రం నాలుక్కావస్తోంది. ఇంట్లో ఎవరూలేరు. చెల్లి వచ్చాక సినిమా ప్రోగ్రామని అనుకున్నాము. రెణ్ణెల్లు సెలవలు రావటంతో సిటీనుంచీ మా టౌనుకొచ్చాను. నేను చదువుకున్న స్కూల్లో ఏదన్నా చెప్పమంటే సరదాగా లెక్కలుచెప్దామని వెళ్ళొస్తున్నాను. రోజుకో గంట. కాసేపు పిల్లల్తో టైమ్పాస్. బాగనే ఉందనిపించింది.ఇంతలో

    అమ్మా,నాన్నా ఇద్దరూ కూడా అత్యవసరప్పని మీద ఊరెళ్ళటంతో నేనూ చెల్లీ ఇద్దరమే ఉంటున్నాము నిన్నటినుంచీ.

    ఇంట్లోకెళ్ళినీళ్ళు త్రాగి చూద్దును కదా, ఎన్ని త్రాగినా మితి లేదే. నాలుగ్గ్లాసులు త్రాగి, ఐదోదిమొదలెట్టబోతుండగా చెల్లొచ్చింది. దాని చేతిలో కుక్క పిల్ల. ఇంటి వాళ్ళదనుకుంటాను. ముద్దుగాఉన్నదది. కానీ నాకు కుక్కలే కాదు. ఏ పెంపుడు జంతువులన్నా అసహ్యమే మొదటి నుంచీ. కానీఈసారి ఇంటి వాళ్ళ కుక్కను ముద్దు చెయ్యటం అందరినీ ఆశ్చర్య పరచింది. నేను కాదనననే అనుకున్నదేమో,చెల్లి వెళ్ళి దాన్ని తీసుకొచ్చింది. తన భుజానికి కాలేజి బాగు లేదు. అంటే తను వచ్చిబాగింట్లో పెట్టి పైకెళ్ళి దాన్ని తీసుకొచ్చిందన్నమాట. నేను గమనించలేదా?

     ఎందుకోఈ మధ్య పరధ్యానం ఎక్కువవుతోంది. చీమ చిటుక్కుమన్నా నాకు తెలిసిపోతుంది. కానీ ఇవాళ ఇట్లా!నిజానికిదేమీ పెద్ద విషయమేమీ కాదు. కానీ, కానీ… నా స్వభావానికి విరుద్ధంగా ఉంది. అందుకనో,లేక ఈ మధ్య జరిగిన సంఘటనల వల్లనో ఏమో మరి.

     “ఏంట్రా అన్నయ్యా, ఫ్రిజ్జులో ఉన్న బాటిల్స్ అన్నీ అయిపోగొట్టావా?” చెల్లి మాటలతో నేను ఈ లోకంలోకొచ్చాను. చేతిలో మంచి నీళ్ళ బాటిల్. ఫ్రిజ్జులోనివన్నీ ఖాళీ. ఇందాకన నా చేతిలో గ్లాసనుకున్నదిబాటిలా? అసలు నాకేమవుతున్నది? హహహ. అనవసరంగా ఆలోచిస్తున్నాను. ఇందులో ఏమున్నది?

     “నీళ్ళేమైనాయిరా?”చెల్లి అడిగింది మళ్ళీ. “నాలుగు బాటిళ్ళు. మధ్యాహ్నం చూశాను. ఇంతలోనే అయిపోగొట్టావా?”

     తలవిదిలించి మళ్ళీ ఫ్రిజ్జులోకి చూశాను. నిజమే నాలుగు బాటిళ్ళూ ఖాళీ. ఏమైనయ్యబ్బా నీళ్ళు?నేను వచ్చింది కూడా ఇప్పుడే కదా? ఇలా లోపలికొచ్చాను…

    ***

    “ఒరేయ్!లేవరా. లే. డెబ్బయ్ రూపాయల టిక్కెట్టు కొని సినిమాకొచ్చింది నిద్ర పోవటానికా?” చెల్లిఅంటోంది. రెండు మూడు సార్లు తట్టి పిలిస్తే కానీ నేను లేవలేదు. అప్పటికే సినిమా అయిపోయిఅందరూ వెళ్ళిపోతున్నారు. ఇందాకనే కదా సినిమాకొచ్చింది. అప్పుడే అయిపోవటమేమిటి? “అప్పుడేసినిమా అయిపోయిందా?” పైకే అనేశాను.

     “నీబొంద. అప్పుడేనా? బెల్లాను కాపాడటం, ఎడ్వర్డ్ బెల్లా డాన్సేయటం…” చెల్లి చెప్పుకుపోతోందో,లేక నన్ను తిడుతోందో నాకు అర్థం కావటం లేదు. ట్వైలైట్ సినిమా చూద్దామని ఎప్పటి నుంచోఅనుకుంటున్నాము. క్రిస్టెన్ స్టివార్ట్ ను చూద్దామని ఎగురుకుంటూ వెళ్ళి మరీ నిన్న టికెట్లుబుక్ చేయించుకునొచ్చాను. ఏంటి? నోరంతా? ఏంటి నోట్లో? నీళ్ళు కాదు. వాంతేమన్నా అవుతోందా?లేదే? ఏదో రుచి తేడాగా ఉంది. నాలుక మీద చెయ్యి పెట్టుకుని చూశాను. నోరంతా రక్తం. చెల్లిచూడకోడదని రెండడుగులు వెనక్కి వేసి, ఉమ్మేశాను. కొంపదీసి కాన్సర్ కాదు కదా? పాత సినిమాల్లోలా…వణుకుపుట్టింది ఒక్కసారిగా. గొంతులో కానీ, కడుపులో కానీ ఏ బాధా అనిపించలేదు. పైగా హుషారుగాఉంది. ఏమైందసలు? సాయంత్రం నుంచీ వేధించిన దాహం జాడే లేదసలు!

    నాలుకతోనోరు తడిమి చూసుకున్నాను. క్రింది పెదవి లోపల భాగంలో ఏదో పుండులా తగిలింది. అక్కడినుంచే రక్తం వస్తోందని గ్రహించాను.

    ***

    ఆటోదిగి, ఇంట్లోకి వెళుతున్నప్పుడు కుక్క పిల్ల ఎదురొచ్చింది. నాకు తెలియకుండానే దాన్నినా చేతుల్లోకి తీసుకున్నాను. కాసేపలా దాన్ని హత్తుకున్నాను. ఎందుకో ఒక రకమైన ప్లెషర్కలిగింది. దాని దగ్గర నుంచీ వస్తున్న ఒక రకమైన వాసన తమాషాగా నా నాసికను తాకింది. ఏమిటబ్బాఅని ఆలోచిస్తూ చెల్లి అడిగిందని తనకిచ్చాను. ఆ వాసనేదో చెల్లికి కూడా తెలుస్తోందా?అడుగుదామనిపించినా, ఎప్పుడూ లేదని క్రొత్త విషయమైతే, తనకి కూడా తెలుస్తే తనే చెప్పేస్తుందికదా! రోజూ ఆరకమైన వాసన వస్తుందా పింకీ? నేనెప్పుడూ ఆ కుక్క పిల్లనే కాదు. అసలే కుక్కపిల్లను కూడా దగ్గరకు రానిచ్చిందే లేదు.

     రెండువారాల క్రితం ఇంటి కొచ్చినప్పుడు మొదటి సారిగా అప్రయత్నంగానే చేతుల్లోకి తీసుకున్నాను.మొదట కాస్త ప్రతిఘటించినా ఆశ్చర్యకరంగా అది నా దగ్గర బాగ అలవాటు ఉన్న దానిలాగానే ప్రవర్తించింది.ఇంటి ఓనర్ కూడా భలే ఆశ్చర్య పడింది. “ఏమ్మాయ చేశావబ్బాయ్?” అని నవ్వుతూ అడిగింది కూడా.ఆ తరువాత అప్పుడప్పుడూ చెల్లి తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని ఆడించేవాడిని. అప్పుడెప్పుడూఅలాంటి వాసన రాలేదు. ఒకరకమైన ప్రత్యేకమైన సెంట్ అది. ఇప్పుడే ప్రత్యేకంచి నాకు తెలిసిందంటేచెల్లికి అసలు తెలిసే అవకాశం లేదు. భలే గమ్మత్తుగా ఉందా వాసన. ఇంతలో ఇంటి వాళ్ళమ్మాయివచ్చి, దాన్ని పైకి తీసుకెళ్ళింది. చెల్లితో కాసేపు మాట్లాడి.

    ***

    కుక్కమెడ మీద కంత పెట్టాను పళ్లతో. మొదట కాస్త కష్టమనిపించినా తరువాత్తరువాత చాలా ఈజీగాపని అయింది. చిన్నగా పెదాలన్కడ ఉంచి, నోటికి గటిగా అదుముకుని, రక్తం పీల్చటం మొదలెట్టాను.శరీరమంతా ఒకరకమైన తెలియని ఉద్వేగం. ఏదో తెలియని దాహం తీరుతున్న అనుభూతి. అత్యద్భుతమైనబహుమతినేదో, అదే ఇంటర్ యూనివర్సిటీ మీట్ లో కాలేజ్ తరఫున ప్లేయరాఫ్ ద టోర్నీగా ఎంపికయినప్పుడుఇచ్చిన ట్రోఫీని ఎంత ఆప్యాయంగా హత్తుకున్నానో, ఇప్పుడా పనిని నా చేతులు చేస్తున్నాయి.ఇప్పుడీ కుక్కనేమి చెయ్యాలి? ఎక్కడన్నా రక్తమ్మరకలున్నాయా? చుట్టూ చూశాను. లక్కీగాఏమీ లేవక్కడ. వాటర్ టాం౨క్ వెనకాల కూచున్న నేను, చిన్నగా వంగి కుక్కని అలగే ఎడమ చేత్తోపట్టుకుని ఇవతల వైపుకొచ్చాను. కాస్త దూరంలో ఒక తెల్లటి ప్లా౨స్టిక్ కవర్ కనిపించింది.దాంట్లో పింకీని కుక్కేశాను. పైన మిగిలి ఉన్న కవర్ని మెలితిప్పిపట్టుకుని గోడ మీద నుంచీక్రిందకు చూశాను. పాతికడుగుల క్రింద వెనకాలంతా చెత్త కుప్పలూ, పిచ్చి మొక్కలూనూ. అటువైపు దాన్ని ఇసిరేశాను. అటు వైపు నుంచీనే వెనుక వైపుగా దిగేసి, దొడ్డి వైపున్న బాత్రూమ్లో షర్టుకంటిన రక్తాన్ని తొలగించే ప్రయత్నం చేశాను. లాభం లేదు. మరకలు పోయేలా లేవు.

    తడిషర్టునలాగే నలిపేసి ప్రక్కనే ఉన్న ఇనుప చువ్వతో మోచేతి మీద గీరుకున్నాను. ఇంట్లోకివెళ్ళి పడుకుందామనుకునే లోగా హాల్లో లైట్ వెలిగింది. చెల్లి లేచినట్టుంది. అలికిడేమన్నాచేశానా? “అన్నయ్యా ఎక్కడికెళ్ళావ్? మోచేతికి ఆ రక్తమేంటి?”

    ***

    “పింకీ దొరకలేదా ఆంటీ?” చెల్లి దిగులుగా అడగటం వినిపిస్తోంది. నేను రోజర్ ఫెడెరర్, జోస్ అకాసుసోమా౨చ్ హైలైట్స్ చూస్తున్నాను. నా గుండెలవిసినట్టనిపించింది ఆ ప్రశ్న విని. “లేదమ్మా…”ఆంటీ ఇంకా ఏదో మాట్లాడుతున్నట్లుంది. నాకు ఏమీ వినిపించటం లేదు. ఒక్కసారిగా కడుపులోంచీఎదో తన్నుకుని వస్తున్నట్టనిపించింది. పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్ళాను. పూర్తిగావెళ్ళీ వెళ్ళకుండానే వాంతయిపోయింది. షర్టు మీదా, పాం౨టు మీదా… అలాగే ఎలాగో బాత్రూమ్లో దూరాను. ఇంతలో శబ్దం విననుకుంటాను చెల్లి పరిగెత్తుకుని వచ్చి, చెవులు మూసి పట్టుకుంది.నా పరిస్థితి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఇకారోజంతా నాకు పడకెయ్యక తప్పలేదు. వళ్ళు తెలియనిజ్వరం.

    ***

    మంచమ్మీదలేచి కూచున్నాను. చిన్న జీరో బల్బు తప్ప ఏ ఇతర వెలుతురూ లేదు. నాకు కాస్త కాస్త చెమటలుపడుతున్నట్టు తెలుస్తోంది. బాగా మగతగా ఉంది. కళ్ళు నులుముకుని చూశాను. బయట కీచురాళ్ళచప్పుడు తప్ప ఇంకేమీ వినబడటం లేదు. రెండున్నర నిమిషాలలాగే కూచున్నాను. క్రమంగా వళ్ళంతాసెగలు కక్కుతున్నట్టనిపించటమ్మొదలైంది. కొన్ని క్షణాల్లోనే సల సల కాగిపోతున్న ఫీలింగ్.దాహం. దాహమ్మొదలయింది. ప్రక్కనే టేబుల్ మీద చెల్లి పెట్టిన వాటర్ బాటిల్ కనిపించింది.ఎడమ చేత్తో దాన్ని అందుకునే ప్రయత్నం చేశాను. అలాగే ముందుకు పడిపోయాను.

     అలాఎంత సేపయిందో తెలియదు. నుదుటన ఏదో పాకుతున్నట్టనిపించి చేత్తో తడిమి చూశాను. మంటగాఅనిపించింది. స్టూల్ కాలికి ఉన్న మేకొకటి బయటకు పొడుచుకుని రావటం కనిపించింది. అక్కడరక్తం… నేల మీద మరికొన్ని చుక్కలు. నాకు విషయం అర్థమయ్యే లోపలే ఆ మేకు తలకు వేళాడుతున్నట్టున్నరక్తం బొట్టు క్రింద పడింది. వీధి మలుపులో కుక్క మొరుగుతోంది. అది తప్ప అంతా చిక్కటినిశ్శబ్దం. ముందుకు వంగి ఆ రక్తాన్ని తుడువబోయాను. ఇంతలో మళ్ళా దాహం. బాటిల్ అందుకునిగటగటా త్రాగేశాను. దాహం తీరలేదు సరికదా ఇంకా ఎక్కువయింది. ఇక నిలువలేక ఫ్రిజ్జులోంచీతెచ్చుకుందామని నా రూమ్ లోంచీ బయటకొచ్చాను. అలికిడికనుకుంటాను, హాల్లో పడుకుని ఉన్నచెల్లి లేచింది. “ఏంట్రా దాహంగా ఉందా? నేను తెస్తాను. నువ్వా కుర్చీలో కూచో,” అంటూతను కిచెన్లోకి వెళ్ళింది.

     నాకుగ్లాసులో నీళ్ళు పోసిచ్చి, “తల మీద రక్తమేంట్రా? ఏమైంది? పడ్డావా? రేప్పొద్దున డాక్టర్దగ్గరకు వెళదాం,” అంటూ నా నుదుటన చెయ్యి వేసింది, కాస్త దగ్గరగా వచ్చి. ఏదో వాసన. నానాసికను త్రాకింది. క్రొత్త ఫీలింగొకటి మొదలయింది.

     ఒక్కసారిగాలేచాను. చెల్లి చేతుల్ని పట్టుకున్నాను. తను బెదిరినట్టుంది. “ఏంట్రా అలా లేచావ్? ఉలిక్కిపడ్డానుతెలుసా…?” నవ్వుతూ అనబోయింది. తన మొహంలో క్రొత్తగా భయం చోటు చేసుకుంది. నేను తన మీదకులంఘించాను. భుజాల మీద చేతులు అదిమి పెట్టి, తరువాత ఎడమ చేత్తో తలను వెనక్కి నెట్టి,మెడ మీదకు నా నోటిని పోనిస్తుండగా ఒక్కసారి తన బలాన్నంతా ఉపయోగించి నన్ను తోసింది.ఊహించని ఈ పరిణామానికి సిద్ధంగా లేకపోవటంతో వెళ్ళి టీవీ సెట్ మీద పడ్డాను. పిక్చర్ట్యూబ్ పగిలినట్టుంది. నా నడుముకు గట్టి దెబ్బ తగిలింది. ఒక్క క్షణం లేవలేకపోయాను.టీవీ శ్టాండ్ సపోర్టుగా తీసుకుని మళ్ళా లేచి తన మీదకు వెళ్ళబోయాను. తను కంపించిపోతూ,పెద్దగా అరచింది.

     నేనుబలంగా తన చేతుల్ని వెనక్కు విరిచి పట్టుకుని తనను నాకు అదుముకున్నాను. ఎడమ చేత్తో తనచేతుల్ని బలంగా పట్టుకుని, కుడి చేత్తో జుట్టు పట్టుకుని మెడ విరుచుకునేలా లాగాను.తను పెద్ద్గగా అరుస్తూనే ఉంది. నేను తన మెడ మీద ఎడమ వైపు పళ్ళను లోతుగా దింపాను. తనుగావు కేక పెట్టింది. బలంగా కండలోకి పళ్ళను దింపి, గట్టిగా లాగాను. ఒక్కసారిగా రక్తంచిమ్మి నా ముక్కులోనూ, కళ్లలోనూ పడింది. తన కాళ్ళలో సత్తువ పోతున్నట్టు నాకు తెలుస్తోంది.గాయంలోంచీ రక్తం ధారగా కారుతూ తన చుడీదార్ మీదగా నేల మీద పడుతోంది. మోకాళ్ళ మీద పడేలాచేసి నేను తన మెడ మీద నోరు పెట్టి రక్తం పీలుస్తున్నాను. ఒక అనిర్వచనీయమైన అనుభూతికలుగుతోంది. శరీరం ఒక అవ్యాజమైన ఆనందాన్ని పొందుతోంది. ఇంతలో కిటికీలోంచీ ఎదురింట్లోలైట్లు వెలగటం కనిపించింది. మా ఇంటి తలుపులు ఎవరో కొడుతున్నారు. ఇంటి ఓనర్ భర్తతో వచ్చినట్టుంది.చెల్లిని పెద్దగా పేరు పెట్టి పిలుస్తోంది. నాకు ఒక్క సారిగా స్పృహ వచ్చినట్టయింది.రక్తమ్మడుగులో చెల్లి. మెడ మీద కంత. నా బట్టల నిండా రక్తం. చేతుల్లోనూ రక్తమే! తలుపులుమ్రోగుతూనే ఉన్నాయి. ఏం చేశాను నేను? ఏమిటిదంతా? వెన్ను అడుగు భాగం నుంచీ పైకి ఏదోలేచినట్టనిపించింది. ఒక్కసారిగా వణుకు. కడుపులోంచీ ఏగదోసుకువస్తున్నట్టనిపించి… పెద్దగాఅరిచేశాను

    ***

    “అన్నయ్యా,అన్నయ్యా!” చెల్లి మాటలు. ఒక్కసారిగా మంచమ్మీద నుంచీ లేచి కూచున్నాను. తలుపులు దబదబాబాదుతోంది. నేను లేచి వెళ్ళి తలుపులు తీశాను. “ఏంట్రా అంత పెద్దగా అరిచావ్? ఏమైంది?నీకీ మధ్య గాలేదో పట్టిందిరోయ్!” చెల్లి సగం వెక్కిరిస్తూ సగం ఆందోళనగా అన్నది.

     “ఓహ్!ఇదంతా కలా?” అనుకున్నాను. నా లాప్టాప్ వైపు చూశాను. అందులో పార్క్ చాన్-వుక్ ‘థర్స్ట్’*సగంలో పాజ్ చెయ్యబడి ఉంది.

     “పాపం, పింకీ ఇంకా దొరకలేదురా. ఆంటీ ఎంత దిగులుగా ఉన్నారో తెలుసా?”

     

    *పార్క్ చాన్ వూక్ (park chan wook) కొరియా సినీ దర్శకుడు. ఈయన తీసిన హారర్ సినిమా థర్స్ట్ (thirst) . ఆ సినిమాలో నాయకుడు రక్త పిశాచి (vampyre) గా మారతాడు.

    గీతాచార్య వేదాల

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here