ఋతుగీతం

0
3

[dropcap]నా[/dropcap]లుగు మెతుకులు
నోట్లోకి వెళ్ళగానే
ఖగోళం లాంటి కడుపును
బీజం తన్నుతుంది
తన్నిన తర్వాత ఆకాశం బద్దలైనట్టు;
వాంతులు.

వంటగదిని
శుభ్రం చేసిన మసి గుడ్డలా- జీవితం
ఎన్నిసార్లు ఉతికిన
పదే పదే వెక్కిరిస్తుంది.

అంతా అయోమయం
ఏది ఎప్పుడు తినాలో?,
ఎంత తినాలో? కొలుచుకోవాలి
ఏ అడుగు ఎలా వేయాలో,
ఏ మెట్టు ఎలా దిగాలో
అన్నీ సందేహాలే, అనుమానాలే

విత్తనం పగులుతుందేమో!
బీజం వృక్షంగా వృద్ధి చెందదేమో!
ఉమ్మనీరు గొంతును నులుముతుందేమో!
భయం భయంగా బతుకు

తల్లి హోదా అంత గొప్పదా?
గర్భం పండకపోతే
అమ్మా… అనే పిలుపుకు నోచుకోకపోతే
ఎడారి ఇసక
గర్భంలో రాలుతుంది, గుచ్చుకుంటుంది
ఆ తర్వాత కడుపంతా
రక్తం రక్తం రక్తం

రక్తం ఎప్పుడు ఆగుతుంది?
హోదా తెలుసుకున్నప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here