[box type=’note’ fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]
[dropcap]క[/dropcap]థ వినడానికి తన ఇంటి అరుగుపై చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన తాతయ్య “బాలలు ఈరోజు మీకు ‘సాగర ద్వీపంలో సాహాస యోధులు’ అనే జానపద కథ చెప్పబోతున్నాను. అందుకు మీకు ద్వీపాలపై అవగాహన కలగడానికి అండమాన్, నికోబార్ దీవుల గురించి తెలియజేస్తాను….” అంటూ చెప్పసాగారు.
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని పోర్ట్ బ్లెయిర్ నగరం. ద్వీపాల మొత్తం భూభాగం సుమారు 8,249 చ.కి.మీ ఉంటుంది. ఈ భూభాగాన్ని మూడు జిల్లాలుగా విభజించారు: కార్ నికోబార్ రాజధానిగా నికోబార్ జిల్లా, పోర్ట్ బ్లెయిర్‌తో రాజధానిగా దక్షిణ అండమాన్ జిల్లా, మాయాబందర్ రాజధానిగా ఉత్తర మధ్య అండమాన్ జిల్లా. ఈ ద్వీపాల్లో భారత సాయుధ దళాలకు చెందిన అండమాన్ నికోబార్ కమాండ్ ఉంది. త్రివిధ దళాలకు చెందిన భౌగోళిక కమాండు ఇదొక్కటే. అండమాన్ ద్వీపాల్లో సెంటినెలీస్ ప్రజలు నివాసముంటారు. నాగరికత స్పృశించని మానవులు వీరు ఇప్పటకీ పాతరాతి యుగపు స్థాయి లోనే ఇంకా జీవిస్తున్న మానవులు వీరొక్కరే.
సుమారు 2,200 సంవత్సరాల నాటి చరిత్రకు పురావస్తు ఆధారాలున్నాయి. అయితే, 30,000 సంవత్సరాల క్రితం ముగిసిన మధ్య పాతరాతియుగ సమయంలో దేశీయ అండమానీస్ ప్రజలు ఇతర జనాభా నుండి విడివడి ఉండవచ్చని జన్యు, సాంస్కృతిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆ సమయం నుండి, అండమానీయులు భాషాపరంగా, సాంస్కృతికంగా విభిన్నమైన, ప్రాదేశిక సమూహాలుగా పరిణమించారు.
నికోబార్ దీవుల్లో వివిధ నేపథ్యాల ప్రజలు ఉంటున్నట్లు కనిపిస్తుంది. యూరోపియన్లు వచ్చే సమయానికి స్వదేశీ నివాసులు, మోన్-ఖ్మెర్ భాష మాట్లాడే నికోబారు ప్రజల తోటీ, షాంపెన్‌ల (వీరు మాట్లాడే భాష దేనికి సంబంధించినదో తెలియదు) తోటీ మిళితమైపోయారు. వీటిలో ఏ భాష కూడా అండమానీయులకు సంబంధించినది కాదు.
మొదటి రాజేంద్ర చోళుడు (సాశ.1014 నుండి 1042 వరకు), శ్రీవిజయ సామ్రాజ్యంపై (ఆధునిక ఇండోనేషియా) చేసిన దండయాత్రను మొదలుపెట్టేటపుడు అండమాన్ నికోబార్ దీవులను వ్యూహాత్మక నావికా స్థావరంగా ఉపయోగించాడు. క్రీస్తుశకం 1050 నాటి తంజావూర్ శాసనంలో చోళులు ఈ ద్వీపాన్ని మ-ణక్కవరం (‘గొప్ప బహిరంగ/నగ్న భూమి’) అని పిలిచారు. యూరోపియన్ యాత్రికుడు మార్కో పోలో (12 వ -13 వ శతాబ్దం) ఈ ద్వీపాన్ని ‘నెకువెరాన్’ అని అన్నాడు. తమిళ పేరైన నక్కవరం బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో నికోబార్ అనే ఆధునిక పేరుకు దారితీసి ఉండవచ్చు.
1755 డిసెంబరు 12 న డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి సెటిలర్లు నికోబార్ దీవులకు రావడంతో ఈ ద్వీపాలలో వ్యవస్థీకృత యూరోపియన్ వలసల చరిత్ర ప్రారంభమైంది. 1756 జనవరి 1 న, నికోబార్ దీవులను డేనిష్ కాలనీగా మార్చారు, మొదట దీనిని న్యూ డెన్మార్క్ అని పిలిచారు, తరువాత ( 1756 డిసెంబరు) ఫ్రెడెరిక్ ద్వీపాలు ( ఫ్రెడెరిక్ సోర్న్) అన్నారు. 1754-1756 సమయంలో వారు ట్రాంక్యూబార్ (డేనిష్ భారతదేశంలో ఉంది) నుండి పరిపాలించారు. 1759 ఏప్రిల్ 14 – 1768 ఆగస్టు 19 మధ్య, 1787 నుండి 1807/05 వరకు, 1814 నుండి 1831 వరకు, 1830 నుండి 1834 వరకు. ఆ తరువాత 1848 నుండి శాశ్వతంగానూ వ్యాప్తి చెందడంతో ఈ ద్వీపాలను విడిచిపెట్టేసారు
డెన్మార్క్ నికోబార్ దీవులపై తన వాదనలను విరమించుకుందని పొరపాటున భావించిన ఆస్ట్రియా, 1778 జూన్ 1 నుండి 1784 వరకు వాటిపై ఒక వలసను స్థాపించడానికి ప్రయత్నించి, వాటికి థెరేసియా దీవులు అని పేరు పెట్టింది.
1789లో బ్రిటిష్ వారు గ్రేట్ అండమాన్ పక్కన ఉన్న చాతామ్ ద్వీపంలో నావికా స్థావరాన్ని, ఒక జైలు కాలనీనీ స్థాపించారు. అక్కడే ఇప్పుడు పోర్ట్ బ్లెయిర్ పట్టణం ఉంది. రెండు సంవత్సరాల తరువాత ఈ కాలనీని గ్రేట్ అండమాన్ లోని పోర్ట్ కార్న్వాలిస్‌కు తరలించారు. కాని వ్యాధి కారణంగా 1796 లో దీన్ని వదిలేసారు.
16, 1868 అక్టోబరు న నికోబార్ దీవులపై హక్కులను డెన్మార్కు బ్రిటన్‌కు విక్రయించడంతో ఇక్కడ డెన్మార్క్ ఉనికి అధికారికంగా ముగిసింది, ఇది 1869 లో బ్రిటిష్ ఇండియాలో భాగమైంది.
1858లో బ్రిటిష్ వారు మళ్ళీ పోర్ట్ బ్లెయిర్ వద్ద ఒక కాలనీని స్థాపించారు, ఇది మరింత శాశ్వతంగా నిర్మించారు. భారత ఉపఖండం నుండి నేరస్థులను పంపించడం కోసం ఒక శిక్షా కాలనీని ఏర్పాటు చేయడం ప్రాథమిక ఉద్దేశం. ఆ విధంగానే ఇక్కడ అప్రతిష్ఠాకరమైన సెల్యులార్ జైలు వెలిసింది. ప్రవాస లేదా ఏకాంత ద్వీపాంతర వాస శిక్ష విధించబడిన భారత స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి సెల్యులార్ జైలులో బంధించేది. ఈ జైలును కాలాపానీ అని కూడా పిలిచేవారు. పోర్ట్ బ్లెయిర్ లోని ఈ సెల్యులర్ జైలును భారతదేశపు సైబీరియాగా పరిగణించేవారు. 1872లో అండమాన్ ద్వీపాలు, నికోబార్ ద్వీపాలు పోర్ట్ బ్లెయిర్‌లో ఒకే చీఫ్ కమిషనర్ కింద ఐక్యమయ్యాయి.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ఈ ద్వీపాలు ఆచరణాత్మకంగా జపనీస్ నియంత్రణలో, నామమాత్రంగా సుభాష్ చంద్రబోస్ యొక్క అర్జీ హుకుమాటే ఆజాద్ హింద్ అధికారం క్రింద ఉన్నాయి. యుద్ధ సమయంలో బోసు ఈ ద్వీపాలను సందర్శించి, వాటి పేర్లను ‘షహీద్-ద్వీప్’ (అమరవీరుల ద్వీపం) అని, ‘స్వరాజ్-ద్వీప్’ (స్వీయ-పాలన ద్వీపం) అనీ మార్చాడు.
1944 ఫిబ్రవరి 22 న భారత జాతీయ సైన్యానికి చెందిన జనరల్ లోగనాథన్‌ను అండమాన్ నికోబార్ దీవులకు గవర్నర్‌గా నియమించారు. అతను నలుగురు ఐఎన్ఎ అధికారులతో పాటు -మేజర్ మన్సూర్ అలీ అల్వి, సబ్. లెఫ్టినెంట్ ఎండి ఇక్బాల్, లెఫ్టినెంట్ సుబా సింగ్, స్టెనోగ్రాఫర్ శ్రీనివాసన్ లతో కలిసి పోర్ట్ బ్లెయిర్‌లోని లాంబలైన్ విమానాశ్రయంలో దిగాడు. 1944 మార్చి 21న, అబెర్డీన్ బజారులోని గురుద్వారాకు సమీపంలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసాడు. 1944 అక్టోబరు 2 న, కల్నల్. లోగనాథన్, మేజర్ అల్వీకి అధికారం అప్పగించి పోర్ట్ బ్లెయిర్ను విడిచిపెట్టి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు.
జపాన్ వైస్ అడ్మిరల్ హరా టీజో, మేజర్-జనరల్ తమెనోరి సాటోలు, 1945 అక్టోబరు 7 న పోర్ట్‌బ్లెయిర్‌లోని జింఖానా గ్రౌండులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ద్వీపాలను 116 వ భారత పదాతిదళ బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ జెఎ సాలమన్స్‌కు, ఇండియన్ సివిల్ సర్వీస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ నోయెల్ కే ప్యాటర్సన్ కూ అప్పగించారు.
1945 లో లొంగిపోయిన తరువాత జపాన్ సైనిక ప్రతినిధి బృందం, ద్వీపాలను రాజ్‌పుట్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ నాథు సింగ్‌కు అప్పగించి వందనం చేశారు.
భారతదేశం (1947), బర్మా (1948) రెండింటి స్వాతంత్య్రం సమయంలో, వెనక్కి పోతున్న బ్రిటిషు వారు ఈ ద్వీపాల్లోని ఆంగ్లో-ఇండియన్స్, ఆంగ్లో-బర్మీస్ అందరూ ఈ ద్వీపాల్లో స్థిరపడి తమ సొంత దేశంగా ఏర్పరచుకోవాలని తమ ఉద్దేశాన్ని ప్రకటించారు. అయితే, ఇది ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇది 1950 లో భారతదేశంలో భాగమైంది. 1956 లో దేశపు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.
1980ల నుండి భారతదేశం ఈ ద్వీపాలలో రక్షణ సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. బంగాళాఖాతం, మలక్కా జలసంధిలో భారతదేశపు వ్యూహాత్మక పాత్రలో ఈ ద్వీపాలకు ఇప్పుడు కీలక స్థానం.
26 2004 డిసెంబరు న, అండమాన్ నికోబార్ దీవుల తీరాలు, హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ భూకంపం కారణంగా వచ్చిన 10 మీ. ఎత్తున ఎగసిన సునామీలో దెబ్బతిన్నాయి. 2 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 4,000 మందికి పైగా పిల్లలు అనాథలయ్యారు. లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారు. కనీసం 40,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 46,000 మందికి పైగా గాయపడ్డారు. నికోబార్ దీవుల్లో ఎక్కువగా ప్రభావితమైనవి కచ్చల్, ఇందిరా పాయింట్లు. ఇందిరా పాయింటు 4.25 మీటర్లు కుంగి, పాక్షికంగా సముద్రంలో మునిగిపోయింది. ఇందిరా పాయింట్ వద్ద దెబ్బతిన్న లైట్ హౌస్‌కు మరమ్మతులు చేసారు. మునిగిపోవడంతో పెద్ద మొత్తంలో భూభాగాన్ని కోల్పోయింది. సునామీకి ముందు 8,073 కి.మీ2 (3,117 చ. మై.) ఉన్న భూభాగం, ఇప్పుడు 7,950 కి.మీ2 (3,070 చ. మై.) మాత్రమే ఉంది. సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికులు ద్వీపాల్లో బయటి నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు, పర్యాటకులే. ఆదివాసీ ప్రజలు చాలావరకూ ప్రాణాలతో బయటపడ్డారు. ఎందుకంటే పెద్ద భూకంపాలను అనుసరించి పెద్ద సునామీలు వస్తాయని తరతరాలుగా వస్తున్న మౌఖిక సంప్రదాయాలు వారిని ఖాళీచెయ్యమని హెచ్చరించాయి.
ఈ భూభాగంలో మొత్తం 8.249 చ.కి.మీ విస్తీర్ణం గల 572 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో సుమారు 38 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. ఈ ద్వీపాలు 6° నుండి 14° ఉత్తర అక్షాంశాల మధ్య, 92° నుండి 94° తూర్పు రేఖాంశాల మధ్యా విస్తరించి ఉన్నాయి. అండమాన్లను నికోబార్ సమూహం నుండి 150 కి.మీ. వెడల్పున్న ఛానల్ (టెన్ డిగ్రీ ఛానల్) వేరు చేస్తుంది. అత్యంత ఎత్తైన ప్రదేశం ఉత్తర అండమాన్ ద్వీపంలో ఉన్న సాడిల్ పీక్ (732 మీటర్లు). అండమాన్ సమూహంలో 325 ద్వీపాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 6,170 చ.కి.మీ. నికోబార్ సమూహంలో 1,765 చ.కి.మీ. విస్తీర్ణంలో 247 దీవులున్నాయి.
ఈ కేంద్రపాలిత ప్రాంతపు రాజధాని పోర్ట్ బ్లెయిర్ కోల్‌కతా నుండి 1,255 కి.మీ దూరం లోను, విశాఖపట్నం నుండి 1,200 కి.మీ., చెన్నై నుండి 1,190 కి.మీ. దూరం లోనూ ఉంది. అండమాన్ నికోబార్ సమూహానికి ఉత్తర కొనన స్థానం హుగ్లీ నది ముఖద్వారం నుండి 901 కి.మీ. దూరం లోను, మయన్మార్ నుండి 190 కి.మీ. దూరం లోనూ ఉంది. అన్నిటి కంటే దక్షిణాన ఉన్న దీవి, గ్రేట్ నికోబార్. ఈ దీవి లోని దక్షిణ కొసన (6° 45’10 ″ N – 93° 49’36 ″ E) ఉన్న ఇందిరా పాయింట్ భారతదేశానికి దక్షిణం వైపున చిట్టచివరి స్థానం. ఇండోనేషియాలోని సుమత్రా దీవి నుండి దీని దూరం 150 కి.మీ. మాత్రమే.
భారతదేశంలోని ఏకైక అగ్నిపర్వతం, బారెన్ ఐలాండ్, అండమాన్ నికోబార్లలో ఉంది. ఇది చురుకైన అగ్నిపర్వతం. చివరిగా 2017 లో విస్ఫోటనం చెందింది. బరాటాంగ్ ద్వీపంలో ఒక మట్టి అగ్నిపర్వతం కూడా ఉంది, ఈ మట్టి అగ్నిపర్వతాలు అప్పుడప్పుడు విస్ఫోటనం చెందాయి, 2005లో జరిగిన విస్ఫోటనాలు 2004 హిందూ మహాసముద్రం భూకంపంతో సంబంధం కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. అంతకు ముందరి పెద్ద విస్ఫోటనం 2003 ఫిబ్రవరి 18 న నమోదైంది. స్థానికులు ఈ మట్టి అగ్నిపర్వతాన్ని జల్కీ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఇతర అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ద్వీపం భౌతిక విశేషాల్లో కొన్ని బీచ్‌లు, మడ అడవులు, సున్నపురాయి గుహలు, మట్టి అగ్నిపర్వతాలు.
2018 డిసెంబరులో అండమాన్ నికోబార్ దీవుల్లో రెండు రోజుల పర్యటనలో, భారతప్రధాని నరేంద్ర మోడీ, సుభాస్ చంద్రబోస్‌కు నివాళిగా మూడు ద్వీపాలకు పేరు మార్చాడు. రాస్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం అని, నీల్ ద్వీపానికి షహీద్ ద్వీపమని, హావ్లాక్ ద్వీపానికి స్వరాజ్ ద్వీపమనీ పేర్లు మార్చారు. నేతాజీ స్టేడియంలో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశాడు, బోస్ అక్కడ భారత జెండాను ఎగురవేసిన 75 వ వార్షికోత్సవ సందర్భం అది.
సిస్టర్స్ అనేవి రెండు చిన్న జనావాసాలు లేని ద్వీపాలు. ఈస్ట్ సిస్టర్ ద్వీపం, వెస్ట్ సిస్టర్ ద్వీపం, అండమాన్ ద్వీపసమూహంలో, డంకన్ పాసేజ్‌కు ఉత్తరం వైపున, సుమారు పాసేజ్ ద్వీపానికి 6 కి.మీ. ఆగ్నేయంగా, నార్త్ బ్రదర్‌కు 18 కి.మీ. ఉత్తరాన ఉన్నాయి. ఈ ద్వీపాల మధ్య ఎడం 250 మీటర్లు. వీటిని పగడపు దిబ్బలు కలుపుతాయి. ఈ దీవులు అడవులతో నిండి ఉంటాయి. ఈస్ట్ సిస్టర్ ద్వీపపు వాయవ్య భాగంలో ఒక బీచ్ మినహా మిగతా తీరమంతా రాళ్ళతో కూడుకుని ఉంటుంది.
అండమాన్‌లో బ్రిటిష్ వారు ఒక కాలనీని స్థాపించడానికి ముందు, లిటిల్ అండమాన్ ద్వీపంలోని ఒంగే ప్రజలు చేపలు పట్టడం కోసం సిస్టర్స్‌దీవులకు అప్పుడప్పుడు వెళ్తూండేవారు. 1890 – 1930 మధ్యకాలంలో తమ తాత్కాలిక స్థావరమైన రట్లాండ్ ద్వీపానికి వెళ్ళే మార్గంలో ఈ ద్వీపాలు ఒక స్థానంగా ఉండవచ్చు.1987 లో ఈ ద్వీపాలను 0.36 చ.కి.మీ. ప్రాంతాన్ని వన్యప్రాణుల ఆశ్రయంగా గుర్తించారు.
అండమాన్ నికోబార్ దీవులను ఉష్ణమండల వర్షారణ్య పందిరి కప్పేసి ఉంటుంది. ఇది భారతీయ, మయన్మార్, మలేషియా స్థానిక జాతుల సమ్మిశ్రితంగా ఉంటుంది. ఇప్పటివరకు, సుమారు 2,200 రకాల మొక్కలు నమోదయ్యాయి, వాటిలో 200 స్థానికంగా మాత్రమే ఉంటాయి. మరో 1,300 భారతదేశం ప్రధాన భూభాగంలో ఎక్కడా కనబడవు.
దక్షిణ అండమాన్ అడవులలో ఎపిఫైటిక్ వృక్షసంపద, ఎక్కువగా ఫెర్న్‌లు, ఆర్కిడ్లు పెరుగుతాయి. మధ్య అండమాన్‌లో ఎక్కువగా తేమతో కూడిన ఆకురాల్చే అడవులున్నాయి . ఉత్తర అండమాన్లలో తడి సతత హరిత అడవులు ఉన్నాయి. ఉత్తర నికోబార్ దీవుల్లో (కార్ నికోబార్, బాటిమల్వ్‌తో సహా) సతత హరిత అడవులు అసలే లేవు. అయితే నికోబార్ సమూహం లోని మధ్య, దక్షిణ ద్వీపాలలో ఇటువంటి అడవులు అధికంగా ఉన్నాయి. గడ్డి భూములు నికోబార్లలో మాత్రమే ఉంటాయి. అండమాన్లలో ఆకురాల్చే అడవులు సర్వసాధారణంగా ఉంటాయి. అవి నికోబార్లలో దాదాపుగా లేవు. ప్రస్తుత అటవీ విస్తీర్ణం మొత్తం భూభాగంలో 86.2% అని పేర్కొన్నారు.
ఈ విలక్షణమైన అటవీ కవరేజి పన్నెండు రకాలుగా ఉంటుంది, అవి:
- జెయింట్ సతత హరిత అడవి
- అండమాన్ ఉష్ణమండల సతత హరిత అడవి
- దక్షిణ కొండపై ఉష్ణమండల సతత హరిత అడవి
- కేన్‌బ్రేక్స్
- తడి వెదురు బ్రేకులు
- అండమాన్ సెమీ సతత హరిత అడవి
- అండమాన్ తేమ ఆకురాల్చే అడవి
- అండమాన్ ద్వితీయ తేమ ఆకురాల్చే అడవి
- లిటోరల్ ఫారెస్ట్
- మడ అడవి
- ఉప్పునీరు మిశ్రమ అడవి
- సబ్‌మోంటేన్ అడవి
ఈ ఉష్ణమండల వర్షారణ్యం, ఇతర భూభాగాల నుండి విడిగా, ఒంటరిగా ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న గొప్ప జీవ వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. అండమాన్ నికోబార్ దీవులలో సుమారు 50 రకాల అటవీ క్షీరదాలు కనిపిస్తాయి. అండమాన్ అడవి పందితో సహా కొన్ని స్థానిక జాతులు ఉన్నాయి. 26 జాతులతో ఎలుకలు అతిపెద్ద సమూహం. తరువాతవి 14 జాతుల గబ్బిలాలు. పెద్ద క్షీరదాలలో స్థానికంగా ఉండే అడవి పంది రకాలు రెండున్నాయి. అవి అండమాన్ దీవుల్లోని సుస్ స్క్రోఫా ఆండమానెన్సిస్, నికోబార్ లోని సుస్ స్క్రోఫా నికోబారికస్. వీటిని వన్యప్రాణి రక్షణ చట్టం 1972 (Sch I) ద్వారా సంరక్షించారు. ఉప్పునీటి మొసలి కూడా సమృద్ధిగా లభిస్తుంది. అండమాన్ రాష్ట్ర జంతువు డుగోంగ్. దీనిని సముద్ర ఆవు అని కూడా పిలుస్తారు. దీనిని లిటిల్ అండమాన్‌లో చూడవచ్చు. 1962 లో ఈ దీవుల్లోకి చిరుతపులిని పరిచయం చేసే ప్రయత్నం జరిగింది. కాని దానికి అనుకూలమైన ఆవాసం కాకపోవడాన ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. అన్యదేశ పరిచయాలు ద్వీప వృక్ష, జంతుజాలానికి వినాశనం కలిగించగలవు కాబట్టి ఈ చర్యలు సరైనవి కావు.
సుమారు 270 జాతుల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి; వాటిలో 14 స్థానికమైనవి – వీటిలో అధిక భాగం నికోబార్ ద్వీప సమూహానికి చెందినవి. ద్వీపాల్లోని అనేక గుహల్లో తినదగిన పక్షి గూళ్ళు కనిపిస్తాయి. ఈ గూళ్ళు చైనాలో ఇష్టంగా తింటారు.
(సశేషం)