సాగర ద్వీపంలో సాహస వీరులు-15

0
2

[box type=’note’fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]”ఈ[/dropcap] గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రపరిసరాలలో కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి. ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్నిపోలిఉంటాయి. ఉత్తరముఖంగా ఉన్నదే మొదటి గుహ. దీనికి ఎదురుగా నంది ఆశీనమై కనిపిస్తుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పుముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోబాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.

భగవంతుని ఏ రూపంలో కొలిచినా, ఏ భాషలో వేడినా ఫలితం ఒక్కటే!

నదులన్ని ఎంత దూరం, ఎంత కాలం ప్రయాణించినా చివరకు కడలి ఒడి చేరవలసిందే! మనషులు అంతే. ఏ మతమైనా ఏ భాష అయిన చివరికి ఈ పుడమి తల్లి ఒడిలో ఒదిగిపోవలసిందే.

ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు చూడదగినవి.

 ఈరోజు మనం ఇక్కడే విశ్రాంతి పొందబోతున్నాం. తిరిగి రేపే మన ప్రయాణం” అన్నాడు విజయుడు.

“పదండి పదండి, ‘కూర్చుండి లేవలేడు గాని, వంగుండి తీర్థం వెళతానన్నాడట’ అన్నడట వెనుకటికి మా శివన్న లాంటి వాడు ఒకడు’ కోతి భుజంపై కుదురుగా కూర్చుంటూ అన్నాడు ఇకఇక.

అందరు ఆ ప్రాంతమంతా తిరిగి చూసి, ఆ రాత్రి అక్కడే విశ్రాంతి కొరకు విడిది చేసారు.

మరుదినం బైరవకోనకు చేరువలోని జలాశయం వద్దకు అందరూ చేరుకున్నారు.

“జగ్గు నువ్వు దక్షణదిశగా, శివన్న నువ్వు ఉత్తరదిశగా, జయంతా నువ్వు పడమరదిశగా వెళ్ళి ఇక్కడ కాళీమాత ఆలయం ఉందేమో వెదకండి. మీకు తోడుగా సాయుధులైన మనవాళ్ళను నలుగురు తీసుకువెళ్ళండి. అందరూ దీపాలు వెలిగించే వేళకు ఇక్కడే కలవాలి. అలాగే రాత్రి ఆహారానికి ఏవైనా పండ్లు కూడా సేకరించండి” అని చెప్పి, మిగిలినవారికి రాత్రి ఇక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేయమని చెప్పి తను నలుగురుతో కలసి దేవాలయం వెదకడానికి తూర్పుదిశగా వెళ్ళాడు విజయుడు.

చీకట్లు కమ్ముకునే వేళకు అందరు తిరిగివచ్చారు. ఎవరికి దేవాలయం కనుపించలేదు.

“ఇక్కడ ఎక్కడో కాళీ ఆలయం ఉంది. రేపు పగలు అందరం కలసి ఈ ప్రాంతం అంతా గాలిద్దాం, ఆలయ జాడ తెలుసుకోలేకపోతే ఇప్పటివరకు మనం పడిన శ్రమంతా వృథా!” అన్నాడు విజయుడు.

“భయపడకండి, మనం, అంటే నేను పడిన శ్రమ ‘అడవికాచిన వెన్నెల’లా వృథా ఎన్నటికి కాదు” అన్నాడు ఇకఇక .

“ఇంద శ్రమపడి చమటలు కారుతున్నావు తుడుచుకో” అని తన తలగుడ్డ ఇచ్చాడు ఇకఇకకు శివన్న.

అక్కడ ఉన్నవారంతా ఘోల్లుమన్నారు.

“ఎట్టెట్టా నా మాటలు మీకు నవ్వులాటగా ఉన్నాయి, ‘నవ్విన నాపచేను పండదా?’ నన్ను అందరు మెచ్చేరోజు వస్తుంది చూడండి” అన్నాడు ఇకఇక.

తమ చుట్టు నెగళ్ళు వేసుకుని అక్కడ కూర్చున్నవారందరికి కొన్ని రేగి, నేరేడు, వెలగ పండ్లతోపాటుగా, పనసతొనలు ఆకుదోనెలో తేనె అందించారు జగ్గు,శివన్నలు.

మిగిలిన పలురకాల పండ్లను నెగళ్ళ మధ్యభాగంలో ఉంచారు.

కొతి బావ చేతిలోని తేనెలో పనసతొన ముంచి తింటున్న చిలుక ‘ఆహా ఏం రుచి, చాలాబాగుంది. నాకెందుకో ద్రాక్ష తినాలి అనిపిస్తుంది. ఐనా ఇక్కడ ద్రాక్ష ఎలా దొరుకుతుంది? ‘అందని ద్రాక్ష పుల్లన’ కదా” అన్నాడు ఇకఇక.

“చిలకన్నా ఆకలి తీరిందా? మరేమైన పండ్లు కావాలా?” అన్నాడు శివన్న.

“శివన్నా, ‘పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేం’, అయినా బ్రతకడం కోసం తినాలిగాని తిండి కోసం బ్రతకలేముగా” అన్నాడు ఇకఇక .

“చిలకన్నా ఏది ఒక మంచికథ చెప్పు వింటూ హాయిగా నిద్రపోతాను” అన్నాడు జగ్గు.

“ఇంకా నయం జోల పాడమన్నావు కాదు, సరే నాకు నిద్రవస్తుంది, రేపు చెపుతాను” అన్నాడు ఇకఇక.

ఇకఇక మాటలకు అందరూ నవ్వుకుని నిద్రకు ఉపక్రమించారు.

కావలి యువకులు నెగళ్ళలో వెలుగులో క్రూరమృగాల దాడినుండి తమవాళ్ళను రక్షించుకోవడానికి గస్తీ తిరగసాగారు చేత ఆయుధాలతో.

కొంత రాత్రి గడచాక “శివన్న నాకు ఏదో దుర్వాసన తూరుపు దిశనుండి గాలివాటుగా వస్తుంది. ఈ వాసన అడవి కుక్కలదే. ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ప్రమాదం ముంచుకొస్తుంది. అవి మంచి ఆకలిమీద ఉంటాయి. ఏ జంతువైన ఆకలిమీద ఉన్నప్పుడు చాలా కోపంగా, కసిగా ప్రమాదకారిగా మారి ఉంటుంది, మనవాళ్ళందరిని నిద్ర లేపు” అన్నది చిలుక.

కొద్దిసేపట్లో భయంకరంగా మొరుగుతూ వచ్చాయి అడవి కుక్కలు.

“ఎవ్వరు కదలకండి. మీ ఆయుధాలు చేతిలోనికి తీసుకుని దాడికి సిధ్ధంగా ఉండండి” అన్నాడు జయంతుడు.

“మిత్రమా మన చుట్టూ నెగళ్ళు మండుతున్నంతసేపు అడవికుక్కలు మనదరికి చేరలేవు. మిత్రులారా మండుతున్న కట్టెలు కొన్ని అడవి కుక్కలపైకి విసరండి. మంటను చూస్తే అవి పారిపోతాయి” అన్నాడు విజయుడు.

అదే తడవుగా అక్కడ ఉన్నవాళ్ళంతా మండుతున్న కట్టెలను అడవికుక్కలపైకి విసిరారు.

మంటలకు భయపడిన కుక్కలు దూరంగా వీళ్ళనే చూస్తూ తిష్టవేసి వేసాయి. తెల్లవారుతూనే అడవిలోనికి వెళ్ళిపోయాయి. మూడురోజులుగా ఆ అడవి లోని పరిసర ప్రాంతాలన్ని గాలించారు విజయుని బృందం. కానీ కాళికాదేవి ఆలయం కనిపించలేదు.

మరుదినం ఉదయం “మిత్రులారా అందరు జట్లుగా విడిపోయి దేవాలయం వెదకండి. భోజన సమయానికి మీకు లభించిన ఫలాలతో మరలా ఇదే ప్రదేశంలో ఆ చెట్టుకింద కలుసుకుందాం, ఎవరికైనా ఏదైనా ఆపద సంభవిస్తే మీ దాపునే ఉండే వారిని పిలవండి” అన్నాడు విజయుడు.

కాలకృత్యాలు తీర్చుకున్నఅనంతరం ఆయుధాలు ధరించి ఆరు జట్లుగా విడిపోయిన అందరు దేవాలయాన్ని వెదుకుతూ, దొరికిన ఫలాలను సేకరించసాగారు.

మధ్యాహ్నం భోజన సమయంలో అందరూ చెట్టుకింద అందరూ చేరారు. సేకరించిన పండ్లు అందరికి పంచసాగారు జగ్గు,శివన్నలు.

అదేసమయంలో రొప్పుకుంటూ వచ్చిన ఇకఇక “చూసా నేను దేవాలయాన్ని చూసా. ‘ఇంటికన్నా గుడి పదిలం’ అని పెద్దలు ఎందుకు అన్నారో తెలియదుగాని ఆ దేవాలయం జలపాతం నీటిధార వెనుక ఉన్న గుహలో ఉంది. అలా తిరిగి వద్దామని వెళ్ళిన నన్ను ఒక డేగ తరిమింది. ప్రాణభయంతో నేను జలపాతం నీటి ధార వెనుక దాగి ఉన్నాను. అప్పుడు చూసాను నీటి ధారవెనుక విశాలమైన అతి పెద్ద గుహ అందులో లోపలి భాగాన కాళీమాత దేవాలయం ఉంది” అన్నాడు ఇకఇక .

వేంటనే తనవారందరితో జలపాతం వెనబాగాన ఉన్న గుహలోనికి వెళ్ళుడు విజయుడు. ప్రవేశద్వారం నుండిలోనికి వెళుతూనే గుహ మద్యభాగంలోని ఆలయాన్ని, గుహలోని పరిసరాలను క్షుణంగా పరిశీలించారు విజయుడు, జయంతుడు పరిశీలించారు. ఎంత వెదికినా ఆ గుహలో నిథి కనిపించలేదు.

“వెనకటికి ఒకడు ‘వెక్కిరించబోయి వెల్లికిలా పడ్డాడంట’. ఇంతలోనే అంత నిరుత్సహపడితే ఎలా? నేనే ఆ రహస్యనిథిని కనుగొంటాను. మిత్రమా విజయా ఈ తూర్పు ముఖద్వారంగా నిర్మించబడిన ఈ గుహాలయంలో పడమర, ఉత్తర, దక్షణ భాగాలలో రాతి గోడలు కట్టి ఉన్నాయి. గమనించావా? రాతి గుహకు గోడలు కట్టవలసిన అవసరం ఏమిటి? ఇక్కడ రాతి గోడలు కట్టడం వెనుక అసలు రహస్యం ఏమిటంటే నిథి రాతిగోడల వెనుక దాయబడి ఉంటుందని నా అంచనా! ఎంత తెలివి తక్కువవాడు కూడా రాతి గుహకు గోడలు కట్టడు. ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పుదొరికిందని ఒకడు సంతోషించాడట’. అలా వుంది నా ఆలోచన” అన్నాడు ఇకఇక .

“ఇకఇక మాటల్లో నిజం లేకపోలేదు, రాతిగుహకు గోడలు కట్టవలసిన అవసరం ఏముంది?” అన్నాడు విజయుడు.

“జగ్గా, శివన్నా పడమర భాగాన ఉన్న రాతి గోడ రాళ్ళు జాగ్రత్తగా తొలిగించండి” అన్నాడు విజయుడు.

అందరు కలసి తమ చేతిలోని ఆయుధాలతో గోడలో పైభాగంలోని కొన్ని రాళ్ళు తొలగించారు. అక్కడ కొండభాగమే కనిపించింది. అందరిలోనూ నిరాశ కమ్ముకుంది.

“పూర్తిగా ఆ గోడ తొలిగించండి” అన్నాడు విజయుడు.

నాలుగు వరసల రాళ్ళు తొలగించిన అనంతరం “ఒహో నిధి దొరికింది” అని ఆనందంతో కేకలు వేయసాగారు వాళ్ళంతా.

“ఇప్పటికి అయినా తెలిసిందా నేనంటే ఏమిటో” అన్నాడు ఇకఇక.

“మిత్రమా ఇకఇక, నీకు ఏం కావాలో కోరుకో” అన్నాడు విజయుడు.

“ప్రభువులు ఇచ్చిన మాట తప్పరు. తమరు సుగంధినినీ, జయంతుడు భువనను చేపట్టాలి. అలాగే నా భార్య బెకబెక ఎక్కడ ఉందో వెదికి తమరే నాకు అప్పగించాలి” అన్నాడు ఇకఇక.

“అలాగే, నీ కోరిక తీరాలి అంటే సుగంధికి నేనంటే ఇష్టం ఉండాలిగా?” అన్నాడు విజయుడు.

“సుగంధి, భువన వాళ్ళు వాళ్ళ తండ్రి దగ్గర మీ గురించి చెప్పడం; వాళ్ళ పెద్దలు అంగీకరించడం అంతా ఎప్పుడో జరిగిపోయింది. తమరు మీ రాజ్యం చేరారు అని తెలియగానే వాళ్ళ పెద్దలు మీ తల్లితండ్రులను కలవడానికి వస్తారు” అన్నాడు ఇకఇక.

“అయితే నువ్వు పెళ్ళిళ్ళ పేరయ్యవన్నమాట” అన్నాడు జయంతుడు.

అందరూ నవ్వుకుంటూ, అలా అన్నిగోడల వెనుక, తేనె తుట్టెల నుండి తీయబడిన మైనం అన్నిపెట్టెలకు పూయబడి ఉండటం వలన ఆ పెట్టెలు అన్ని చెక్కుచెదరక సురక్షితంగా ఉన్నాయి.

యువకులంతా వెళ్ళి, వెదురు గడలను చీల్చి కావడి బద్దలు తయారు చేసుకు వచ్చారు. తమవద్దనున్న తాళ్ళతో ఉచ్చుబిగించి కావడి బద్దలకు రెండు పెట్టెలు రెండు పక్కల ఒకొక్కటి కట్టారు.

ఒకోక్కరు ఉచ్చులో రెండు వైపుల పెట్టెలు పెట్టుకుని జలాశయం దాటివచ్చారు.

“ఏలికా కుడివైపు కొంతదూరం వెళితే ఓఘూ నదీతీరం వస్తుంది. ఆ నది ద్వారా సముద్రంలోనికి ప్రవేశించాకా దాని తీరం చేరగలిగితే, అక్కడనుండి ఏదైనా వర్తక నావలలో ఈ నిధిని మన అంగరాజ్యం చేర్చవచ్చు” అన్నాడు జగ్గా.

నిధి సంపూర్ణంగా చాలా శ్రమపడి ఓఘూనది ఒడ్డుకు చేర్చబడింది.

“యువరాజా ఇప్పటికే మనవాళ్ళంతా పూర్తిగా అలసిపోయారు. ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ప్రయాణం చేద్దాం” అన్నాడు శివన్న.

“వద్దు యువరాజా. ‘ఈనగాచి నక్కల పాలు చెసినట్టు’ ఇంత అపార సంపద మనదగ్గర పెట్టుకుని ప్రమాదకరమైన ఇటువంటి ప్రాతంలో ఉండటం క్షేమంకాదు” అన్నాడు ఇకఇక .

“నిజమే ఎట్టి పరిస్ధితులలోనూ ఇక్కడ మనం ఉండకూడదు. వెంటనే అత్యవసరంగా ఆరు బలమైన తెప్పలు తయారుచేయండి.” అన్నాడు విజయుడు.

ఆహారపదార్ధాలు, మంచినీరు జాగ్రత్త పరుచుకుని, నిధిని ఆరు తెప్పలపై ఆ పెట్టెలు సమంగా తాళ్ళతో బంధించి, ఆ తెప్పలను ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ తాళ్ళు బలంగా కట్టి, రాత్రి ప్రయాణానికి కాగడాలు సిధ్ధం చేసుకున్న అందరూ నదిపై తమ ప్రయాణం కొనసాగించారు.

తెప్పలు కొద్దిదూరం ప్రయాణం చేయగానే, దాదాపు వందమందికి పైగా బందిపోటు దొంగలు వీరిని వెదుకుతూ వచ్చి తెప్పలపై వెళుతున్న విజయుని బృందాన్ని చూస్తూ ఉండిపోయారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here