[box type=’note’ fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]
[dropcap]ఈ [/dropcap]భూభాగంలో సుమారు 225 రకాల సీతాకోకచిలుకలు, చిమ్మటలు ఉన్నాయి. ఈ ద్వీపాలకు స్థానికమైనవి పది జాతులు ఉన్నాయి. మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్‌లో అనేక రకాల సీతాకోకచిలుకలు, చిమ్మటలూ ఉంటాయి.
ఈ ద్వీపాలు విలువైన షెల్ఫిష్‌లకు ప్రసిద్ధి. ముఖ్యంగా టర్బో, ట్రోకస్, మురెక్స్, నాటిలస్ జాతులకు చెందినవి. మొట్టమొదటిగా వాణిజ్య స్థాయిలో చేపలు పట్టడం 1929లో ప్రారంభమైంది. అనేక కుటీర పరిశ్రమలు అలంకార షెల్ వస్తువులను ఉత్పత్తి చేస్తాయ.
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, అండమాన్ నికోబార్ దీవుల జనాభా 3,79,944, ఇందులో 2,02,330 (53.25%) మంది పురుషులు, 1,77,614 (46.75%) మంది స్త్రీలు. లింగ నిష్పత్తి – 1000 మంది పురుషులకు 878 మంది స్త్రీలు. మొత్తం జనాభాలో 10% మాత్రమే నికోబార్ దీవుల్లో నివసిస్తున్నారు.
మూడు జిల్లాల విస్తీర్ణం, జనాభా (2001 2011 జనాభా లెక్కల ప్రకారం):
జిల్లా | విస్తీర్ణం | జనాభా (2001) | జనాభా (2011) | రాజధాని |
నికోబార్ జిల్లా | 1,765 | 42.068 | 36.842 | కార్ నికోబార్ |
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
|
3.536 | 105.613 | 105.597 | మాయాబందర్ |
సౌత్ అండమాన్ జిల్లా
|
2,640 | 208.471 | 238.142 | పోర్ట్ బ్లెయిర్ |
మొత్తం | 7.950 | 356.152 | 380.581 |
అండమాన్ దీవుల్లో సుమారు 400–450 స్వదేశీ అండమానీస్ ఉన్నారు. ప్రత్యేకించి జరావా, సెంటినెలీస్ ద్వీపాల్లో ఉన్నవారు తమ స్వేచ్ఛను కొనసాగిస్తూ, తమను కలవవచ్చే వారి ప్రయత్నాలను తిరస్కరిస్తున్నారు. నికోబార్ దీవులలోని స్థానిక ప్రజలను నికోబారీస్, లేదా నికోబారి అంటారు. వీరు అనేక ద్వీపాలలో నివసిస్తున్నారు. షోంపెన్ ప్రజలు గ్రేట్ నికోబార్ లోని అంతర్గత ప్రాంతానికే పరిమితం. కారెన్ తెగకు చెందిన 2 వేలకు పైగా ప్రజలు ఉత్తర అండమాన్ జిల్లాలోని మాయాబందర్ తహసీల్‌లో నివసిస్తున్నారు. గిరిజన మూలాలు ఉన్నప్పటికీ, కారెన్‌లకు అండమాన్‌లో ఇతర వెనుకబడిన తరగతి (ఒబిసి) హోదా ఉంది.
అండమాన్ నికోబార్ దీవులలో బెంగాలీ ఎక్కువగా మాట్లాడుతారు. అధికారిక భాష హిందీ. కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఇంగ్లీషును అదనపు అధికారిక భాషగా ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, బెంగాలీ కేంద్ర పాలిత జనాభాలో 28,49 శాతం మొదటి భాషగా మాట్లాడతారు. ఆ తరువాత హిందీ (19.29%), తమిళ (15.20%), తెలుగు (13.24%), నికోబారీస్ (7.65%), మలయాళం (7.22%) వస్తాయి.
అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు (69.44%), క్రైస్తవులు జనాభాలో 21.7% మందితో అతిపెద్ద మైనారిటీ. 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ముస్లిములు (8.51%) ఉన్నారు.
1874లో, బ్రిటిష్ వారు అండమాన్ నికోబార్ దీవులను ఒక చీఫ్ కమిషనర్ నేతృత్వంలోని ఒక పరిపాలనా భూభాగంలో దాని న్యాయ నిర్వాహకుడిగా ఉంచారు. 1974 ఆగస్టు 1 న, నికోబార్ ద్వీపాలను డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో కార్ నికోబార్ వద్ద జిల్లా ప్రధాన కార్యాలయాలతో మరొక రెవెన్యూ జిల్లాగా మార్చారు. 1982లో, చీఫ్ కమిషనర్ స్థానంలో పరిపాలనా అధిపతిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి సృష్టించబడింది. తదనంతరం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహా ఇవ్వడానికి కౌన్సిలర్లతో ప్రజల ప్రతినిధులతో “ప్రదేశ్ కౌన్సిల్” ఏర్పాటు చేయబడింది. ద్వీపాలు దాని అండమాన్ నికోబార్ దీవుల (లోక్‌సభ నియోజకవర్గం) నుండి లోక్‌సభకు ఒక ప్రతినిధిని పంపుతాయి.
ఇవి మనకు చేరువలో ఉన్న ద్వీపాల విశేషాలు ఇవి. పదండి కథలోనికి వెళదాం!
***
అంగదేశంలో పలు దక్షణాది రాజ్యాల రాజులు లేక వారి ప్రతినిధులు అత్యవసర సమావేశం అయ్యారు.
“మిత్రులారా ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం. బలమైన శత్రువు మనపై దాడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడని వేగుల ద్వారా తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వాళ్ళకు కావలసింది మన రాజ్యం కాదు, మన సంపద. పంచలోహ విగ్రహంలో రెండు భాగాలు బంగారం ఉంటుంది. దేవి, దేవతా విగ్రహాలకు మనం అలంకరించిన విలువైన నవరత్నాల కొరకు వాటిని శత్రురాజులు తీసుకు వెళుతున్నారు. అవి లభించనప్పుడు కోపంతో మన ఆలయ అపురూప శిల్ప సంపదను ధ్వంసం చేస్తున్నారు.
మన విలువైన సంపద కొరకే వాళ్ళు మనపై దాడి చేస్తున్నారు. అందుకే మన సంపద వాళ్లకు దక్కకుండా ఒక రహస్య దీవిలో భద్రపరిచే ఏర్పాటు చేసాను.
తరతరాలుగా నమ్మకంగా మా రాజవంశానికి సేవలు అందిస్తూ ఉన్నవారిద్వారా మీరంతా తెచ్చిన ఈ అపూర్వ నిధి రేపే రహస్య దీవికి తరలించబడుతుంది. మా రాజ్యానికి దక్షిణంగా సముద్రంలో మనిషి వెళ్ళని వందల దీవులు ఉన్నాయి.
రెండు సమూహాలుగాఉన్న అటువంటి ఒక రహస్య దీవిలో నిధిని అత్యంత గోప్యంగా భద్రపరచి, దానికి సంబంధించిన వివరాలను ఒక చిత్రపటంగా చిత్రికరించి ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా వేరు వేరు ప్రదేశాలలో భద్రపరుస్తారు, ఆ నిధిని తీసుకువెళ్ళిన మావాళ్ళు భార్యా పిల్లలతో ఆ దీవిలో ఉండి పోతారు. శత్రువులు మనపై దాడి చేసినా వాళ్ళకు సాధరణ పరిపాలనకు వినియోగించే చిన్నమొత్తాలే దొరుకుతాయి.
ఇప్పుడు శత్రువుకు మనసంపద అందకుండా చేయాలి అంటే నేను సూచించిన మార్గమే సురక్షితమైనది” అన్నాడు అంగరాజు.
“మహారాజా మీరు చాలా నిజాయితీపరులు, నమ్మకమైనవారు అని మా అందరికి తెలుసు. ఆ నమ్మకంతోటే అపారమైన ఈ నిధిని యాభై రెండు పెట్టెలలో భధ్రపరచి ఇక్కడకు అందరం తీసుకువచ్చాము. పెట్టెల పైభాగాన వారివారి రాజముద్రికలు చిత్రించబడినవి. కొంతకాలం గడిచాక మరలా మనందరి ఉమ్మడి నిధిని తీసుకువచ్చి ఎవరి సోమ్ము వారు తీసుకుందాం. ఎట్టి పరిస్ధితులలోనూ శత్రువుకు మన విలువైన సంపద దక్కకూడదు” అన్నాడు పల్లవ రాజు.
“నిజమే మిత్రమా వేలమంది సైనికులతో తరలివచ్చిన శత్రు రాజుకు, తన సైనికుల భోజన ఖర్చు కూడా లభించకుండా చేయాలి” అన్నాడు కళింగరాజు.
“మీ అధ్వర్యంలో ఈ అపూర్వ నిధి దాయబడటం మా అదృష్టం. మీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాము” అన్నాడు మరో రాజు.
“నాపై ఇంతటి బాధ్యత ఉంచినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మిత్రులారా నావి నాలుగు పెట్టెలు వాటితో కలిపితే యాభై ఆరు పెట్టెల నిధి అవుతుంది.
మీ అందరికి ఒక విన్నపం. శత్రువులు మనపై దాడి చేస్తున్నప్పుడు ఇరుగు పోరుగులవారు దాడికి గురైన రాజ్యానికి సహకరించాలి. నేడు వారిపై దాడిచేసిన శత్రు రాజు రేపు మనపైన తప్పక దాడి చేస్తాడు. మనలో ఉన్న ఐక్యతే మనల్ని రక్షిస్తుంది. కొంతకాలంపాటు విలువైన దేవి, దేవతా విగ్రహాలను అత్యంత రహస్య ప్రదేశాలలో భద్రపరచండి. ఇటు ధనం, అటు విలువైన విగ్రహాలు లభించక ప్రతి రాజ్య దాడిలోనూ నిరాశతో శత్రురాజు వెనుతిరగాలి.
మరోమారు మీ అందరికి ధన్యవాదాలు మా అతిథులుగా వచ్చిన మీకు సమస్త సౌకర్యాలు చేయించాను. పదండి, విందు సిధ్ధంగా ఉంది. అనంతరం వినోద కాలక్షేపం, నృత్య ప్రదర్శన వంటివి ఉంటాయి” అన్నాడు అంగమహారాజు.
***
మరుదినం పెద్దనావలో వ్యాపారుల వేషంలో పురుషులు బయలుదేరారు. స్త్రీలు, పిల్లలు నావ లోపల రాత్రి సమయంలో నావలో ఎక్కించి వారిని రహస్యంగా భద్రంగా ఉంచారు. నావలో నిధి పెట్టెలపై నిత్యావసర వస్తువుల మూటలు వేసుకునివారు బయలుదేరారు.
తొమ్మిది రోజులు రేయింబవళ్ళ ప్రయాణానంతరం, పదవరోజు సంభవించిన గాలివానలో తెరచాప చిరిగి, చుక్కని విరిగి గాలివాటున ప్రయాణం సాగిన నావ బాగా దెబ్బతిని దారి తెలియని ప్రాంతానికి కొట్టుకువెళ్ళి ఒక దీవికి తీరం చేరింది. ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.
అందులోని వారంతా వేగంగా దీవి లోనికి ప్రయాణం చేసి, రెండురోజుల అనంతరం నిధిని రహస్యప్రదేశంలో భద్రపరచి, దాని రహస్యమార్గ చిత్రపటంలో చిత్రీకరించి దాన్ని రెండుభాగాలు చేసుకుని వారిలో కొందరు మరో సమూహంగా విడిపోయి చిత్రపటంలోని ఓ భాగంతో దూరంగా వెళ్ళి తమ రాజభక్తిని చాటుతూ భిల్లులుగా పేరుపెట్టుకుని జీవించసాగారు.
అనంతరం భిల్లుజాతి వారుకాని, వారినుండి విడిపోయిన రాజముద్రిక కోయల వారు తాము ఎక్కడ ఉన్నది తెలుసుకునేందుకు పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికి అనంత సాగరం వారి ప్రయత్నాలను అడ్డుకుంది. ఏ వ్యాపారి నావలైన ఈ దీవి దిశగా రాకపోతాయా అని ఎదురుచూసిన వారి కోరిక నెరవేరలేదు ఎంతకాలమైనా ఆ దిశగా ఒక్క నావ కూడా రాలేదు.
***
శత్రు రాజు రిక్త హస్తాలతో తిరిగి వెళ్ళిపోయాడు. రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నా రహస్యనిధి సంబంధిత వివరం కొరకు రాజులంతా ఎదురు చూడసాగారు.
మరికొందరు రాజులు సాహసవంతులైన నావికులను సముద్రం పైకి నిధి కొరకు అన్వేషణ కూడా చేయించారు. మరికొందరు తామే స్వయంగా అంగరాజ్యానికి దక్షణంగా ఉన్న వందలాది దీవులను గాలించసాగారు.
ఎందరు ఎన్నివిధాల ప్రయత్నించిన ఫలితం లేకపోయింది.
అనంతరం నావ గాలివానలో మునిగిపోయిందనుకుని ఆ నిధి పైన అందరూ ఆశలు వదులు కున్నారు.
అలా మూడువందల సంవత్సరాలకు పైగా కాలం గడచింది. నిధి రహస్యం శాశ్వతంగా సమాధి అయింది.
***
అంగ రాజ్యానికి అరవై కోసుల దూరంలో లోని అరణ్యంలో సదానందస్వామి గురుకులం ఉంది. అందులో అంగ, వంగ, కళింగ, అవంతి, మగధ, మిధిల, కోసల, కాంభోజ, విదర్బ, మత్స్య, గాంధార వంటి పలు దేశాల విద్యార్ధులు ఆశ్రమంలో ఉన్నత విద్యాభ్యాసానికి వచ్చి చేరుతుంటారు. ఆ రోజు గురుకులంలో చేరుతున్న యువకులతోపాటు తన ఆశ్రమంలోని శిష్యులు అందరిని సమావేశపరచి కొత్తగా ఆ రోజు చేరిన వారిని ఉద్యేసించి సదానందస్వామి.
“నాయనలారా అభ్యాస వేళ అది విద్య, ప్రదర్శన వేళ అది కళ అవుతుంది. గురువు త్రిమూర్తి స్వరూపుడని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంయుక్త రూపమే గురువని గ్రహించండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది శ్రుతి వాక్యం. మన పూర్వీకులు గురువు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు అనే పదాలను విడి విడిగా చెప్పారు.
గర్భదానాది కర్మలు చేయించి, అన్నము పెట్టి విద్యార్ధులను పోషించేవారు ‘గురువు’, వేదాంగాలను,వ్యాకరణాదులను శిష్యులచేత అధ్యాయనం చేయించేవారిని ‘ఉపాధ్యాయుడు’ అంటారు.
తన శిష్యులకు ఉపనయనం చేసి వేదములను, కల్పసూత్రము లను, ఉపనిషదములతోనూ అధ్యాయనం చేయించేవారిని ‘ఆచార్యుడు’ అంటారు.
విద్యకోసం ఆర్తి, జిజ్ఞాస, సంసిధ్ధత, వినయం, శరణాగతి, పరస్పర ప్రీతిసాధన చతుష్టయ సంపద ఉన్నవాడే ఉత్తమ శిష్యుడు అవుతాడు. వివేకం, వైరాగ్యం, శమ, క్షమాది సంపత్తులనే సాధన చతుష్టయం అంటారు.
ప్రియ శిష్యులార నేడు చాలా సుదినం. నేటితో మీ సహచర విద్యార్ధులైన అంగ రాజు చంద్రసేన మహారాజుగారి కుమారుడు విజయుడు, మహామంత్రి సుబుధ్ధి వారి కుమారుడు జయంతుల విద్యాభ్యాసం ముగిసింది. విద్యాతో పాటు లోకజ్ఞానం తెలియాలి కనుక వారు ఇరువురు తమ పెద్దల అనుమతితో పలుదేశాల పర్యటనకు ఈరోజే బయలు దేరుతున్నారు” అనగానే అక్కడి విద్యార్థులు అంతా కరతాళ ధ్వనులు చేసారు.
“మనిషి పుట్టుక చాలా గొప్పది. మనం గొప్ప అనుభూతులతో, మంచి అనుభవాలు నింపుకుంటూ, దుఖఃము లేని, ఆనందమయమైన జీవితం అనుభవిస్తూ మన ఆనందాన్ని సుఖాన్ని ఎదటివారికి పంచుతూ జీవించాలి.
చతుర్విధ వర్ణాశ్రమా ధర్మలైన బ్రహ్మచర్యం,గార్హస్ధ్యం, వానప్రస్ధం,సన్యాసం అనేవి ఆశ్రమ ధర్మాలు.
బ్రహ్మచర్యం:
బ్రహ్మచర్యాన్ని ‘సావిత్రం’ అంటారు. ఎందుకంటే గాయత్రీ మంత్రోపదేశాన్ని పొంది దాన్ని జపిస్తారు కాబట్టి. ఉపనయనం అయిన తరువాత బ్రహ్మచారి మొదటి మూడు రోజులు గాయత్రీ మంత్రాన్ని జపించడాన్ని ‘ప్రజాపత్యం’ అంటారు.
తరువాత వేదంలో చెప్పబడిన వాటిని ఆచరించడాన్ని ‘బ్రహ్మమని ‘వేదాన్ని సంపూర్ణంగా అధ్యాయనంచేసి అనుష్టానం చేయడాన్ని ‘నైష్ఠికమని’అంటారు.
గృహస్ధాశ్రమం:
గృహస్థులు నాలుగు రకాలుగావిభజింపబడ్డారు. పొలం పండించుకు తినేవారిని ‘వార్త’ అంటారు. యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకోవడాన్ని ‘సంచయం’ అంటారు. గృహస్థుడు ఇతరులను యాచించకుండా జీవించడాన్ని ‘శాలీనం’ అంటారు. పొలంలో రాలిన గింజలు ఏరుకు తిని జీవించేవారిని ‘శిలోంఛం’ అంటారు.
వానప్రస్థం:
కందమూలాలు తిని జీవించేవారిని ‘వైఖానసులు’ అంటారు. కొత్తపంట చేతికి అందగానే ఇంట ఉన్న పాత ధాన్యాన్ని దానంచేసే వారిని ‘వాఖల్యులు’ అంటారు.
రోజుకు ఒక దిక్కున యాచన చేసి జీవించేవారిని ‘ఔదుంబరులు’ అని, పండ్లను, ఆకులను భుజించి జీవనం చేసేవారిని ‘ఫేనవులు’ అంటారు.
సన్యాసులు:
సొంత కుటీరంలో తగు కర్మలు ఆచరించేవారిని ‘కుటీచకులు’ అని, కుటీరం లేకుండా కర్మలు నిర్వహించకుండా సంచరించేవారిని ‘బహుదకులు’ అని, కేవలంజ్ఞానం మాత్రమే కలిగి సంచరించేవారిని ‘హంసల’ని, జ్ఞానం కూడా పొందకుండా, పరబ్రహ్మ తత్వంలో లీనమయ్యే వారిని ‘పరమహంసలు’ అని అంటారు.
రాజకుటుంబిక విద్యార్థులకు పరిపాలనా విభాగంలోనూ, యుద్ధరంగంలోను ఉండేవారికి ముఖ్యవిషయాలు కొన్ని విషయాలు చెపుతాను తెలుసుకొండి..
షడ్గుణాలుగా చెప్పబడేవి ఆరు, అవి – 1) సంధి 2) విగ్రహం 3) యానం 4) ఆసనం 5) ద్వెైదీభావం, 6) సమాశ్రయం.
శత్రువుకు ఉన్నబలం తనకు లేనప్పుడు శత్రువుతో సఖ్యం చేయడాన్ని ‘సంధి’ అంటారు.
శత్రువు కన్నా తనకు ఎక్కువ బలం ఉన్నప్పుడు యుధ్ధం ప్రకటించడాన్ని ‘విగ్రహం’ అంటారు.
బలం అత్యధికంగా ఉన్నప్పుడు దాడి చేయడాన్ని ‘యానం’ అంటారు.
సమాన బలం కలిగి యుధ్ధం చేయడానికి నిరీక్షించడాన్ని ‘ఆసనం’ అంటారు.
ఇతర రాజుల సహయం పొందడాన్ని ‘ద్వెైదీభావం’ అంటారు.
బలం కోల్పోయినపుడు శత్రు జనాన్ని పీడించడాన్ని ‘సంశ్రయం’ అంటారు.
మన ప్రాచీన భారతంలో సైన్యన్ని ‘షడంగదళం’గా విభజించినట్లు పురాణాలు, కౌటిల్యుని అర్ధశాస్త్రం, కామాందకీయం, మానసోల్లాసం వలన తెలుస్తుంది. ఈ షడంగ దళాల గురించి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో వివరించాడు.”
(సశేషం)