సాగర ద్వీపంలో సాహస వీరులు-5

0
3

[box type=’note’ fontsize=’16’] ‘సాగర ద్వీపంలో సాహస వీరులు’ అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]వే[/dropcap]దాల చివరి బాగాలు గ్రంథ ప్రతిపాద్యమగు విద్య అని శ్రుతి వచనం. బ్రహ్మవిద్య అని కూడా ఉపనిషత్తులకు మరో పేరు. ఇది ద్వివిధం. పరావిద్య. అపరా విద్య.

1.ఉపనిషత్తులు వేద సారమనీ, వేద రహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాని అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారనీ అంటారు. అవి: 1. ఈశోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోప నిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు.

శైవ, వైష్ణవ వర్గాల వారు తమవిగా భావించే ఉపనిషత్‌ వర్గీకరణ ఒకటి ఉంది.

శైవులు తమవని భావించే ఉపనిషత్తులు పదిహేను ఉన్నాయి: అక్షమాలికోపనిషతత్తు, 1,అథర్వ 2, శిరోపనిషత్తు,3, అథర్వ శిఖోపనిషత్తు, 4, కాలాగ్ని రుద్రోపనిషత్తు, 5. కైవల్యోపనిషత్తు, 6. గణపతి ఉపనిషత్తు, 7. జాబాలోపనిషత్తు, 8. దక్షిణామూర్తి ఉపనిషత్తు, 9. పంచబ్రహ్మోపనిషత్తు, 10. బృహజ్జాబాలోపనిషత్తు 11. భస్మజా బాలోపనిషత్తు, 12. రుద్రహృదయో పనిషత్తు, 13. రుద్రాక్ష జాబాలోపనిషత్తు, 14. శరభోప నిషత్తు, 15. శ్వేతాశ్వతరో పనిషత్తు.

వైష్ణవులు తమవిగా చెప్పే పదునాలుగు ఉపనిషత్తులు: 1. అవ్యక్తోపనిషత్తు, 2. కలిసంతరణోపనిషత్తు, 3. కృష్ణోపనిషత్తు, 4. గారుడోపనిషత్తు, 5. గోపాలతాప సోపనిషత్తు, 6. తారసోపనిషత్తు, 7. త్రిపాద్వి భూతి ఉపనిషత్తు, 8. దత్తాత్రేయో పనిషత్తు, 9. నారాయణోపనిషత్తు, 10. నృసింహ తాపసీయోపనిషత్తు, 11. రామ తాపస ఉపనిషత్తు, 12. రామరహస్యో పనిషత్తు, 13. వాసుదేవ ఉపనిషత్తు, 14. హయగ్రీవ ఉపనిషత్తు.

సన్యాసానికి సంబంధించిన లక్షణాలను, విధి విధానాలను తెలియజేసే 17 ఉపనిషత్తులను సన్యాసోపనిషత్తులని వర్గీకరించారు. అవి: 1. అరుణికోపనిషత్తు, 2. అవధూతోపనిషత్తు, 3. కఠశ్రుత్యుపనిషత్తు, 4. కుండినోపనిషత్తు, 5. జాబాలోపనిషత్తు, 6. తురీయాతీత అవధూతోపనిషత్తు, 7. నారద పరివ్రాజకోపనిషత్తు, 8. నిర్వాణోపనిషత్తు, 9. పరబ్రహ్మోపనిషత్తు, 10. పరమహంస పరివ్రాజకోపనిషత్తు, 11. పరమహంసో పనిషత్తు, 12. బ్రహ్మోపనిషత్తు, 13. భిక్షుక ఉపనిషత్తు, 14. మైత్రేయ ఉపనిషత్తు, 15. యాజ్ఞవల్క్య ఉపనిషత్తు, 16. శాట్యాయన ఉపనిషత్తు, 17. సన్యాసో పనిషత్తు.

ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్నకు అందరినీ సంతృప్తిపరచే సమాధానం లేదు. శంకరుడు వ్యాఖ్యానించిన ఈశకేనాది పది ఉపనిషత్తులే బహుళ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తరచు మరికొన్ని ఉపనిషత్తుల ప్రస్తావన విన వస్తుంటుంది. ముక్తికోపనిషత్తు 108 ఉపనిషత్తులను ప్రస్తావిస్తున్నది. ఒక్కొక విశ్వాసం వారు ఒక్కొక్క విధంగా ఉపనిషత్తులను తమకు అనుకూలంగా ఉదహరిస్తున్నారు. ప్రామాణికంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు జాబాలి పేరు అనేక విధాలుగా ఉపనిషత్తుల పట్టికలో దర్శనమిస్తుంది. ఏమైనప్పటికీ, వైదిక వాఙ్మయంలో ఉపనిషత్తుల స్థానం విశిష్టమైనది. ఉపనిషత్తు అనే పదానికి సమీపానికి తీసుకునిపోవడం అనే అర్థం ఉన్నదనీ, మనిషి తన పరిమితమైన చైతన్యాన్ని, ప్రజ్ఞను బ్రహ్మ చైతన్యంతో, ప్రజ్ఞతో అనుసంధానం చేసి పరిమితత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందడానికి ఉపయోగపడే మోక్షవిద్య ఉపనిషత్తులలో ఉన్నది అంటారు. ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది

  1. ఋగ్వేదానికి సంబంధించినవి – 10
  2. కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి – 32
  3. శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి – 19
  4. సామవేదానికి సంబంధించినవి – 16
  5. అధర్వణ వేదానికి సంబంధించినవి – 31 (మొత్తం – 108)
  6. మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు.

వీటిని మానవ ధర్మశాస్ర్రాలు అంటారు.

పంచమహాయజ్ఞాలు అంటే,’ దేవయజ్ఞం ‘ – ‘ పితృయజ్ఞం ‘ – ‘ మనుష్యయజ్ఞం ‘- ‘ బ్రహ్మయజ్ఞం ‘ – ‘ భూతయజ్ఞం ‘ వీటిలో దేవయజ్ఞంలో సూర్య, అగ్నిఅర్చిస్తారు. పిత్రుయజ్ఞంలో శ్రాధ్ధ తర్పణాలిస్తారు.

మనుష్యయజ్ఞంలో, అన్నదాన వివరం. బ్రహ్మదేవ యజ్ఞంలో, వేదాధ్యాయనం. భూత యజ్ఞంలో, బలి రూపంలో ఉంటాయి.

ఇవికాక మరో ఇరవై నాలుగు యజ్ఞాలు ఉన్నాయి.ఇవన్ని లోకకల్యాణానికే రాశిలా ఉన్నవేదాలను వ్యాసమహర్షి విభజించారు.

యాగాలు లోక కల్యాణం కొరకు జరిపిస్తారన్నది మనందరకు తెలిసిందే! పూర్వం ఎందరో రాజులు పలు రకాల యాగాలు ప్రజల సంక్షేమం కోరి నిర్వహించేవారు. యాగ హవిస్సును స్వీకరించిన దేవతలు యాగ నిర్వాహకుడిని ఆశీర్వదించేవారు ఫలితంగా ఆరాజ్యం సుభిక్షంగా పాడి పంటలతో కళకళలాడుతూ ఉండేది.

‘అశ్వమేధయాగం’ నిర్వహించినవారు, శార్వాతుడు, అంబష్ఠుడు, యుధ్ధాంశేష్ఠి, విశ్వకర్మ, సుధాంసుడు, అంగుడు, దుర్ముఖుడు, అరాతి, పుష్యమిత్రుడు, చాళుక్య వంశీయుడు వాతాపి, ఎలకేసి. వేణుడు, శశిబిందుడు, సగరుడు, పృథుడు, జనమజేయుడు, బలి, పురూరవుడు, భగీరధుడు, దిలీపుడు, యయాతి, నభాగుడు, రంతిదేముడు, శ్రీరాముడు, భరతుడు, ధర్మరాజు వంటి పలువురు నిర్వహించారు.

ఇంద్రుడు కాశీలో గంగానది తీరాన పది అశ్వమేధ యాగాలు చేయడంవలన అక్కడ ‘దశాశ్వమేధఘాట్ ‘ ఏర్పడింది. నేటికి అక్కడ సంధ్యాసమయంలో గంగానదికి హారతి ప్రతి దినం ఇస్తారు.

‘రాజసూయ యాగం’ మాంధాతృడు, సుహాత్రుడు, సుష్మద్మని పుత్రుడు విశ్వంతరుడు, పరిక్షితుని పుత్రుడు జనమజేయుడు, సహాదేవుని పుత్రుడు సోమకుడు, దేవవృధుని పుత్రుడు బభృవు, విదర్బ దేశాధిపతి ధోమకుడు, గాంధారి దేశాధిపతి, నగ్నజిత్తు, కిందమ ముని పుత్రుడు సనశ్రుతుడు, జానకుని పుత్రుడు క్రతువిదుడు, విజవసుని పుత్రుడు సుదాముడు, హరిశ్చంద్రుడు, ధర్మరాజు వంటి పలువురు నిర్వహించారు.

యయాతి, భగీరధుడు, ‘వాజపేయయాగం’ నిర్వహించారు. ‘మరుత్తు’ వాజపేయ యాగంతోపాటు, అసంఖ్యాకంగా పలురకాల యాగాలు నిర్వహించారు.

దిలీపు చక్రవర్తి కుమారుడు రఘువు ‘విశ్వసృద్ యాగం’, ‘విశ్వజిత్తు’ అనే యాగాలు చేసాడు.

‘దుర్యోధనుడు’ వైష్ణవ యాగాన్ని జరిపించాడు.

‘దశరధుడు’, ‘జనక మహారాజు ‘ సంతానం కోరి ‘పుత్రకామేష్టి యాగం’ చేయగా,

తన తండ్రి మరణానికి కారకులైన నాగులను అంతమొందించడానికి ‘సర్పయాగం’ చేసాడు జనమజేయుడు.

ఇలా పలు యాగాలు లోక కల్యాణార్దం అని తమ అధికారాన్ని సుస్ధిరం చేసుకోవడానికి, భూలోకంలో ఖ్యాతి పొంది, స్వర్గలోకంలో స్దానం పొందడానికి ఇటువంటి అనేక యాగాలు ఆర్థికబలం, అంగబలం కలిగిన శక్తివంతమైన చక్రవర్తులు, రాజులు, సామంతులు సమర్థవంతంగా నిర్వహించారు” అన్నాడు విజయుడు.

విజయుని మాటలు వింటూనే యథారూపాన నిలబడిన ముని.

“చిరంజీవులారా నాకు శాప విమోచన కావించారు. విజయోస్తు. ఈ దారిన ఆమడ దూరం వెళితే మీరు చేరుకోవలసిన ఆశ్రమం వస్తుంది సుఖీభవ.” అని ఆశీర్వదించి ముని వెళ్ళిపోయాడు.

ముని చూపించిన దారినే ప్రయాణంచేస్తున్న మిత్రులు ఇరువురు అరణ్యమార్గంలో ప్రయాణం చేస్తుండగా కారుమబ్బులు కమ్ముకు రాసాగాయి.

“జయంతా వర్షం వచ్చేలా ఉంది. ఈరోజు రాత్రికి కనిపించే కొండ గుహలో ఉందాం, గుహలోనికి జంతువులు రాకుండా నెగళ్ళు వేద్దాం, ఎండు పుల్లలు వేగంగా సేకరిధ్ధాం” అని గుహకు చేరి ఎండు కట్టెలు పుల్లలు సేకరించసాగారు మిత్రులు.

కొద్దిసేపటికి జోరున వర్షం కురవడం ప్రారంభించింది.

సేకరించిన ఎండు పుల్లలతో జయంతుడు గుహలోపల ముందుభాగాన నిప్పు రాజేశాడు. మండుతున్న ఆ నెగడు మంటల్లోనుండి చెరో మండుతున్న కట్టె చేతపట్టి గుహ లోపలి భాగం అంతా పరిశీలించసాగారు.

గాలితో కూడిన వాన జోరున కురవసాగింది.

మండుతున్న కట్టెలను చేతపట్టి గుహ అంతా పరిశీలిస్తున్న మిత్రులు ఇరువురు అక్కడ ఉన్న పలు శిలా శాసనాల వద్దకు చేరి మొదటి శాసనాన్ని చదవసాగారు.

గురువు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు అనే మూడుపదాలు మానవజీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దే మహత్తర నామాలు. మన సనాతన సంస్కృతీ సంప్రదాయాలలో ధర్మం మానవుని మాధవునిగా తీర్చిదిద్దగలిగి త్రికరణ శుధ్ధిని, అరిషడ్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను నియత్రించే శక్తిని ప్రసాదిస్తుంది.

ధర్మార్ధ కామ మోక్షాలను సాధించే విధానాన్ని సుస్పష్టంగా తెలిపి మానవులను కార్యోన్ముఖులను చేస్తుంది. అటువంటి సాధనా కార్యక్రమాలు బ్రహ్మచర్య, గార్హపత్య, వానప్రస్థ, సన్యాసాశ్రమ ధర్మాలను సాధించడంద్వారా ఐహిక, అముష్మికములను పొందగలడని ధర్మం సన్మార్గాన్ని చూపిస్తుంది.

బ్రహ్మచర్య ఆశ్రమధర్మం విద్యాభ్యాస ధర్మంగా నిర్ణయింపబడి అద్బుతమైన గురుశిష్య సంభంధానికి అత్యంత ప్రాముఖ్యతనీయడమైనది. గురుకులాన్ని పవిత్ర సరస్వతీ నిలయంగా భావించి గురుకులంలో విద్యార్థులు అమితమైన శ్రధ్ధాసక్తులతో, భక్తి ప్రపర్తులతో, కఠోరదీక్షతో గురు శుశ్రూష చేసి విద్యలనార్జించేవారు. వానిలో ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక, అస్త్ర, శస్త్ర మంత్రాది అనేక విద్యలున్నాయి. వాటన్నింటినీ అభ్యసించి సంపూర్ణ జ్ఞానులైన గురు దీవెనలు పొంది గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించిన తరువాత సమాజ సేవకై కర్తవ్యోన్ముఖులయ్యేవారు.

‘యాస్మాధ్ధర్మాన్ అచినోతి స ఆచార్యః’

సన్మార్గ, ఉపదేశిక ధర్మములను ఆచరిచు వారే ఆచార్యులని ఆపస్తంభ సూత్ర మంటుంది. పరంపరాగతమైన ఆచార్యులు పరగుణములను ద్వేషించనివారై అహంకారము లేనివారై ఉంటారు. వారి ఇంట సంచయనం చేయబడిన ధాన్యం కనిపించదు. విషయ లోలత్వం లేనివారై ఉంటారు. దంభ, దర్ప, లోభ, మోహ, క్రోధములు విడిచి పెట్టిన వారై ఉంటారని బౌధాయన ధర్మ సూత్రం చెబుతుంది.

‘శిష్టాః ఖలు విగతమత్సరాః నిరహంకారాః కుంభీధాన్యా

అలోలోపా దంభ,దర్ప లోభ మోహ క్రోధ వివర్జితా’

గురువు త్రిమూర్తి స్వరూపుడని, బ్రహ్మ విష్ణు మహేశ్వరల సంయుక్త రూపమే గురువని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవో భవ అనే శృతి వాక్యమెరుగని వారుండరు.

ప్రతి వ్యక్తికి తొలిగురువు తల్లి!… మలిగురువు తండ్రి!!.. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానాన్ని కలిగించేవాడు ఆచార్యుడు!!!. అతడు భగవత్ స్వరూపుడైన విజ్ఞానదాత. ప్రతి వ్యక్తికి ఈ జన్మలోనే విజ్ఞానవంతునిగా, మనిషిని మనిషిగా మార్చే మహత్తరమైన మరో జన్మను యిచ్చే మహనీయమూర్తి కనుక ఆయన ఇలలో నడయాడే మూడవ దేవుడు అవుతాడు. భక్తి శ్రధ్ధలతో సంపూర్ణ విశ్వాసంతో, కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాలలో శిష్యులు గురుకులంలో ఇలా స్మరించేవారు.

‘త్వమేవ మాతాచ పితాత్వమే… త్వమేవ సర్వం.. మమ దేవ దేవ…’

నూర్గురు ఉపాద్యాయులకంటే ఒక ఆచార్యుడు, నూరుగురు ఆచార్యులకంటే తండ్రి ఎక్కువ గౌరవము కలవాడని తండ్రి ప్రాశస్ధితిని ఆచార్యుని ప్రాముఖ్యతను మనుస్మృతి తులనాత్మక అధ్యాయనం చేయిస్తుంది. వేదాంగ పారంగతుడైన ఆచార్యుడు బ్రహ్మప్రాప్తి హేతుభూతమైన విజ్ఞానము ఇచ్చెవాడు. కావున ఆయన బోధించిన విజ్ఞానయుతమైన జన్మము శాశ్వితమమై ముదిమి, చావులేక అద్వతీయ, అమేయ, అలౌకిక అమోఘమైన జన్మముగా భావించబడుతుంది.

‘గురురావ హనీయస్తు సాగ్ని త్రేతా గరీయసి’

స్ధూలంగా గురువులు రెండు రకాలని, ప్రవచన మార్గం అవలంభించేవారు మెదటి తరగతికి చెందినవారైతే….రెండవ తరగతికి చెందిన వారు ఉపాస గురువులు.

వివిధ శాస్త్రాలను మధించి ఆయావిషయాలతో జ్ఞానబోధ చేసేవారు ప్రవచన గురువులు. వీరు మనసుల్లో మరుగు పడిపోయిన ఆత్మ చైతన్యాన్ని తమ ప్రవచనాలతో, ప్రభోధాలను ఉత్తేజితం చేసి జ్ఞానమార్గాన్ని సాధించమని శిష్యులను ప్రోత్సహించే మార్గదర్శకులు.

‘సుఖార్థినఃకుతో విద్యకుతో విద్యార్థినః సుఖం’

కనుక గురువు త్రైమూర్తిక దేవతా స్వరూపంలో ఉంటూ, సర్వ వ్యాపకము, అనంత చైతన్యానికి బహిఃరూపంగా ఉండే పరబ్రహ్మకు ప్రతిరూపంగా భాసించే జ్ఞానప్రదాత! వేయిమంది చంద్రులు, నూర్గురు సూర్యులు ఒక్కపెట్టున ప్రకాశించినా మనిషి లోని అజ్ఞానం తొలగిపోదు. మనషి జ్ఞానవంతుడు కావాలంటే దైవస్వరుపుడైన గురువును ఆశ్రయించి జ్ఞానవంతుడు కావలసిందే!.

అని ఆ గుహలోని శిలాఫలకాలపై ఉంది.

ఆ రాత్రి అక్కడే విశ్రమించిన మిత్రులు తెల్లవాతూనే తమ ప్రయాణం కొనసాగించి, రితధ్వని మహర్షి ఆశ్రమం చేరి మహర్షివారిని దర్శించి…

“స్వామి మేము సదానంద స్వామి వారి శిష్యులం, అంగదేశ నివాసులం. మా గురు దేవులు తమ ఆశీర్వాదం పొంది దేశాటన ప్రారంభించమన్నారు” అని రితధ్వని మునికి పాదాభివందనం చేసారు.

”మనో వాంఛాఃఫల సిధ్ధిరస్తు. రెండు రోజులు మా ఆశ్రమంలో గడిపి వెళ్ళండి. ఈ రోజు మా విద్యార్ధులతో మీరు కూడా పాఠం వినడానికి రండి” అన్నాడు.

“ఆజ్ఞ గురుదేవా” అన్నారు మిత్రులు ఇరువురు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here