సహాయం

0
2

[dropcap]రా[/dropcap]మాపూర్ అనే ఊరిలో రవి, అభి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరి ఇళ్ళు పక్క పక్కనే ఉండేవి. వీరు చదువుకునే పాఠశాల కూడా వీరి ఇళ్ళకు దగ్గరలోనే ఉంది.

ఒక రోజు రవి, అభి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుంటే రోడ్డు మీద అందరూ గుమిగూడారు. యేమి జరిగిందోనని ఇద్దరు స్నేహితులు చూద్దామని వెళ్ళారు. యెవరో ఒక పెద్దాయనను అటో డీ కొట్టడo వలన, తలకు బాగా దెబ్బ తగిలి, రక్తస్రావo అవుతుంది.

అందరూ చోద్యం చూస్తున్నారు తప్ప, యెవరు హాస్పిటల్‌కు తీసుకెళ్లడo లేదు. వెంటనే రవి, అభిలు ముందు వెనక ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళి అటోను తీసుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు.

అక్కడికి వెళ్ళిన తరువాత రవి, అభిలు యేడుస్తు “డాక్టర్ అంకుల్” అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళి, పెద్దాయనకు చికిత్స చేయమని ఆయన పాదాలపై పడ్డారు.

డాక్టర్ గారు చలించి పోయి వెంటనే రవి, అభిలతో “మీరేo బాధ పడకండి. నేను వెంటనే చికిత్స చేస్తాను” అని పెద్దాయన దగ్గరకు వెళ్ళి రక్తస్రావమౌతున్న తలకు కట్టు కట్టి ఇంజక్షన్ చేసాడు.

“ఇప్పుడు యేం ఫర్వాలేదు, కొద్ది సేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత మామూలౌతుంది” అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు.

ఒక గంట తరువాత మెలుకువ వచ్చిన పెద్దాయన రవి, అభిలను పిలిచి రెండు చేతులెత్తి దండం పెడుతుంటే, “అయ్యో మీరు పెద్దవారు అలా దండం పెట్టవద్దు” అన్నారు.

“మీ ఇల్లు యెక్కడ, మీ వారు యెవరో చెప్పండి” అని అడిగి వివరాలు తెలుసుకొని పెద్దాయన కుటుంబ సభ్యులను రప్పించి, వారికి అప్పగించే సరికి మధ్యాహ్నం అయింది.

రవి అభిలు ఆలస్యంగా పాఠశాలకు వెళ్ళారు. ప్రిన్సిపాల్ మేడమ్ ఆలస్యం యెందుకయిoది కారణం అడిగితే జరిగిన విషయం చెప్పారు. అందుకే ఆలస్యం అయిందని చెప్పారు ఇద్దరు. అప్పుడు ప్రిన్సిపాల్ మేడమ్ ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నoదుకు, సహయం చేసినందుకు అభినందనలు తెలియచేసి, ప్రతి ఒక్కరు కూడ మానవత్వం కలిగి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని మిగతా విద్యార్థులను కోరింది.

నీతి : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి.

రచన : యాడవరం సహస్ర -4వ తరగతి,

ఆరెంజ్ గ్రామర్ స్కూల్, సిద్దిపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here