[‘సైనికుడి ప్రార్థన’ అనే అనువాద కవితని అందిస్తున్నాము. మూలం Joyce Zasler.]
[dropcap]కా[/dropcap]ళ్ళ క్రింద మెత్తటి భూమి
తలపై ఎడారి వేడి సూర్యుడు
ఎంతో కాలం ఉండని ప్రశాంత నిశ్శబ్దం
ఉండి ఉండి పేలే తుపాకులు, పగిలే బాంబులు
అప్రమత్తంగా నేను, తుపాకీతో సిద్ధంగా, స్థిరంగా..
విజయానికి చెల్లించాల్సిన పరిహార వేదన నాలో
మరణం, యుద్ధం అంటే భయం లేకున్నా
అన్నిటికీ స్థిరమైన తెగింపు ఇరవై నాలుగేళ్ళకే
బాధలు, భయాలను అణచిపెట్టి, ప్రతి రోజూ కొత్త శక్తితో
శతాబ్దల తరబడి సాగుతున్నదిది, శతాబ్దాల ఆశ ఇది
ఈ చారిత్రక భూమిలో భాగమైన
ప్రతి సైనికుడి హృదయంలో ఒక నిశ్శబ్ద ప్రార్థన
ఈ భూమి అంతా ప్రతిధ్వనిస్తుంది.
~
మూలం: Joyce Zasler
స్వేచ్ఛానువాదం: సంచిక టీమ్
A Soldier’s Prayer
~
The earth is soft beneath my feet, the sun ablaze with desert heat,
The quiet stillness does not last, intermittently gun-fire blasts.
I stand on guard, alert and ready, my gun positioned, my hand is steady.
Within my being I feel the ache of prices paid for victory’s sake.
Although I’m weary of death and war, I must be brave at twenty-four.
Pain and grief tucked away, replaced with strength renewed each day,
that’s been embedded centuries deep, and glow with hope for us to reap.
And everywhere a silent prayer emitted from a soldiers heart
rings out upon this historic land, of which we are a part!
By Joyce Zasler