Site icon Sanchika

సరికొత్త ధారావాహిక ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ – ప్రకటన

[dropcap]వి[/dropcap]శ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారి కలం నుంచి జాలువారిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

***

జీవితంలో ఆర్థికంగా చిక్కులు ఎదుర్కుంటున్న అగ్రజాతిలో పుట్టడమే తన కొడుకు చేసుకున్న దురదృష్టమని బాధపడ్తూ ఉంటాడు. సాధారణంగా అపారమైన తెలివి తేటలు గల వాళ్ళ దగ్గర సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం ఉండదు. అడుగడుగునా దరిద్రం తొంగి చూస్తుంది వీళ్ళ ఇళ్ళల్లో. బాధ్యతలు, వాటికి తగ్గ ఆదాయం లోపిస్తుంది.

ఒక వేఫు జీవితంలో అడుగడుగనా లోటు. లోపభూయిష్టమైన జీవితం. కోరికలు అనంతం. ఆ కోరికల్ని తీర్చుకోలేని నిస్సహాయ పరిస్థితి. కోరికలు తీరలేదని నిస్పృహ, నిరాశ, భావోద్వేగాలు.

జీవితంలో డబ్బు ఉన్న వాళ్ళందరూ సుఖపడ్డం లేదు కాని సుఖపడ్డానికి డబ్బు ఒక సాధన. డబ్బు లేని వారు ఎందుకూ కొరగారు. డబ్బు లేని వాడికి విలువ తెలిసినట్లు డబ్బున్న వాడికి తెలియదు. అందనంత వరకే ఏ వస్తువుకైనా విలువ. ఆ వస్తువు అందిన తరువాత ఆ వస్తువు మీద నిర్లక్ష్య భావన. దానిని సక్రమంగా వినియోగించకపోవడం దాని విలువ గ్రహించకపోవడమే.

***

ఆసక్తిగా చదివించే ఈ ధారావాహిక వచ్చే వారం నుంచి.

Exit mobile version