‘సమకాలీనం’ పద్యకావ్యం ప్రారంభం – ప్రకటన

0
2

[dropcap]మ[/dropcap]న సమాజంలో ఎన్నో సమస్యలు! వాటిని ఛందోబద్ధంగా, పద్యాల రూపంలో చర్చించాలానే ఆలోచన ప్రముఖ రచయిత, కవి శ్రీ పాణ్యం దత్తశర్మ గారికి వచ్చింది.

సోషల్ ఈవిల్స్‌కు సంబంధించిన టర్మినాలజీ అంటే పదజాలం ఆధునికంగా ఉంటుంది. ఆంగ్ల భాష ప్రమేయం లేకుండా ఉండదు. అటువంటి విషయాలను ఛందస్సులో చెప్పాలంటే కొంచెం, కొంచెమేమిటి, చాలా కష్టమే! ఈ పద్యకావ్యంలో 22 సమకాలీన సామాజిక సమస్యలను, వాటికి సాధ్యమైన పరిష్కారాలను సూచించటం జరిగింది. దీనిని ‘ఖండకావ్యము’ అనడానికి వీలులేదు. ఎందుకంటే ఖండకావ్యంలోని థీమ్స్ అన్నీ దేవికవి వేరుగా ఉంటాయి. ఇందులో శీర్షికలన్నీ ఒకే కాన్సెప్ట్‌కు సంబంధించినవే కాబట్టి దీనిని పద్యకావ్యమే అనడమే సబబు.

ఇందులో ఇంచుమించు 250 పద్యాలు ఉన్నాయి. ఛందోవైవిధ్యం కోసం, రెగ్యులర్‍గా వాడే కందం, సీసం, చంపక, ఉత్పలమాల, శార్దూల మత్తేభాలే కాక, పంచ చామరము, సుగంధి లాంటి వృత్తాలు కూడా ఉపయోగించడం జరిగింది.

దీనిలో పర్యావరణం, కుల వివక్ష, వి.ఐ.పి. దర్శనాలు, కన్స్యూమరిజం, ఆడంబర వివాహాలు, స్త్రీల సమస్యలు, మేధావుల వలస, లౌకిక వాదం మతతత్వం, పిల్లలపై లైంగిక హింస, వృద్ధుల సమస్యలు.. ఇలా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై చర్చించడం జరిగింది.

ఉత్తమాభిరుచి గల సంచిక పాఠకులు ఈ పద్యకావ్యాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

***

‘సమకాలీనం’ పద్యకావ్యం వచ్చే వారం నుంచే

సంచికలో ప్రారంభం.

చదవండి.. చదివించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here