Site icon Sanchika

సంచిక దీపావళి కథల పోటీ 2022 ప్రకటన

[dropcap]2[/dropcap]022 దీపావళి సందర్భంగా కథల పోటీ నిర్వహించనుంది సంచిక.

ఈ కథల పోటీలో ఎంపికచేసిన కథలకు చెరో వెయ్యి రూపాయలు చొప్పున 20 బహుమతులుంటాయి. అంటే మొత్తం రూ.20,000/- బహుమతులన్నమాట!!!!

ఏ అంశంపై రాయలన్నది రచయితలే నిర్ణయించుకుంటారు అంటే ఇతివృత్తం రచయితల ఇష్టం. కల్పన ఏదయినా, ఊహ ఏదయినా అర్థవంతంగా, ఆసక్తికరంగా, తార్కికంగా వుండాలి. సందేశాలు, నీతులు అంతర్లీనంగా, ప్రతీకాత్మకంగా వుంటే మంచిది. అంతేగానీ, సందేశాలు, నీతులు, సామాజిక స్పృహల కోసమే కథ రాయాలనుకోవద్దని సూచన.

కథల నిడివిపై పరిమితి లేదు. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా పంపవచ్చు.

ఎంపికయిన కథలతో పాటూ పంపిన కథలన్నీ సంచికలో ప్రచురితమవుతాయి.

బహుమతులు ప్రకటించే సమయంలో సంచిక ఆ కథ ఏ విభాగానికి చెందిందో నిర్ణయించి ఆ విభాగంలో బహుమతి ప్రకటిస్తుంది.

అయితే, మొత్తం 20 బహుమతులలో 5 నుంచి 8 బహుమతులలో యువ రచయితలకు ప్రాధాన్యం వుంటుంది. అంటే 12 బహుమతులకు వయసుతో నిమిత్తం లేదు. కానీ, వీలును అనుసరించి 5 నుండి 8 బహుమతులు 50 ఏళ్ళలోపు రచయితలకు ప్రధానంగా వుంటాయి. కాబట్టి 50, అంతకన్నా తక్కువ వయసున్న రచయితలు హామీ పత్రంలో తమ వయసును తెలపాల్సి వుంటుంది. అందుకు ఎలాంటి ఋజువు చూపనవసరంలేదు. కేవలం వయసు ఎంతో రాస్తే చాలు. ఇది యువ రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ఏర్పాటు.

కథలను సంచికకు సెప్టెంబరు 30, 2022 తేదీలోగా చేరేట్టు పంపాలి.

కథలను ఈ మెయిల్ kmkp2025@gmail.com కు కానీ పోస్టులో Plot No32, HNO 8-48, Raghuram nagar colony, Aditya Hospital Lane, Dammaiguda, Hyderabad-83  అడ్రసుకు కానీ పంపాలి. రచయిత పేరు, ఫోను నంబరు, ఈ మెయిల్ తప్పనిసరిగా రాయాలి. హామీ పత్రం తప్పనిసరి. కథపైన ‘సంచిక 2022 దీపావళి కథల పోటీకి’ అని స్పష్టంగా రాయాలి.

ఏవైనా సందేహాలుంటే 9849617392 నంబరుకు ఫోను చేయవచ్చు.

రచయితలు ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొని తెలుగు సాహిత్యంలో ఈ పోటీని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. విజయవంతం చేయాలని అభ్యర్ధిస్తున్నాము.

Exit mobile version