Site icon Sanchika

సంచిక 2022 దీపావళి కథల పోటీ ఫలితాలు

[dropcap]సం[/dropcap]చిక నిర్వహించిన 2022 దీపావళి కథల పోటీకి కథలు పంపినవారందరికీ అభినందనలు. ధన్యవాదాలు.

ఈ ఉగాదికి సంచిక నిర్వహించిన విభిన్నమైన కథల పోటీకి వచ్చిన కథలు నిరాశ కలిగించాయని, అనుకున్న స్థాయిలో లేవన్న చేదు నిజాన్ని సంచిక స్పష్టం చేసింది.

కథ రాయాలన్న ఉత్సాహం వున్నా, రాసే విధానం తెలియక, వినూత్నమయిన ఆలోచనలున్నా, ఆ ఆలోచనను ఆకర్షణీయమైన రీతిలో చేప్పే పద్ధతి తెలియకపోవటంవల్ల చక్కని ఆలోచన కూడా చతికిలపడే కథగా మిగులుతోందని నిజాన్ని నిక్కచ్చిగా తెలిపింది సంచిక.

బహుశా, ఈ చేదు నిజాన్ని స్వీకరించేందుకు రచయితలు సిద్ధంగా లేరో, లేక, ఇలా నిజాన్ని బహిరంగంగా ప్రకటించటం నచ్చలేదో, సంచిక ప్రామాణికాలు మరీ ఎక్కువ అని అనుకున్నారో తెలియదుగానీ, ఈ సారి పోటీలో పాల్గొనేందుకు రచయితలు ఉత్సాహం చూపలేదు.

మామూలుగా రాయకున్నా కథల పోటీలంటే తప్పనిసరిగా రాసేవారు కూడా ఈసారి సంచిక కథల పోటీవైపు చూడలేదు. కొందరు రచయితలు సంచికవైపు చూడరు. మరికొందరు రచయితలు, ముఖ్యంగా, ఇతర కథల పోటీల్లో తప్పనిసరిగా బహుమతులు గెలుచుకునేవారు సంచిక కథల పోటీల్లో ఎలాగో పాల్గొనరు.

సంచిక కథల పోటీల్లో బహుమతుల ఎంపికలో ఎలాంటి లొసుగులువుండవని వారికి తెలుసు కాబట్టి, సంచిక కథల పోటీల వైపు కూడా చూడరు. కానీ, రచయితలు నాణ్యమైన కథలు రాయలేదని వ్యాఖ్యానించగానే, కథల పోటీలో పాల్గొనకపోవటం, సమకాలీన రచయితలలో విమర్శను స్వీకరించలేనితనాన్ని సూచిస్తుంది.

కథలో నాణ్యత లోపించిందంటే, లోపాలేమిటో తెలుసుకుని, వాటిని ఎలా సరిచేయాలో గ్రహించి, కథా రచన ప్రక్రియ పట్ల అవగాహనను సాధింఛి, కథ బాగాలేదని అన్నవారితోనే అద్భుతమయిన రచన అన్న ప్రశంసను పొందాలన్న పట్టుదల, తపన, ఆత్మవిశ్వాసాలు సమకాలీన రచయితలలో లోపించాయని సంచిక కథల పోటీకి వచ్చిన స్పందన నిరూపిస్తుంది.

ఇలా, అధిక సంఖ్యలో రచయితలు సంచిక కథల పోటీకి స్పందించాలంటేనే వెనుకాడి, పోటీలో పాల్గొనటం నుంఛి విరమించుకున్న తరుణంలో, కొందరు రచయితలు పోటీలో ధైర్యంగా పాల్గొన్నారు. కొందరు రెండు కథలను పంపించారు. వారికి సంచిక బహు కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతోంది.

సంచిక అందించాలనుకున్నది ఇరవై బహుమతులు. పోటీకి కథలు పంపి పోటీని విజయవంతం చేయటంలో తమవంతు పాత్రను పోషించిన రచయితలందరికీ అభినందనలు తెలుపుతూ, పోటీలో పాల్గొన్న రచయితలందరినీ బహుమతికి అర్హులుగా పరిగణించి అందరికీ బహుమతులను అందచేస్తున్నది. ఒక రచయితకు ఒకే బహుమతి ఇవ్వాలన్న నియమం వల్ల, మొత్తం పదిహేడు గురు రచయితలకు చెరో వెయ్యి చొప్పిన మొత్తం పదిహేడు బహుమతులను అందచేస్తున్నది. పోటీకి అందినవి మొత్తం 20 కథలు. కొందరు రచయితలు రెండు కథలు పంపటంతో మొత్తం 17 మంది రచయితలకు చెరో వెయ్యి రూపాయల చొప్పున 17 బహుమతులను అందచేస్తున్నాము.

2022 దీపావళి కథల పోటీకి అందిన కథలు

  1. మానవతే మతం – పాణ్యం దత్తశర్మ
  2. అవును ఆమె జయించింది – సూర్య ప్రసాదరావు ఎం.
  3. మధుర యామిని – కొండూరి కాశీవిశ్వేశ్వరరావు
  4. మార్పు మంచిదే! – కె.వి.లక్ష్మణ రావు
  5. వాన కురిసిన రాత్రి – సన్నిహిత్‌
  6. ఈ తరం కథ – గోనుగుంట మురళీకృష్ణ
  7. దైవం మానవ రూపంలో – గోనుగుంట మురళీకృష్ణ
  8. ఏకాంత సేతువు..! – బి. కళాగోపాల్
  9. ‘ఛాయా’చిత్రం – డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
  10. స్వాభిమానం – ఎమ్. విజయశ్రీముఖి
  11. తానొకటి తలిస్తే – గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం
  12. పిల్లొచ్చింది బాబోయ్! – శ్రీరుద్ర
  13. నిజానికి ఇంకో వైపు – సన్నిహిత్‌
  14. ప్రపంచం మారిపోతుంది – ఎం.జి. వంశీకృష్ణ
  15. పాపం కోటిగాడు – గంగాధర్ వడ్లమన్నాటి
  16. మన కథే – పొన్నాడ సత్యప్రకాశరావు
  17. నాకు అది పడదు – గంగాధర్ వడ్లమన్నాటి
  18. అపర్ణ – కోరుకొండ వెంకటేశ్వర రావు
  19. అమ్మ గుర్తుకొచ్చినప్పుడు – ఆనంద్ నూనె
  20. విషవృక్షంలో ఒక కొమ్మ – నల్లబాటి రాఘవేంద్రరావు

ఈ కథలన్నీ త్వరలో సంచికలో ప్రచురితమవుతాయి.

త్వరలో సంచిక మరో కథల పోటీని నిర్వహిస్తుంది. వివరాలు త్వరలో..

Exit mobile version