[dropcap]ర[/dropcap]చయితలకు, పాఠకులకు, సంచిక శ్రేయోభిలాషులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు!
సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీకి 300 పైగా కథలు పంపి పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు. పోటీలో వర్ధమాన కథకులు, సీనియర్ రచయితలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మాకు అందిన మూడువందలకు పైగా కథల నుంచి 140 కథలను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా ప్రచురణకు ఎంపిక చేశాము.
ఆ ఎంపికయిన కథల నుండి కొన్ని ప్రామాణికాలు నిర్ణయించుకుని, 60 కథలను బహుమతి ఇవ్వదగ్గ కథలుగా ఎంపిక చేశాము. ఆ తరువాత ఈ కథలను ముగ్గురు పాఠకులకు ఇచ్చి 40 కథలను ఎంపిక చేయమన్నాము.
వారిచ్చిన కథలను న్యాయ నిర్ణేతలు ముగ్గురికి ఇచ్చి విడివిడిగా 20 కథల జాబితా ఇవ్వమన్నాము.
వారిచ్చిన 20 కథల జాబితాలో కామన్‌గా ఉన్న కథలతో ఒక జాబితా తయారు చేశాము. ఆశ్చర్యంగా మూడు జాబితాల్లో కామన్‌గా ఉన్న కథల సంఖ్య 16.
ప్రైజ్ మనీ ₹ 40,000/- లను ఈ 16 కథకులకు ఒక్కొక్కరికీ ₹ 2500/- బహుమతిగా నిర్ణయించటం సులభమయింది.
₹ 2500/- బహుమతి పొందిన కథలు, కథకులు:
- మొక్కై వొంగనిది – కె. లక్ష్మీ శైలజ (కరణం శైలజ)
- వాన ముద్దు-వరద వద్దు – మంగు కృష్ణకుమారి
- అంత్రాల రొట్టె – బి.కళాగోపాల్
- అంతఃచక్షువు – డా. సన్నిహిత్
- ప్రతుష్టి – సంధ్యా యల్లాప్రగడ
- అతడు రాతి మనిషి – బలభద్రపాత్రుని ఉదయ శంకర్
- కార్తీక దీపాలు – ఆసూరి హనుమత్ సూరి
- వెడ్ షూట్స్ – పి వి రామ శర్మ
- నిచ్చెన! – బులుసు సరోజినిదేవి
- డైరీ – సింగీతం ఘటికాచల రావు
- బిచ్చగాడు – శిరిప్రసాద్
- భిన్న కోణాలు – తిరుమలశ్రీ/పి.వి.వి. సత్యనారాయణ
- బంధం-ఆసరా-అనుబంధం – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
- బహుశా – జె.ఎస్.వి. ప్రసాద్
- ఊరు రమ్మంటోంది! – కె.వి.లక్ష్మణ రావు
- రేపటిని ప్రేమించు – కోపూరి పుష్పాదేవి
~
సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ పోటీల్లో ఎక్కడా సంపాదకుల విచక్షణ వోటు అవసరం రాలేదు. పాల్గొన్న రచయితలకు, న్యాయనిర్ణేతలకూ శతకోటి వందనాలు.
సంచికతో బాటుగా, బహుమతులను స్పాన్సర్ చేసిన డా. అమృతలత గారికి, శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారికీ, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తొలి వడపోత తరువాత ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినప్పుడు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు ముందుకొచ్చి, కొంత మొత్తాన్ని తామూ స్పాన్సర్ చేస్తామన్నారు. అయితే అప్పటికే పుట్టి నాగలక్ష్మి గారు పోటీ కోసం తమ కథ పంపి ఉండడంతో, వారి అనుమతితో వారి కథను బహుమతికి పరిశీలించలేదు, సాధారణ ప్రచురణకు మాత్రమే పరిగణించాము.
~
సాధారణ ప్రచురణకు ఎంపికయిన కథల జాబితా:
- జాలి లేని బ్రహ్మయ్య – ఆరుపల్లి గోవిందరాజులు
- సర్ ప్రైజ్ – పెద్దాడ సత్యనారాయణ
- ఏమీ అక్కర్లేదు – అనూశ్రీ గౌరోజు
- పుణ్య గోదావరి – పోలసల వేట – రాజు.కల్లూరి
- మళ్ళీ తాకిన పరిమళం…! – అవ్వారు శ్రీధర్ బాబు
- మూగమనసులు – తాడూరి స్నిగ్ధ
- దేవుడు పుట్టిన రోజు – పి. రాజేంద్రప్రసాద్
- ఇసుక గూళ్ళు – పాలేగారు ఇందుమతి
- నేను ఓడిపోలేదు – కె.వి.సుమలత
- అవిడియాలు అను చోర పురాణం – పి.వి.ఆర్.శివకుమార్
- అలా జరగనివ్వను – వాత్సల్య జి
- మరపురాని మనిషి – ఇరిగినేని హనుమంతరావు
- అట్టడుగు పొర – విజయ్ ఉప్పులూరి
- సుబ్బూ ది గ్రేట్ – ఆరుపల్లి గోవిందరాజులు
- సుబ్బన్న పరుగు – పొత్తూరి సీతారామరాజు
- జ్ఞాపకాల పొదరిల్లు – యలమర్తి అనూరాధ
- ఎల్లక – వజ్జీరు ప్రదీప్
- దేవుడు మెచ్చుకున్నాడు – లక్ష్మీ గాయత్రి
- సిరిగల చోటు – గొర్రెపాటి శ్రీను
- మందు కంటే మత్తెక్కించేవి – అంబల్ల జనార్దన్
- తెగిన గాలిపటం – అడప రాజు
- అనుబంధాల సంకెళ్లు! – ఏ.అన్నపూర్ణ
- కాళరాత్రి – పారుపల్లి అజయ్ కుమార్
- ఇలలో దేవత – గొర్రెపాటి శ్రీను
- నీ తోడు ఎన్నడు వీడకు! – తెలికిచెర్ల విజయలక్ష్మి
- పొట్లం కట్టిన పేపర్ – సురేఖ పులి
- నోన్ డెవిల్ – ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
- చిత్ర కథ – శింగరాజు శ్రీనివాసరావు
- కీర్తి – షహనాజ్ బతుల్
- బాధలో.. – వి. రాజారామమోహన రావు
- తెగిన బంధాలు – డా. మైలవరపు లలితకుమారి
- సావాస దోషం – కె.వి.లక్ష్మణ రావు
- మూడు మనసుల మూగ వేదన – సిహెచ్. సి. ఎస్. శర్మ
- ఎల్లాయమ్మ చిట్కా – డా. జొన్నలగడ్డ మార్కండేయులు.
- సినీవాలి – కె ఎన్ మనోజ్ కుమార్
- నిజంగా మాది ప్రేమే.. – పాణ్యం దత్తశర్మ
- దహనం – శింగరాజు శ్రీనివాసరావు
- మిత్రద్వయం – అప్పరాజు నాగజ్యోతి
- అస్తమించని సూర్యుడు – కొత్తపల్లి రవి కుమార్
- నేల చెప్పిన రహస్యం… – శైలజామిత్ర
- గీత – వి. ప్రసాదరావు
- పాలవన్నె – వడలి రాధాకృష్ణ
- జీవన మాధుర్యం – వి. ప్రసాద రావు
- కొత్త ఊపిరి – వి. శారద
- డాలర్ బాబాయి – భమిడి వెంకటేశ్వర్లు
- సతి గమనం ఎంత కఠినం – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
- కోణార్క్ ఎక్స్ ప్రెస్ నవ్వింది – దాసరి మోహన్
- కోడ్ నెంబర్ – భాగవతుల భారతి
- (మా)నవజీవనం – టి. వి. యెల్. గాయత్రి
- వరద – డా. కొఠారి వాణి చలపతిరావు
- ఒక వెలుగు చార – సింహప్రసాద్
- పరివర్తన – వెంపరాల దుర్గాప్రసాద్
- సబల – టి. వి. యెల్. గాయత్రి
- తమసోమా జ్యోతిర్గమయ.. – బి.కళాగోపాల్
- యే ఆగ్ కబ్ భుజేగీ- లక్ష్మీ గాయత్రి
- తెలి మంచు – ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
- పునీత పునర్జీవితం – విజయారంగనాథం
- మీనా – కొత్తపల్లి రవి కుమార్
- రారా మా ఇంటికి – వి శ్రీనివాస మూర్తి
- అమ్మ దగ్గరకి… – కస్తూరి రాజశేఖర్
- ఆత్మశాంతి – వేలూరి ప్రమీలాశర్మ
- పిల్లలు – వెంపరాల దుర్గాప్రసాద్
- నిన్నా మొన్నటి ముచ్చట – పెనుమాక నాగేశ్వరరావు
- రంగు రంగుల పూలు – బండారి రాజ్ కుమార్
- ధైర్యం మన తోడుంటే.. – జి.ఎస్.ఎస్. కళ్యాణి
- నామజపం – సంధ్యా యల్లాప్రగడ
- పెద్దమ్మ కోరిక -డాక్టర్ మామిడాల శైలజ
- ఆమెకు అందిన ఉత్తరం – సృజన
- ఆదర్శపు అనుబంధాలు – జగన్ మిత్ర/డాక్టర్ కె జె రావు
- మానవత్వపు పరిమళింపు – పి.ఎల్.ఎన్. మంగారత్నం
- అద్వైతం – నరహరి రావు బాపురం
- ఈనాటి ఈబంధమేనాటిదో – మోహనరావు మంత్రిప్రగడ
- సరదాగా సెల్ఫీ – పి.ఎల్.ఎన్. మంగారత్నం
- సుపారి కిల్లర్ – డాక్టర్ మామిడాల శైలజ
- గుదిబండలు- బివిడి ప్రసాద రావు
- దురభిమానం – పి.ఎల్.ఎన్. మంగారత్నం
- పల్లె ప్రకృతి వనం మన ఊరు నందన వనం – డి. వివేకానంద
- పునరపి – వింజనంపాటి రాఘవరావు
- అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మా – జీ.యన్.వీ. సత్యనారాయణ
- అమ్మకి ప్రేమతో (చిరు కానుక) – ఎమ్. జి. సరస్వతి దేవి
- ఓస్ ఇంతేనా – సింగీతం ఘటికాచల రావు
- మాధవ గీతం – మళ్ళ .కారుణ్య కుమార్
- కిటికీ – జె.శ్యామల
- రెచ్చగొట్టిన పేదరికం – అగతంబిడి ఉదయ్ కైలాష్
- గెలవడమంటే – నామని సుజనాదేవి
- ప్రయోజన విద్య – సింగీతం ఘటికాచల రావు
- నిశ్శబ్ద యుద్ధం – గొర్తి వాణి శ్రీనివాస్
- ఓ రేయి! తెలవారకోయి! – సృజన
- సారీ అత్తమ్మా.. – వి. శాంతి ప్రబోధ
- క్షణకాలం – అంజనీదేవి శనగల
- ప్రేమ ఒక అద్భుతం – ఓట్ర ప్రకాష్ రావు
- చనుబాలు – వాడపల్లి పూర్ణ కామేశ్వరి
- యక్ష ప్రశ్న – జి. ఉమామహేశ్వర్
- జ్ఞాని – పొన్నాడ సత్య ప్రకాశ రావు
- మనిషికి మనిషి – డాక్టర్ ఎమ్ సుగుణ రావు
- సారం-సంసారం – తెన్నేటి శ్యామకృష్ణ
- లంకె బిందెలు – డా. వాణీ సుబ్రహ్మణ్యం
- పదిల కదంబం – శ్రీరుద్ర/రుద్రవరపు శ్రీధర్
- పునరపి జననం – సీత
- రంగులు వెలసిన తెర – శారద పువ్వాడ (తడకమళ్ళ)
- వికసించిన అభిమానం – అవేరా/అనుసూరి వేంకటేశ్వర రావు
- ఆమె ఆశయానికి కంచె – కొత్త ప్రియాంక (భానుప్రియ)
- ప్రతిచర్య – డా. మజ్జి భారతి
- దేహం తండ్రి ప్రసాదం – జగన్ మిత్ర/డాక్టర్ కె జె రావు
- మైక్రో టు మాక్రో – కవిత బేతి
- న్యాయం కావాలి – పుట్టి నాగలక్ష్మి
- గాంధీ – వంశీకృష్ణ (తాటికొండాల సత్యనారాయణ )
- విసర్జన విస్తరి – శ్రీదేవి బంటుపల్లి
- అభిమన్యుడు – అనిసెట్టి శ్రీధర్
- సైకాలజీ రివర్స్ – గంగాధర్ వడ్లమన్నాటి
- ఆప్తుడు – సింగీతం ఘటికాచల రావు
- పరిష్కృతి – సింగీతం విజయలక్ష్మి
- ఫ్యామిలీ స్టార్ – వసుంధర
- కాంతి రేఖలు – వెంకట సుధారమణ పూడిపెద్ది
- పెద్దాపురం అల్లుడుగారికి బుద్ధి వచ్చింది – నల్లబాటి రాఘవేంద్రరావు
- మరీచిక – ఘండికోట విశ్వనాధం
- వాళ్ళు దేవుళ్ళు కాదు – మాధవి బైటారు/దేవి తనయ
- నిజం – పద్మావతి దివాకర్ల
- చేసిన కర్మము చెడని పదార్థము! – సరస్వతి కరవది
- ఎవరో.. – సి. యమున
- అభినవ గరుడ పురాణం – డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
- యాభై రూపాయలు – మహేష్ విరాట్
- దాదీమా – సిహెచ్.శివరామ ప్రసాద్ (వాణిశ్రీ)
- అవ్యక్త గాయం – పొత్తూరి సీతారామరాజు
- ఆశాంకురం – వీరేశ్వర రావు మూల
~
బహుమతి పొందిన కథలు రచించిన కథకులకు బహుమతి ధనం దీపావళి రోజు సూర్యోదయానికల్లా పంపేశాము.
ఒకవేళ ఏ రచయితకయినా తన కథ సాధారణ ప్రచురణ అవటం ఇష్టంలేక, ఆ కథను వేరే పోటీకి పంపించుకునేట్టయితే 2-3 రోజుల్లో తెలియజేయగలరు.
ముందుగా బహుమతి కథలను, ఆ తరువాత సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు సంచికలో ప్రచురిస్తాము.
అనివార్య కారణాల వల్ల ‘సైనిక కథల సంకలనం’ పని ఆలస్యమవుతోంది. ఈ సంకలనంలోకి ఎంపికయిన కథల జాబితా త్వరలో ప్రకటిస్తాము.
ఈ కథల పోటీ విజయవంతమవటంలో తోడ్పడిన రచయితలకు, న్యాయనిర్ణేతలకు, సంచిక సిబ్బందికి, ముఖ్యంగా పాఠకులకు సంచిక కృతజ్ఞతలను, మనఃపూర్వక ధన్యవాదాలను సవినయంగా తెలుపుకుంటోంది.
ధన్యవాదాలు.