‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. యయాతి భార్య (3) |
3. పాలు పితికేటందుకు వాడే పాత్రము (3) |
5. నకులుని శంఖము (3) |
6. అటునుండి చూడండి మారేడు చెట్టు కనిపిస్తుంది (3) |
8. ప్రావరణవస్త్రము (3) |
10. కార్తీకపూర్ణిమ (3) |
12. పుట్టనిది (4) |
13. అసత్యము, అప్రియము, మోసము (4) |
14. కపటము (3) |
16. నీరాజనము (3) |
17. సుశీలమ్మ, జానకమ్మ, చిత్రమ్మ, లతమ్మ — (3) |
19. సులభము (3) |
20. రాత్రి (3) |
21. అరేబియా వ్యాపారి కథలోని జంతువు (3) |
నిలువు:
1. శచీదేవి (3) |
2. మిగుల భయంకరము, శివుని ముఖములలో నొకటి (4) |
4. తలక్రిందులైన సేన (3) |
7. ఫిరదౌసి సృష్టికర్త (5) |
9. 72 మేళకర్త రాగాల వ్యవస్థలో చివరిదైన 72 వరాగం (5) |
10. మంగలికత్తెచుక్కనెల – అడ్డం 10 సంబంధిచినది (3) |
11. లవంగము (3) |
15. ఎలుగుబంటి కాదండీ – గట్టి వెదురు చెట్టు (4) |
16. నిస్పృహ ముందర వచ్చేది (3) |
18. పల్లమునకు పారు నది (3) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 మార్చి 26 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 107 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 మార్చి 31 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 105 జవాబులు:
అడ్డం:
1.కందుకూరి 4. తపస్యము 7. రాజకర్కటి 9. యముడు 11. మరాటి 13. ముని 14. పటిక 16. మక 17. మాస్టీడు 18. లుప్తము 19. అణి 20. వపువు 22. లక 24. లౌక్యంతో 26. సగటు 27. సిరిగందము 30. కంసారాతి 31. రిహలబి
నిలువు:
1.కందాయము 2. కూరాడు 3. రిజ 4. తర్క 5. పటిమ 6. ముక్కొటిక 8. కరోటి 10. మునిమాణిక్యం 12. రామములగ 13. పడువ 15. కలువు 19. అలౌకికం 21. పులగం 23. కటుతుంబి 25. తోసిరా 26. సముహ 28. రితి 30. దరి
సంచిక – పద ప్రతిభ 105 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
- కాళిపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదన రావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మావతి కస్తల
- పి.వి. రాజు
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]