[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. వర్తకుడు (5) |
4. జేసుదాస్ గారి పడవప్రయాణం దీంట్లోనే మొదలయింది (5) |
7. అడ్డం 4 లోని పడవకు ఇదేమిటో కూడా తెలియదు పాపం (2) |
8. ప్రకృతి వైపరీత్యముల వలన సర్వము కోల్పోయిన వారికి తగిన వనరులు కల్పించుట (5) |
10. రాజు గారి కొడుకులు వేటకి వెళ్ళి తెచ్చిన వాటిల్లో ఒకటి ఎండలేదుట! (2) |
12. రజనికి పుంలింగం కాదండోయ్ – సంపాదన (3) |
14. సకినలమంచం (4) |
15. ఉబ్బసం వ్యాధికి చాలా మంది వాడే మందు – 10 అడ్డంతో తయారు చేసేది (4) |
16. 9 నిలువులో ఉన్న ఇంద్రుడు (3) |
17. అమాయకురాలు కాకుండ అమాయకురాలి వలె కనఁబడు నంగనాచి (4) |
18. చాలామంది జీవితాలకు ఇదొకటి ఉంటూ ఉంటుంది – నిఘంటువు లో వెదికితే ఆధారము కనిపిస్తుంది (4) |
20. సారా కావలిసి వస్తే రాకాసిని కొట్టేసి డుబుడక్క వాడిని వెతకండి (3) |
22. రంగు (2) |
23.మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు సృష్టించి, భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందిన కోనేరు హంపి దీంట్లో నిష్ణాతురాలు (5) |
24. పూర్వకాలం ఉత్తరాలలో ముందరగా తెలియచేసేది : సున్నా తీసేసి అటునుంచి చూస్తే పార్వతి (2) |
27. భీముడు కీచకుడిని చంపిన ప్రఖ్యాత డాన్స్ స్టూడియో. (5) |
28. వైష్ణవులు నుదుట నుంచుకొను పొడి (5) |
నిలువు:
1. 9 నిలువు రాజధానిగా వేంగి సామ్రాజ్యాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడుగారి పుత్రరత్నం – ఈపేరుతో మూడు సినిమాలు కూడా వచ్చాయి (5) |
2. పదును (2) |
3. సత్యభామాదేవి చేత సంహరించబడిన రాక్షసుడు చెల్లా చెదురయ్యాడు (4) |
4. పాలగుమ్మి పద్మరాజు గారి ప్రఖ్యాత నవల – అడ్డం 4 లో ఉన్నదే (4) |
5. చదువులతల్లి (2) |
6. జనులు వేసే నింద (5) |
9. దుర్గా సినీటౌన్, దక్షిణ భారతదేశములోని మొట్టమొదటి సినిమా స్టూడియో – 1936లొ నిడమర్తి సూరయ్య గారిచే స్థాపించబడింది ఈ ఊళ్ళోనే (7) |
11. బంతి పూవు ఈవిడని ముద్దాడిందనేది ఒక పాపులర్ సినిమా పాట – తెల్లగాను పచ్చగాను కూడా ఉంటుందనేమో (5) |
13. తిరుమలలో ఉన్న ఒక పుణ్య తీర్థం (5) |
17. మార్పు (5) |
19. వారణాసిని ఇలా కూడా అంటారు- రమా శాండిల్య గారు వ్రాసిన పుస్తకం (5) |
20. వామ్మో బామ్మ చిత్రానికి పాటలు వ్రాసిన వేంకట స్వామి నాయుడు గారి ఇంటిపేరు – ద్వారం మాత్రం కాదు సుమండీ! (4) |
21.తలక్రిందయిన విసుర్రాయి (4) |
25. అడవి బాపిరాజు గారి సృష్టి — గన్నారెడ్డి గారి ఇంటిపేరు (2) |
26. బావిని కిందనుంచి పైకి చూడుండిరి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 11 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మే 29 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 9 జవాబులు:
అడ్డం:
1.బంగారానికి 4. పైలాపచ్చీసు 7. రుమ 8. బాలభారతం 10. హేల 12. మురగు 14. పరిచారం 15. క్షీరోదము 15. మరాళం 17. అవతారం 18. తకృయుగం 20. ఆగము 22. కమ్ర 23. పూలముడుపు 24. టపా 27. దధిసారము 28. రామణీయకం
నిలువు:
1.బంగారుపాప 2. రాక 3. కిసలము 4. పైచెరగు 5. పవి 6. సురాలయము 9. భారత రాజ్యాంగము 11. పంచామృతాలు 13. విరోధికృతు 17. అలకనంద 19. గంజే పానకం 20. ఆలయము 21. ముడుశ్రీరా 25. వీసా 26. బోణీ
సంచిక – పద ప్రతిభ 9 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- పడమటి సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రామలింగయ్య టి
- శంబర వెంకట రామజోగారావు
- తాతిరాజు జగం
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.