Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 118

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. వైకుంఠపాళి (8)
6. స్వభావము/వస్తుధర్మము (2)
7. మోసము (2)
9. తలవాకిటికిని నడిమివాకిటికిని నడిమి చోటు, అళిందము (3)
12. చంపకము (3)
14. ఎత్తిపొడుచు, ఒకడు చేసిన కీడును ఎదుట చెప్పు (2)
15. అడ్డం 9 మొత్తానికి ఇకార గుణింతం ఆపాదిస్తే ఒక అశ్వగతి భేదము కనిపిస్తుంది (3)
17. దొప్ప / పూలబుట్ట (2)
18. అర్చన (2)
19. డబ్బు (2)
20. నిర్యాసము (2)
22. ఎటునుండి చూసినా వదనమే (3)
24. గోల్డెన్ గర్ల్ / పయ్యోలి ఎక్స్ ప్రెస్ (2)
25. లోతులేనిచోటు, మిట్ట/సంపాదింపకోరిక (3)
27. గారాబంగా (3)
28. తీగెలుపైకి పాకుటకు అండగా పెట్టిన పుల్లలు, అల్లుడు (2)
30. జీర్ణవస్త్రము (2)
31. ధనము, అధికారము మొదలగు వానిచే అదుపాజ్ఞలు లేక విఱుగఁబాటుతో ప్రవర్తిస్తున్నాడండీ – వాడికసలు —— !(7)

నిలువు:

1. చేపట్టిన పనులన్నీ లాభదాయకంగా సఫలం కావడం గురించి ఇలా చెపుతారు (8)
2. స్త్రీ (3)
3. జూదంలో ఒడ్డే పందెం (2)
4. శేరులో నాల్గవవంతు (2)
5. దేవదారు బంకతోఁ జేసిన ధూపము (3)
8. ఆడంబరముగా వేషభాషలు ధరించినవాఁడు (7)
10. దండోరావేయు తప్పెట (2)
11. వెదురుచాఁప లోనగువానితో నేర్పఱచిన మఱుగు (2)
13. నాశముచేయు/ వృద్ధిఁ బొందించు – రెంటికీ ఒకటే మాటనా – మరీ చోద్యం గాపోతే?! (2)
15. స్వభావము/ తనది/శాశ్వతమైనది/సత్యము (3)
16. పధ్ధతి / ప్రకారము (3)
21. వృత్తాంతము (2)
23. కత్తి (2)
24. వక్షము/శ్రేష్ఠము (2)
26. పావడ, వస్త్రవిశేషము చెల్లాచెదురైంది (3)
27. చులకనగా క్రిందినుండి పైకి చూడండి (3)
29. తలక్రిందులైన శిస్తు (2)
30. భాగము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూన్ 11తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 118 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూన్ 16 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 116 జవాబులు:

అడ్డం:   

1.మనసారా 4. మగతగా 7. మనుసంహిత 9. శ్రమము 11. ముమహో 13. వల 14. మలకా 16. నోరు 17. యాతన 18. వుతుహ 19. మని 20. సుమము 22. రమ 24. లి లం స 26. తమురు 27. మరమరాలు 30. మయూరకం 31. మపుష్టకం

నిలువు:

1.మధుశ్రవ 2. సామము 3. రాను 4. మహి 5. గతము 6. గాలిహోరు 8. సంకెల 10. మలయానిలం 12. మనోహరము 14. మనసు 15. కావుము 19. మలినిమ 21. మహిమ 23. మరువకం 25. సమర 26. తలుపు 28. రకం 29. రామ

సంచిక – పద ప్రతిభ 116 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version