Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 12

[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. బహుమతి  (5)
4. అటుగా కుట్ర – బఠాణి కాదండి!  (5)
7. పక్షి వికృతి  (2)
8. ఆషాఢ పూర్ణిమ (5)
10.  ఉత్తరాది బాబాయ్ ని  రెండు సార్లు టీ అడుగుతున్నావేం ?  (2)
12. పుచ్చులేని కడుపుచిచ్చు చెల్లాచెదురయ్యింది (3)
14. సింహద్వారం  (4)
15. నారదుడు – పిశుక్కొనువాడు కాదు (4)
16. తల్లిని తనలో దాచుకున్న ఏనుగు (3)
17. సగము విరిసిన మొగ్గ (4)
18. నన్నయ, తిక్కన. ఎఱ్ఱాప్రెగ్గడ  (4)
20. ఆజ్ఞాపూర్వకంగా -పాట పాడు (3)
22.  రాజుగారి భార్య (2)
23. లక్ష్మీదేవి (5)
24. తిరగబడిన నామము (2)
27. ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే’ అనే పాట ఈసినిమా లోనిదే (5)
28. 53వ మేళకర్త రాగము (5)

నిలువు:

1. పరమశివుడు అర్జునునికి ప్రసాదించిన అస్త్రము (5)
2. నీరు (2)
3. ముసలివాడిని తనలో దాచుకున్న సూర్యుడు (4)
4. మొదలు కోల్పోయిన ఝాన్సీలక్ష్మీబాయి (4)
5. ఏరు దాటించు సాధనము – జన్మించి  (2)
6. వేగులవాడు (5)
9. నిండుగా,  పచ్చగా, అందంగా కళకళలాడుతూ కనిపించే స్త్రీని ఇలా వర్ణిస్తారు – ఇది ఉపమాలంకారానికి ఒక ఉదాహరణ (7)
11. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక “ఆంధ్రప్రభ” నడిపించిన సంపాదకుడు – మాణిక్య వీణ ఈయన ప్రత్యేకత  (5)
13. ముందుగా యోచించకుండా అప్పటికప్పుడు చెప్పే కవిత్వం (5)
17. పంచారామములలో మొదటిది – కృష్ణానది ఒడ్డున (5)
19. తిరగలి  (5)
20.  అజ్ఞానులు (4)
21. ఆరోహణంలో ఉదయసమయం లో పాడే రాగము (4)
25. ప్రభువు, భర్త (2)
26. రంగు చీట్ల కట్ట – పడుగు తోడిది కూడా (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మే 31వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 12 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూన్ 05 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 10 జవాబులు:

అడ్డం:   

1.విశ్వామిత్రుడు 4. సమ్మాననము 7. వన్య 8. మాతాపితలు 10. సోగ 12. శనము 14. భద్రాచలం 15. కష్టములు 16. ద్వారక 17. అనన్యము 18. చక్రవాకం 20. కద్రువ 22. గద్దె 23. కవాడుభాష 24. నార 27. దేవతాళము 28. విష్ణుచక్రము

నిలువు:

1.విష్ణువల్లభ 2. మితి 3. డుకుతాశ 4. సమ్మతము 5. నవ 6. ముజ్జగములు 9. పినవీరభద్రుడు 11. పాంచజన్యము 13. పిష్టచక్రము 17. అడగనిదే 19. కంఠేరథము 20.కవాటము 21. వభారివి 25. తాతా 26. కచ

సంచిక – పద ప్రతిభ 10 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version