Site icon Sanchika

సంచిక – పద ప్రతిభ – 129

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) నిప్పు, జఠరాగ్ని, బంగారము (2)
2) శ్రీ రామచంద్రుని తల్లి. దశరధమహారాజు భార్య (3)
5) దుర్యోధనుని మేనమామ చివరమాయమయ్యాడు (2)
7) కోరిక, దిక్కు, తృష్ణ (2)
8) బాధ్యత, స్వామ్యము (2)
9) వంటయిల్లు (4)
11) నాట్యగతి భేదము; అధికారి, యజమాని (అన్యదేశ్యంలో) (2)
12) గర్వము, నడక మందలి కులుకు (2)
13) మాడిపోవు. ఆకలిచే బాధపడు, ఎండు (2)
14) మూడు దమ్మిడీలు, అణాలో నాలుగవ వంతు (2)
15) ఒక దిక్కు, తూర్పు, ఉత్తరముల నడిమి దిక్కు (3)
16) లోపల, ఆంగ్లంలో ఋణం (2)
17) దక్షిణ పశ్చిమముల నడిమి దిక్కు, నైఋతి (3)
19) చెంగల్వ కోష్టు, గుఱ్ఱము, గాలి, ఏనుగునకు వచ్చు జ్వరము (4)
21) క్రింది పెదవి, తక్కుపైనది, క్రిందిది (3)
22) గోపికలును శ్రీకృష్ణుడును మండలాకారమున చేసిన నృత్యములు (5)
25) ధనము, ఇత్తడి, మందు, పూత (2)
26) జనపనార సంచి, వెనక నించి ముందుకి వచ్చింది (3)
27) పతివ్రత; పార్వతి (2)

నిలువు:

1) అత్రిమహాముని భార్య, మహా పతివ్రత (4)
2) నేర్పరితనము, క్షేమము (4)
4) క్రిందనించి పైకి గౌతమమహర్షి భార్య, దున్నని నేల (3)
6) కుబేరుడు. అష్ట దిక్పాలకులలో ఒకరం. ఉత్తర దిక్కుకు అధిపతి (4)
7) చివర మూడక్షరాలు లేని దిక్పాలకుడు (2)
11) సామ్యము, సాధారణము (3)
14) కానిక, రాజు దర్శనార్భము తెచ్చిన ద్రవ్యము, ఉపాయనము (3)
15) కొల్ల, ఉపద్రవము, ప్రవాసము (2)
16) అగస్త్య మహాముని భార్య (4)
17) నిమిషము, 60 సెకండ్లు (4)
18) అరుంధతి, వశిష్ఠుని భార్య, (4)
20) పతనమగుట, పడుట – తలక్రిందులై, చివరి అక్షరంలో ఉకారాన్ని కోల్పోయింది (2)
21) అల్పంలో సగమే వుంది (2)
23) కొనబడిన దాంట్లో చివర పోయింది, సగమే యింటికి వచ్చింది (2)
24) క్రింద నించి పైకివచ్చిన కుడ్యము, కౌతుకము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఆగస్టు 25తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 129 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 సెప్టెంబర్ 01 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 127 జవాబులు:

అడ్డం:   

1) రాఘవ పాండవీయము 7) టపా 8) క్కవ 10) త్యజనం 13) నగజ 15) భామ 16) స్తోత్రము 18) వ్యయం 19) జామ 20) లుప్తం 21) సాంగ 23) మునుము 25) భావి 26) త్వరణం 28) పావలా 29) షరా 31) సల 32) రాధికా సాంత్వనం

నిలువు:

2) ఘటనం 3) వపా 4) డక్క 5) వీవన 6) సత్యభామా సాంత్వనం 9) వైజయంతీ విలాసం 11) జమ 12) గోత్ర 14) గవ్య 16) స్తోమము 17) ములుము 22) గ ర 24) నువ్వు 25) భావ 27) ణంషధి 28) పాలన 30) రాకా 31) సత్వ

సంచిక – పద ప్రతిభ 127 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version