సంచిక – పద ప్రతిభ – 130

0
2

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) సారస్వత ధురీణ, రాజనీతి విద్యా విశారద, మన్నారు దాసవిలాసము కృతికర్త (9)
8) వెయ్యి స్తంభాలగుడి (5)
9) దయ, జాలి, కనికరం (3)
11) స్త్రీ తిరగబడింది (2)
12) తెల్లనిది, స్పష్టంగా, వివరంగా (4)
14) ధనలక్ష్మీ- ధనలక్ష్మిని గట్టిగా పిలవండి (4)
16) మహా సంతోషము (5)
17) చివరలేని సూక్ష్మ ఖండము, ధూళి (2)
18) కుడ్యము, గుఱ్ఱము (2)
19) గృహములు, స్థానములు, కాగితముల టావులు (3)
21) నుయ్యి, చెలమ, ఓడకంబము – వెనునుంచి ముందుకి (3)
22) మా భర్త గారు (3)
24) గొప్పవారు ఏ కారణము లేకుండా వూరకనే రారని – కుడి నించి ఎడమకి – చెప్పండి, చివర మూడక్షరాలు కొంచెం తడబడ్డాయి. (9)

నిలువు:

1) అన్నమయ్య బిరుదు. ఆ బిరుదుతో ఆయనని గట్టిగా పిలవండి (9)
2) పార్వతీ పరమేశ్వరులు (7)
3) స్త్రీ, లేత (2)
4) సంగ్రహ వ్యాఖ్య, టీక (3)
5) వర్ణము, కాంతి, శోభ, పొవు, విధము (2)
6) పొడుగాటి పొయ్యి, చీలిక, పగులు, పశువుల నీళ్లు తాగడానికి ఏర్పరచిన రాతి తొట్టి (2)
7) ఈమెగారు కళా ప్రపూర్ణ, కవయిత్రీ తిలక, సాహితీ రుద్రమ వంటి చిరుదులు పొందారు, అటు నుంచి వ్రాయాలి (9)
10) చివరలేని వాక్కు, అశుభమైనది (2)
11) నెత్తి, శిరస్సు, జుట్టు, చోటు, రంగము, పక్షము (2)
13) గారాబము, గొప్పతనము, ప్రేమము, స్నేహము, మమకారము (3)
14) క్రింద నుంచి పైకి – గోకులము, గో సంపద;  చివరి అక్షరాలు తారుమారయ్యాయి (3)
15) శిక్షించుట, చెల్లా చెదరయింది (4)
20) మంచానికి అల్లుకుని నేసుకునేది (3)
22) తల్లి యొక్క సోదరుడు, తండ్రి యొక్క సోదరి భర్త, పిల్ల నిచ్చిన తండ్రి, భర్త యొక్క తండ్రి (2)
(23) వారు రాలేరుట, క్రింద నించి పైకి (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 సెప్టెంబర్ 03తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 130 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 సెప్టెంబర్ 08 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 128 జవాబులు:

అడ్డం:   

1.తాపేశ్వరం కాజాలు 6. పోళీలు 7. మలముకో 9. ఆపద 11. పూజ కుండలు 13. కనుక 14. బూమిసుత 15. యకా 16. డుచుక 17A. లుకలకలాడు 19. పాలు 20. పరమాన్నము

నిలువు:

1.తాళీ 2. పేలు 3. కామద 4. జాల 5. లుము 6. పోలి పూర్ణం బూరెలు 8. కోవా కజ్జికాయలు 9. ఆడ 10. పలుకు 12. కుంతీసుతులు 13. కరం 16. డు లా ర 17. చుడుమా 18. కథ 18A. కప 19. పాము

సంచిక – పద ప్రతిభ 128 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు
  • దేవగుప్తాపు ప్రసూన
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కరణం రామకుమార్
  • కర్రి ఝాన్సీ
  • కాళీపట్నపు శారద
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పద్మావతి కస్తల
  • పి.వి. రాజు
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
  • శంబర వెంకట జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here