[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రావి, మారేడు, మఱ్ఱి, ఉసిరిక. అశోకము అను వటముల సమాహారం, దండకారణ్యమున ఒక భాగము (4) |
3. ఒక ఏనుగు (4) |
5. తంత్రీ వాద్య విశేషము, మెరుపు (2) |
6. వ్యాపారము, కర్మము, సేవ, స్థితి, ఉద్యోగము (2) |
8. అభిమానము, అహంకారము (4) |
9. శ్రీకృష్ణదేవరాయలు యొక్క ప్రధానమంత్రి (4) |
10. లక్ష్మి, లవంగము (4) |
12. కోకిల, తుమ్మెద ధ్వని, కంచు – ‘రవణం’ లా ధ్వనిస్తుంది |
15. మాయలోడు సినిమాలో మేజిక్ చేసేముందు రాజేంద్రప్రసాద్ నేను గానీ ఒక — గానీ వేశానంటే అని అంటూంటాడు. (2) |
16. లేతకాయ, పసరుగాయ (4) |
19. నాలుగు దిక్కులో ఒకటి, సూర్యోదయం జరిగేది (2) |
20. నవ్వుల్లో ఒకటి, చిరునగవు (4) |
21. ప్రథమావిభక్తి – అటునుంచి, చివరి రెండు అక్షరాలు తారుమారు (4) |
నిలువు:
1. కమలము, పంకరుహము (4) |
2. టీకకు టీక, టీక (4) |
3. మూషికవాహనుడు; వినాయకుడు (4) |
4. క్రింద నించి పైకి కుమారుడు (4) |
5. వీరము, మగడును, కొడుకులను గల ఆడుది (2) |
7. జంబీర వృక్షము (2) |
10. ఏనుగు మొగమునందలి బొట్లసమూహము, తామరకాడ; మొగ్గ (4) |
11. చెల్లెలు, తోడబుట్టినది (4) |
12. మన్మథుడు, కామదేవుడు (4) |
13. చేపలు పట్టు జాలము, వాగుర (2) |
14. రతీపతి, మదనుడు. కాముడు (4) |
17. సువాసిని లో 1, 3 అక్షరాలు తీసుకోండి (2) |
18. పిశాచము, సూర్యాది గ్రహము (2) |
19. నీరుపోవుటకు కట్టిన కాలువ, జలదారి (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 అక్టోబర్ 22వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 137 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 అక్టోబర్ 27 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 135 జవాబులు:
అడ్డం:
1) పర్శుపాణి/పద్మపాణి 4) కనకాంగి 7) రామచంద్రుడు 9) కరణి 11) మురగా 13) ముణ 14) ఆకసం 16) కడు 17) రంధ్రము 18) గత్తర 19) మగ 20) దంతము 22) కాదే 24) రిముపం 26) నిలువు 27) పరాన్నభుక్కు 30) దశరధ 31) విలుకాడు
నిలువు:
1) పతకము 2) పారాణి 3) ణిమ 4) కద్రు 5) నడుము 6) గిజిగాడు 8) చండిక 10) రణరంగము 12) రకరకాలు 14) ఆముదం 15) సంగము 19) మరియాద 21) తమన్న 23) దేవులాడు 25) పంపర 26) నిక్కులు 28) రాధ 29) భువి
సంచిక – పద ప్రతిభ 135 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- మధుసూదన్ తల్లాప్రగడ
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]