‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 1. పెళ్ళికి ముందర జరిపే నిశ్చయ కార్యక్రమంలో ఇరు పక్షాలవారు ఇచ్చిపుచ్చుకునేవి – ఏక వచనంలో (4) | 
| 4. వడపప్పు తోడిది – పానకం (4) | 
| 8. నలుపు తెలుపు చిత్రాల ప్రఖ్యాత ప్రతినాయకుడు -సగమే ఉన్నాడు (2) | 
| 9. వీటిని పారద్రోలి పరము నొసంగే సాధనం నారాయణ మంత్రం అని ప్రహ్లాదుడు తోటివారికి బోధించాడు (5) | 
| 11. ఇచ్చేవాడు (2) | 
| 13. ఈ ఆస్తులు మామగారివి: మరి తీసేస్తే ఏం మిగులుతాయి? (3) | 
| 15. ఇరకాటం లాంటిదే (4) | 
| 17. పులిసిన గంజి (4) | 
| 18. యీ ఫామిలీ బలే తమాషాగా ఉంటారట- రామారావు, సావిత్రి గార్ల సినిమా (7) | 
| 19. అర్ధరాత్రం (4) | 
| 20. ఊరగాయవంటి నంజుకునే పదార్థం (4) | 
| 22. ఓడస్తంభములలో కొనది – హిందీలో కాస్త వేచి ఉండమని ప్రార్థన (3) | 
| 24. తెలంగాణాలో ఖచ్చితంగా చొక్కా కాదు (2) | 
| 25. స లేని ఏడు కడలులు (5) | 
| 26. నల్లని స్త్రీ (2) | 
| 29. వకీల్ సాబ్ – పవన్ కళ్యాణ్ మాత్రమే కాదండి (4) | 
| 30. మదపుటేనుగు (4) | 
నిలువు:
| 2. ఆడంబరము (2) | 
| 3.తమలపాకుల కట్ట క్రిందనించి పైకి (4) | 
| 4. ఒక సంవత్సరం (4) | 
| 5. కుశము – వైదిక కర్మకాండలో ఉపయోగ పడే రెల్లుజాతి తృణవిశేషము (2) | 
| 6. మంచి ఆయాసం కాదండోయ్ – తేలిక అనే (4) | 
| 7. మిణుగురు పురుగు (4) | 
| 10. 1994 లో దాసరి నారాయణరావు దర్శకతత్వంలో ఏఎన్నార్, జయసుధ నటించిన కుటుంబకథా చిత్రం (7) | 
| 12. రావు గోపాలరావు గారి బిరుదు (5) | 
| 14. చేతికి తోక తగిలిస్తే కత్తి అవుతుందా? కొంచెం అటుఇటుగా అయినా సరే (5) | 
| 16. ఖ లేని అట్ట మీద బొమ్మ (3) | 
| 17. అబలా కాదు సబలా కాదు – ఒక వాయిద్యం (3) | 
| 19. లక్ష కోట్లు – కుబేరుని నవనిధులలో ఒకటి (4) | 
| 21. విష్ణు మూర్తే – స్తంభోద్భవ నృసింహస్వామి అవతారంలో (4) | 
| 22. ఏడడుగులు (4) | 
| 23. రుద్రుని కన్నువలె వుండునది – బహువచనంలో (4) | 
| 27. నీడ (2) | 
| 28. కాంతి, అందము (2) | 
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 14 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూన్ 19 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 12 జవాబులు:
అడ్డం:
1.పారితోషికం 4. ణిఠాపుడుగూ 7. పక్కి 8.గురుపూర్ణిమ 10 చాచా 12.డుచిక 14. ముఖద్వారం 15. పిశునుడు 16. మాతంగం 17. అరవిరి 18. కవిత్రయం 20.పాడుము 22. రాణి 23. కమలాలయ 24.రుపే 27. మంచిమిత్రులు 28. భూరికల్యాణి
నిలువు:
1.పాశుపతము 2. తోయం 3. కంజరుడు 4. ణికర్ణిక 5. పుట్టి 6. గూఢచారుడు 9. పూచిన తంగేడులా 11. విద్వాన్ విశ్వం 13. ఆశుకవిత్వం 17. అమరారామం 19. యంత్రపేషణి 20. పామరులు 21. ములపాభూ 25. స్వామి 26. పేక
సంచిక – పద ప్రతిభ 12 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ద్రోణంరాజు మోహన్ రావు
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- కృష్ణ విరజ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- యం. అన్నపూర్ణ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

