‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. చిన్న పిల్లల పెద్ద మాటలని – ఇలా అంటారు (9) |
6. కొల్ల, సమృద్ధి (4) |
7. కుడి నుంచి ఎడమకి – గుళిక, కబలము, బెల్లము (4) |
8. దూరముగా, దూరము, దవ్వు – (’పరుగు’ అనే అర్థం వచ్చే సంజయ్ దత్ హిందీ సినిమాలోని మొదటి అక్షరం) – ఏకాక్షరము (1) |
9. గర్వము, కస్తూరి (2) |
10. సూర్యుని వెలుగు, కిరణము, కాంతి – ఏకాక్షరం (1) |
11. స్థలములో మొదటి అక్షరం (1) |
12. వర్ణము, కాంతి, శోభ, సొంపు, విధం (2) |
14. మిక్కిలి, లక్ష్మి, హిందీ అమ్మ (1) |
16. వెనుక నించి హాజరైన పరమాత్మ (4) |
17. భూషణములు మొదలగునవి కదలుటయందును, వృక్షాదులు కదలు టయందును అగు ధ్వని, చివరి అక్షరానికి దీర్ఘం చేర్చండి (4) |
19. అవకాశవాదిలాగ (7) |
నిలువు:
1. అల్ప ప్రాణి మీద అనవసరంగా అతి పెద్ద బలప్రయోగం చేయటం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం (8) |
2. పార్వతి, గిరిరాజ పుత్రి (4) |
3. పావురము, ఒక జాతి పావురము, ఈశాన్య రాష్ట్రాలలో ఒక తెగ (2) |
4. వనసృతి, పూవులు పూయకుండానే కాయలు కాచు చెట్టు (4) |
5. చెప్పదలచుకొన్న విషయం నేరుగా చెప్పకుండా, దానికి సంబంధించిన విషయాలు చెప్పే సందర్భంలో ఉపయోగించే జాతీయం (8) |
13. ఇతరస్థలము, అవతల, ఊరి బయటి పొలము, ధాన్యపు రాశి మీఁద వేసిన ముద్ర, ఉదయం, పొద్దున (4) |
15. క్షీరాబ్ధి, సుధాబ్ధి (4) |
18. హృదయము, పశుఋతువు (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 10 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 144 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 డిసెంబర్ 15 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 142 జవాబులు:
అడ్డం:
1) దీపావళి పండుగ 4) సుభగ 6) రాజనములు 8) ద్రవద్రవ్యము 10) నవరంగము 13) మహిమ 14) పంకా 15) ములు 16) శతం 17) డగరు 19) కడుపు 23) వాచకం 24) రుమ 26) పద్మము 27) బంగారుకాసు 29) ముఖ్యము 30) వరుడు వధువు
నిలువు:
1) దీపారాధన 2) వరున 3) గజేంద్రమోక్షము 4) సుభద్ర 5) గజము 7) మునగకాడ 9) వ్యవహితుడు 11) రంపం 16) శనివారము 18) రుక్మము 20) పునర్వసువు 21) భూకంపము 22) తిరుగాడు 25) మరువ 27) బంరు 28) కాధు
సంచిక – పద ప్రతిభ 142 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- ఎం.వి.ఎస్. రంగనాధం, హైదరాబాదు
- మంజులదత్త కె, ఆదోని
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పద్మావతి కస్తల
- పి.వి.రాజు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.